Jagadhatri Serial Today Episode కేథార్ మంత్రసానిని గన్ పెట్టి బెదిరిస్తాడు. ఇంతలో కేడీ, జేడీలు అక్కడికి వస్తారు. వాళ్లని చూసిన కేథార్ మంత్రసానిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఏం చేయాలో అర్థం కాక జేడీ, కేడీలు యువరాజ్‌ని బతిమాలుతారు. ఇంతలో నిషిక ఇంటికి వెళ్లకుండా యువరాజ్‌ని ఫాలో అవుతుంది. 

Continues below advertisement


నిషిక అక్కడే దాక్కోవడం చూసిన జేడీ నిషికకు గన్ గురి పెట్టి మంత్రసానిని వదలకపోతే చంపేస్తానని అంటుంది. దాంతో యువరాజ్ వదిలేస్తాడు. కేథార్ వాళ్లు మంత్రసానిని పక్కకి తీసుకెళ్లి తన తల్లి సుహాసిని గురించి అడుగుతాడు. నేనే ఆమె కొడుకుని అని చెప్తాడు. మంత్రసాని అవునా అని అడిగి కేథార్ గుండె మీద చూసి స్వస్తిక్‌ గుర్తు చూస్తుంది. నువ్వు మా సుహాసిని అమ్మ కొడుకువే బాబు అందుకు ఈ గుర్తే సాక్ష్యం నీకు మూడేళ్లు వచ్చే వరకు నేనే పెంచాను బాబు అని అంటుంది. కేథార్ ఎమోషనల్ అయిపోతూ నేను సుహాసిని కొడుకు అని చెప్పుకోవడానికి ఈ గుర్తు కాకుండా ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా అమ్మ మీరు మాత్రమే నాకు దిక్కు అని అంటాడు. 


మంత్రసాని గుర్తు చేసుకొని నీకు 3 ఏళ్లు ఉన్నప్పుడు నిన్ను స్కూల్‌కి చేర్పించినప్పుడు మీ నాన్న సుధాకర్ వచ్చాను. అప్పుడు మీ నాన్న గారితో మీరు తీసుకున్న ఫొటో కూడా ఉందని అని ఆ సాక్ష్యం కూడా మహాల్‌లోనే ఉందని చెప్తుంది. ముగ్గురు మహాల్‌కి వెళ్తారు. యువరాజ్ నిషిక వల్లే ఇదంతా జరిగింది అని దాన్ని తిడతాడు. కుదిరితే సాక్ష్యాలను కుదరకపోతే మనుషుల్ని తలగబెట్టేయాలి అని యువరాజ్, నిషికలు వెళ్తారు. కేడీ వాళ్లు రాజమహాల్‌కి వెళ్లి వెతుకుదామని వెళ్తారు. యువరాజ్ వాళ్లు వాళ్లని ఫాలో అవుతారు. కేడీ వాళ్లు సాక్ష్యాలు వెతికి దొరికిన తర్వాత మంత్రసానిని తీసుకెళ్లి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అనుకుంటారు. యువరాజ్, నిషిక కూడా మహాల్‌కి వచ్చి సాక్ష్యాల  కోసం వెతుకుతారు. మంత్రసాని ఓ గదిలోకి వెళ్లి ఈ రూమే అనుకుంటుది. అక్కడున్న బాక్స్‌లు తీసి చూసి వాటిలో నగలు, వజ్రాలు, వైడ్యూర్యాలు అన్నీ చూసి ఇన్నేళ్లకి నా కల నెరవేరిందని వాటిని మీద వేసుకొని తెగ సంబర పడిపోతుంది. 


యువరాజ్ చూసి ఇదన్నమాట నీ నిజస్వరూపం అందుకేనా నువ్వు కేథార్‌తో ఇంత ప్రేమగా మాట్లాడింది అని అంటాడు. ఇంతలో మంత్రసాని మనుషులు వచ్చి యువరాజ్‌ని పట్టుకుంటారు. మంత్రసాని యువరాజ్‌తో నువ్ఉవ అన్నావ్ కదరా నేను కిలాడీని అని అదేరా నేను అని యువరాజ్ కళ్లలో పౌడర్‌ కొట్టి మత్తులోకి వెళ్లిపోయిన యువరాజ్‌ అవయవాలను అమ్మేయమని అంటుంది. నిషిక యువరాజ్‌ని చూసి వెళ్తే నిషికను కూడా రౌడీలు తల మీద కొట్టేస్తారు. జేడీ, కేడీలకు ఈ విషయం తెలీదు. ఇంట్లో వైజయంతి కొడుకు కోడలి కోసం తెగ వెతుకుతుంది. కౌషికికి అడిగితే తెలీదు అని చెప్తుంది. 


మంత్రసాని నగలు, వజ్ర వైడ్యూర్యాలు, యువరాజ్‌, నిషికల్ని తీసుకొని తమ వ్యాన్‌లో పారిపోవడం అక్కడే ఉన్న వాచ్ మెన్ చూస్తాడు. వైజయంతి చాలా కంగారు పడుతుంది. కౌషికి జరిగింది తలచుకొని బాధపడుతుంటే సుధాకర్ ఓదార్చి కనీసం ఆఫీస్‌కి అయినా వెళ్లమ్మా మూడ్ మారుతుందని అంటాడు.జేడీ కేడీలు అన్ని గదులు వెతుకుతూ మంత్రసాని నగలు అవి కొట్టేసిన గదికి వస్తారు. అక్కడ పొడి చూసి అది క్లోరో ఫాం అని గుర్తిస్తారు. ఇంతలో వాచ్‌మెన్ వచ్చి ఒకమ్మాయి అబ్బాయిని నలుగురు రౌడీలు తీసుకెళ్లారని చెప్తారు. వాళ్లు కొంప తీసి యువరాజ్, నిషిక అయ్యుంటారేమో అనుకుంటారు. మంత్రసాని మంగమ్మని వెతకడానికి వెళ్తారు. వైజయంతి కొడుకు కోడలు కోసం ఏడుస్తూ ఉంటుంది. మీ ఇద్దరూ పట్టించుకోవడం లేదని కౌషికి, భర్తతో చెప్తుంది. సరదాగా బయటకు వెళ్లుంటారు కావాలంటే ఒక సారి జగద్ధాత్రి కేథార్‌లకు చెప్దామని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.