Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. తాగిన మత్తు దిగగానే యువరాజు మళ్లీ యథావిధిగా కేదార్‌పై మండిపడతాడు. నువ్వు నాకు అన్నవి ఏంటిరా అంటూ చులకన చేసి మాట్లాడతాడు. అటు పద్మకేసు కోసం వెళ్లిన జేడీ,కేడీ వాళ్ల అమ్మను తీసుకుని వస్తుండగా మినిస్టర్ మనుషులు గన్‌తో కాలుస్తారు.తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంటుంది.మత్తులో చిలకమ్మ రచ్చ ఫుల్‌గా మందు తాగిన చిలకమ్మ రచ్చరచ్చ చేస్తుంది.బూచీతో పాటలు పెట్టించుకుని డాన్స్‌లు చేస్తుంది.అలాగే సుధాకర్‌ను పట్టుని బావ అంటూ పిలుస్తుంది. బంగారంలాంటి మా బావకు నాకు లేనిపోని లింకులు పెట్టి అనుమానిస్తుందంటూ వైజయంతిని తిడుతుంది. అడ్డుకోబోయిన నిషికను కూడా తిడుతుంది.నా చేతిల్లో పెరిగిన దానివి నువ్వేంటే నాకు చెప్పేదని అంటుంది.ఈ మాటలు విన్న వైజయంతి,కౌషికికి ఏం అర్థంగాక చిలకమ్మ ఎందుకు అలా మాట్లాడుతుందని జగధాత్రిని అడుగుతారు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నదానిలా అందరినీ పేరుపెట్టి పిలుస్తోందని నిలదీస్తారు.దీంతో జగధాత్రి ఇంకా ఇక్కడే ఉంటే చిలకమ్మ రచ్చచేస్తుందని చెప్పి ఆమెను తీసుకుని వెళ్లి రూమ్‌లో పడుకోబెడుతుంది.అలాగే కేదార్‌ను కూడా తీసుకుని వెళ్లి బెడ్‌రూమ్‌లో పడుకోబెడుతుంది. యువరాజు తనను అన్నయ్య అని పిలిచినందుకు కేదార్ చాలా హ్యాపీగా ఉంటాడు.కేదార్ ఆనందం ఆవిరి ఉదయం మత్తు దిగగగానే రాగిణి అత్తయ్య దగ్గరకు వెళ్లి రాత్రి జరిగిన రచ్చ గురించి జగధాత్రి చెబుతుంది.మీరు కిందకు వస్తే అందరూ అడుగుతారని కాబట్టి పైనేఉండమని చెబుతుంది. అటు యువరాజు ఎప్పుడు నిద్రలేస్తాడా అని నిషిక, వైజయంతి ఎదురుచూస్తుంటారు.యువరాజు నిద్రలేవగానే గట్టిగా తిడతారు.మందు తాగితే ఒళ్లు తెలియదా అని నిలదీస్తారు.ఆ కేదార్‌గాడిని పట్టుకుని అన్నయ్య అన్నయ్యా అంటూ ఆ చిందులేంటని ప్రశ్నిస్తారు. నువ్వు చేసిన రచ్చకు మీ నాన్న, ఆ కౌశికి కూడా నీకు మనసులో కేదార్ అంటే ఇష్టం ఉందని అనుకుంటున్నారని అంటుంది.అదే జరిగితే వాడిని పెద్ద కొడుకుగా ప్రకటించి ఆస్తిమొత్తం రాసిస్తారని హెచ్చరిస్తుంది.దీంతో యువరాజు అలాంటిదేమీలేదని తాగిన మత్తులో ఏదో వాగి ఉంటానని అంటాడు. అందరూ హాల్లోకి రాగా....యువరాజు తమ్ముడికి మజ్జిగ ఇవ్వమని చెబుతాడు.దీంతో యువరాజు రెచ్చిపోతాడు. ఎవడ్రా నీకు తమ్ముడు అని అంటాడు. ఇంట్లో ఎవరినైనా నువ్వు వరసలు పెట్టి పిలుచుకోమని నన్ను మాత్రం అలా పిలిస్తే చంపేస్తానని హెచ్చరిస్తాడు. దీంతో కేదార్ చిన్నబుచ్చుకుంటాడు. అందరూ చాలా బాధపడతారు. యువరాజు ఇచ్చి వార్నింగ్‌తో నిషిక,వైజయంతి ఆనందపడిపోతారు.పద్మ తల్లిపై హత్యాయత్నం పద్మ కేసులో విచారణ కేసు ఆమెఇంటికి వెళ్లిన జేడీ,కేడీ..ఆమెను ప్రశ్నిస్తారు. పద్మ చనిపోయిన రోజు మధుబాబు మా వీధిలోనే కారు పెట్టుకుని ఉండటం మా ఆయన చూశాడని ఆమె చెబుతుంది. రోడ్డు మీద వరకు దింపుతారేమోనని అనుకున్నామని అంటుంది.ఈ విషయంమీరు మాకు ముందే చెప్పి ఉంటే ఈపాటికివాడు జైలులో ఉండేవాడని జేడీ అంటుంది.అసలు ఆరోజు తాను ఊరిలోనే లేనని మినిస్టర్ కొడుకు బుకాయించాడు, ఇప్పుడు మీరు కోర్టుకు వచ్చి నిజం చెబితే చాలు వాడికి జైలు శిక్ష ఖాయమని చెబుతుంది. తనను స్టేషన్‌కు తీసుకెళ్తుండగా మినిస్టర్ మనుషులు ఆమె షూట్ చేస్తారు. ఆమె ఛాతిలోకి బుల్లెట్ దిగుతుంది. జేడీ వెంటనే ఆ కాల్చినవాడిని ఎన్‌కౌంటర్ చేస్తుంది.వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడుతుంది.
