Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. పద్మ హత్య కేసులో గణేశ్‌కు శిక్షపడేలా చేయాలని అసిస్టెంట్ కమిషనర్‌ వివేక్‌మిశ్రా ప్రయత్నించగా..చివరి  నిమిషంలో కోర్టులో ఆధారాలు బయటపెట్టి జేడీ అతనికి షాక్‌ ఇస్తుంది. దీంతో ఈ కేసులో జడ్జి మరోవాయిదా ఇస్తాడు.బయటకు వచ్చిన తర్వాత పై అధికారిపై జేడీ ఛాలెంజ్‌ చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది.కోర్టుకు బయలుదేరిన జేడీ                               గణేశ్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు వివేక్‌మిశ్రా గణేశ్‌ను తీసుకుని వెళ్తాడు.ఈవిషయం తెలిసిన జేడీ...ఖచ్చితంగా ఇవాళ గణేశ్‌కు శిక్షపడేలా మినిస్టర్‌ ఈ మిశ్రాతో కలిసి కుట్రపన్నాడని అంటుంది.డిఫెన్స్‌ లాయర్‌ను కూడా కొనేశారని సాధు చెబుతాడు. కళ్లముందే ఓ అమాయకుడిని బలిచేస్తున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నానని సాధు బాధపడతాడు.ఇంతకు ముందులా మీకు నేను అన్ని పవర్స్‌ ఇవ్వలేకపోతున్నానని అంటాడు. కావాలనే ఈ వివేక్‌మిశ్రాను మినిస్టర్‌ ఇక్కడికి తీసుకొచ్చాడని చెబుతాడు. ఏదీ ఏమైనా నేను మాత్రం దోషులు తప్పించుకునిపోతుంటే చూస్తూ ఉరుకోలేనని జేడీ అంటుంది. వివేక్‌కు ఎదురెళ్తే మీ ఉద్యోగాలకే ప్రమాదమని సాధు హెచ్చరిస్తాడు. ఓ నిరపరాధిని కాపాడలేకపోయినప్పుడు ఈ ఉద్యోగం ఉన్నా ఉపయోగం లేదని చెబుతుంది. మేం కోర్టుకు వెళ్తామని మా శాయశక్తులా న్యాయాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామని జేడీ చెబుతుంది.

Continues below advertisement

సింధూసాయం                    కోర్టు దగ్గర మినిష్టర్‌ను కలిసిన మిశ్రా.. ఆ గణేశ్‌ను ఎన్‌కౌంటర్‌ చేద్దామని తీసుకొస్తుంటే ఆ సాధూ అడ్డుపడి నాతో లాగ్‌బుక్‌లో ఎంట్రీ రాయించాడని లేకపోతే ఈపాటికి వాడి ఎన్‌కౌంటర్‌ జరిగిపోయేదని అంటాడు. అయినా మీరు ఏం భయపడొద్దని అన్నీ మనం సెట్‌చేశామని చెబుతాడు. డిఫెన్స్‌ లాయర్‌ కూడా మన మాటే వింటాడని....ఆ జేడీ కోర్టులో నోరుతెరవకుండా నేను చూసుకుంటానని అంటాడు. ఇంతలో జేడీ తన టీమ్‌తో అక్కడికి వస్తుంది. మిశ్రా కావాలనే జేడీని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. తన షూ లేస్‌ ఊడిపోయిందని కేదార్‌ను కట్టమని అంటాడు. దీంతో జేడీకి కోపం వస్తుంది. ఇప్పుడు వీడు కావాలనే చేస్తున్నాడని కేడీ అంటాడు. షూ లేస్‌ కట్టేందుకు ప్రయత్నించగా సింధూ విభూది తీసుకుని వచ్చి పెట్టుకోమని మిశ్రాకు ఇస్తుంది. అతను విభూది తీసుకుంటుండగా కళ్లల్లోకి ఊదుతుంది. దీంతో మిశ్రా కళ్లునలుపుకునే టైంలో సింధూ షూలేస్‌ కట్టేస్తుంది. ఇదంతా మీరు ఆడిన నాటకమేనా అని మిశ్రా గణేశ్‌ను తీసుకుని లోపలికి వెళ్తాడు

కోర్టులో అదరగొట్టిన జేడీ                       కోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గణేశ్‌ను నేరం నువ్వే చేశావా అని అడుగుతాడు. దీంతో తానే ఈ నేరానికి పాల్పడినట్లు గణేశ్‌ ఒప్పుకుంటాడు. దీంతో జడ్జి కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో జేడీలేచి నేను మాట్లాడొచ్చా అని అంటుంది.వెంటనే మిశ్రా కలుగజేసుకుని నువ్వు నోరుమూసుకుని కూర్చోమని అంటాడు.అయినా జేడీ కోర్టులో మాట్లాడే అవకాశం లేదని అంటాడు. ఈకేసు విచారణ అధికారిగా నాకు ఆ హక్కు ఉందని జేడీ చెప్పడంతో...జడ్జి సరేనంటాడు. వెంటనే జేడీ బోనులోకి వెళ్లి ఈ గణేశ్‌ అసలు నేరం చేయలేదని అంటుంది. నిందితుడే ఒప్పుకుంటున్నాడు కదమ్మా అని అంటుంది. దీంతో జేడీ ఓ పెన్‌డ్రైవ్‌ తీసి ఇస్తుంది.అది చూసిన జడ్జిగారు....ఆశ్చర్యపోతారు. ఈ గణేశ్‌ తండ్రికి ఇటీవలే కిడ్ని ఆపరేషన్ జరిగిందని 20లక్షలు బిల్లు కట్టాడని చూపిస్తుంది. నెలజీతానికి పనిచేసే గణేశ్‌ 20లక్షలు ఎలా తెచ్చాడని అడుగుతుంది. అలాగే పద్మ ఆత్మహత్య చేసుకునే సమయంలో గణేశ్‌ ఆస్పత్రిలోనే ఉన్నాడని నిరూపించడంతో జడ్జి కేసు వాయిదా వేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మిశ్రా, జేడీ ఢీ అంటే ఢీ అన్నట్లు ఢీకొట్టుకుంటారు. ఈ కేసు ఓడిపోతే యూనిఫారం తీసివేసి రాజీనామా చేస్తానని జేడీ ఛాలెంజ్ చేస్తుంది.

Continues below advertisement