Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని మళ్లీ ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు వైజయంతి, నిషిక ప్లాన్స్ వేస్తుంటారు. గతంలో శ్రీవల్లిమీద పడి గొడవ చేసిన అతనినే మరోసారి వైజయంతి పురమాయిస్తుంది. ఈసారి లవ్‌లెటర్‌ రాసి శ్రీవల్లిమీద వేయమని చెబుతుంది. ఆ సమయానికి మేం వచ్చి గొడవ చేసి తనని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తామని అతనికి చెబుతుంది. దీంతో అతను వైజయంతి చెప్పినట్లుగానే...లవ్‌లెటర్‌ రాసి తీసుకుని ఆ ఇంటి వద్దకు వస్తాడు. లెటర్‌ విసిరే సమయానికి  శ్రీవల్లి అక్కడ నుంచి తప్పుకోవడంతో ఆ లెటర్‌ నేరుగా  నట్టి ఇంట్లోకి వచ్చి పడుతుంది. అప్పుడే కౌషికి రావడం చూసి వైజయంతి, నిషిక బయపడుతుంటారు. వాళ్లిద్దరూ అక్కడి నుంచి జంప్‌ అవుతారు. దీంతో కౌషికి ఆ లెటర్‌ తీసి చదువుతుంది. వెంటనే కేదార్ చూసి అది ధాత్రి కోసమని చెప్పడంతో  ఆ లెటర్‌ తీసుకెళ్లి కౌషికి జగధాత్రికి ఇస్తుంది. ధాత్రి ఆ లెటర్‌ చూసి కోపంతో  కేదార్ వద్దకు వచ్చి నిలదీస్తుంది.  తానేమో లెటర్‌ గురించి అడుగుతుంటే...కేదార్‌ మాత్రం కాఫీ గురించి అనుకుంటాడు. దీంతో ధాత్రి ఆ లెటర్ అక్కడ పడేసి వెళ్లిపోతుంది. దీంతో ఈ లెటర్‌ యువరాజు చేతికి చిక్కుతుంది. అది చదివి తన భార్య నిషిక రాసిందనుకుని ఆమె వద్దకు వెళ్లి ప్రేమగా మాట్లాడతాడు. దీంతో ఆమె అక్కడి నుంచి జారుకుంటుంది. ఆ లెటర్‌ ఇటు తిరిగి ఇటు తిరిగి సుధాకర్ చేతికి వస్తుంది. ఆ లెటర్‌ చూసి వైజయంతి సుధాకర్‌ను అడగ్గా...నేను ఇంట్లోకి వస్తుంటే  ఆ లెటర్‌ నా కాళ్ల దగ్గర పడిందని చెబుతాడు. ఇది నీపనేనా అని నిలదీస్తే... నేనే రాశానని చెబుతుంది. కానీ అది నీకు రాసింది కాదని చెప్పడంతో...సుధాకర్‌ కోప్పడతాడు. ఆ లెటర్‌ ఒకసారి చదివి...ఎవరికి రాశావో చెప్పు అని నిలదీస్తాడు. ఆ లెటర్‌ చూసిన వైజయంతి ఉలిక్కిపడుతుంది. వెంటనే మాటమార్చాలని చూసినా కుదరదు. ఇంట్లోవాళ్లను బాధపెట్టడానికి ఏదో దరిద్రపు పని చేస్తున్నావు అని అర్థమవుతోందంటూ  సుధాకర్ వైజయంతి చెంప పగులగొడతాడు. మళ్లీ ఇలాంటి పనులు చేస్తే...తోలుతీస్తానంటూ వెళ్లిపోతాడు.

Continues below advertisement

హోంమినిష్టర్ కేసులో లీడ్‌కోసం జేడీ, కేడీ సాదూ ఆఫీసుకు వెళ్తారు. అక్కడికి గంగాధర్‌ను పిలిపించి..జేడీ మరోసారి పాత కేసు విషయాల గురించి అడుగుతుంది. తాయరు చేసిన అక్రమాలను మరోసారి గుర్తుచేసుకుని చెప్పండని అడుగుతుంది. నాకు తెలిసిందంతా అప్పుడే చెప్పాను కదా మేడం అంటాడు. తాయరు మా ఇంట్లో పనిమనిషిగా చేరి నిధులపై నిఘా వేసిందని...మా అన్నయ్య నిధులను మా ఇంటికి తీసుకొచ్చిన రోజే ఆ మీనన్‌తో కలిసి నా కుటుంబాన్ని చంపేసిందని గంగాధర్ చెబుతాడు. మీరు చెప్పింది నిజమే అయినా మనకు సాక్ష్యాలు కావాలని...దానికి మీ హెల్ఫ్‌ కావాలని జేడీ అంటుంది. మీకు ఇంకా ఏమైనా విషయాలు గుర్తుకు వస్తే చెప్పండని అడుగుతుంది. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పేశానని...ఇంకా ఏమీ లేవని గంగాధర్ అంటాడు. మీరు చెప్పే చిన్న క్లూ మాకు చాలా ఉపయోగపడుతుందని వివరిస్తుంది. ముంబయిలో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ మీనన్ హైదరబాద్‌ ఎందుకు వచ్చాడో.. ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్లను చంపాడో తెలియాలంటే మీరు చెప్పే నిజాన్ని బట్టే తెలుస్తుందని అంటుంది. అతన్ని ఎంత ప్రశ్నించినా...తనకు ఏమీ గుర్తురావడం లేదని అంటాడు. అయితే ఎప్పుడు మీకు ఏ విషయం గుర్తుకు వచ్చినా మాకు చెప్పాలని చెప్పి పంపిస్తారు. అతను కారు ఎక్కి వెళ్లేలోగా గంగధర్‌కు ఏదో విషయం గుర్తుకు వచ్చి మళ్లీ తిరిగి వస్తాడు.

మా అన్నయ్య చనిపోవడానికి ముందురోజు సీఎంతో మాట్లాడటం తాను విన్నానని గంగధర్‌ జేడీకి చెబుతాడు. ఆ ఫోన్ కాల్‌ తర్వాతే కావ్యగారు మా ఇంటికి వచ్చారని చెబుతాడు. చాలాసేపు మా అన్నయ్య, కావ్యగారు మాట్లాడుకున్నారని అంటాడు. నిధి దొరకడానికి ముందు రోజు కూడా కా‌వ్యగారు ఓ ఫైల్‌ తీసుకొచ్చి మా అన్నయ్యతో చాలాసేపు మాట్లాడిందని గుర్తుచేస్తాడు. వెళ్లేప్పుడు  ఈ ఫైల్‌ను కాపాడాలంటే  వేరే కేసు కింద తనకు తెలిసిన స్టేషన్‌లో పెడతానని చెప్పారని చెబుతాడు. ఆ ఫైల్‌ ఎక్కడ ఉందో కనిపెట్టి అందులో ఏం ఉందో తెలుసుకోవాలని కేదార్ అంటాడు. మా అమ్మ బ్యాచ్‌మెట్లు పనిచేసిన పోలీసుస్టేషన్ల్ పేర్లు ధాత్రి చెబుతుంది. ఖచ్చితంగా ఈ స్టేషన్‌లోనే ఎక్కడో ఓ చోట ఆ ఫైల్ దాచి ఉంటుందని అంటుంది. వాటిల్లో నుంచి రెండు స్టేషన్లను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వాటిల్లో నుంచి రాయదుర్గం స్టేషన్‌ను ఎంపిక చేస్తారు. సాధూ ఆదేశాలతో వాళ్లిద్దరూ రాయదుర్గం స్టేషన్‌కు బయలుదేరి వెళ్తారు. అక్కడి ఎస్‌ఐని కలిసి పాత రికార్డులన్నీ చూడాలని అంటారు.

Continues below advertisement