ఫైమా ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన స్కిట్ జడ్జ్ ఇంద్రజను అసంతృప్తికి గురి చేసింది.
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Sridevi Drama Company Latest Promo: 'జబర్దస్త్' ఫైమా పెళ్ళి తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ స్కిట్ లో ఇంద్రజ పరువు తీసేలా ఫైమా వ్యవహరించింది.

- పెళ్లి తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలోకి ఫైమా రీఎంట్రీ ఇచ్చింది.
- ఇంద్రజ తీర్పులు, వ్యక్తిగత జీవితంపై ఫైమా చేసిన స్కిట్ ఆమెను బాధపెట్టింది.
- పిలిచి మరీ అవమానించడం సరికాదంటూ ఇంద్రజ ఫైమాను ప్రశ్నించింది.
- ఇది టీఆర్పీ స్టంట్ అని చర్చ, జూలై 19న పూర్తి స్పష్టత వస్తుంది.
'పటాస్', 'జబర్దస్త్' నుంచి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 6 వరకు బుల్లితెరపై అనేక రియాలిటీ షోలు చేసింది 'జబర్దస్త్' ఫైమా (Jabardasth Faima). ఇటీవల పెళ్ళి చేసుకుని వివాహ బంధంలో అడుగు పెట్టింది. లేటెస్టుగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (Sridevi Drama Company)లో రీ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ ప్రోమోలో ఫైమా కనిపించింది. అయితే... ఇంద్రజ పరువు తీసేలా స్కిట్ చేసింది. దాన్ని ప్రోమో కట్ చేశారు.
ఇంద్రజ పరువు తీసిన ఫైమా!
బుల్లితెరపై స్కిట్స్ చేయడంలో ఫైమాది సపరేట్ స్టైల్. కామెడీ టైమింగ్ వెరైటీగా ఉంటుంది. ఎటువంటి కంటెంట్ ఇచ్చినా నవ్వించేలా చేయడం ఆమె స్టైల్. కానీ, ఆవిడ చేసిన స్కిట్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' జడ్జ్ ఇంద్రజ (Sridevi Drama Company Judge Indraja)కు నచ్చలేదని ప్రోమోను బట్టి అర్థం అవుతోంది.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమో చూస్తే... ఫైమా చేసిన స్పూఫ్ స్కిట్ పట్ల జడ్జ్ ఇంద్రజ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంద్రజను అందరూ అమ్మ అని అంటూ ఉంటారు. స్టేజిపై ఎప్పుడూ చిరునవ్వుతో హుందాగా కనిపించడంతో పాటు అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. అటువంటి ఆమె హర్ట్ అయినట్టు ప్రోమోలో చూపించడం చర్చనీయాంశంగా మారింది.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఇంద్రజ చేసే వ్యాఖ్యలు, ఆమె సింగింగ్ స్టైల్, అలాగే జడ్జ్‌మెంట్ గురించి, ముఖ్యంగా 'డెప్త్' అనే పదానికి సంబంధించి ఫైమా పేరడీ స్కిట్ చేసింది. అందులో ఇంద్రజ భర్తగా 'బుల్లెట్' భాస్కర్ నటించగా... వ్యక్తిగత జీవితాన్ని సైతం స్కిట్‌లో చూపించారు. పాలవాడితో 'డెప్త్' అంటూ ఇంద్రజ మాట్లాడుతుందన్నట్లుగా ఫైమా వేసిన కౌంటర్లు పట్ల నొచ్చుకున్నట్టు ఉన్నారు. ప్రోమో చూస్తే ఇంద్రజకు ఆగ్రహం కలిగినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా 'దసరా' సినిమాలో పాటలు ఇంద్రజ వేసిన స్టెప్పులను కూడా ఫైమా కామెడీ చేసింది.
Also Read: Jr NTR Political Buzz - ఎన్టీఆర్‌కు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
పిలిచి మరీ అవమానించడం కరెక్టేనా?
ఫైమా స్కిట్ కంప్లీట్ అయ్యాక ''పిలిచి మరీ ఇలా అవమానించడం కరెక్టేనా?'' అంటూ ఫైమాను ఇంద్రజ ప్రశ్నించారు. తన పరువు తీసేలా స్కిట్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ''హ్యాపీగా చేయండి... నేను కూడా నవ్వుకోవాలి... కానీ ఇలా ఎందుకు పరువు తీస్తారు'' అంటూ ప్రోమోలో ఇంద్రజ బాధ పడిన దృశ్యాలు ప్రోమోలో హైలైట్ అయ్యాయి. ఈ ప్రోమో మీద సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. టీఆర్పీ స్టంట్ కోసం ప్లే చేసిన స్ట్రాటజీ అని అభిప్రాయపడ్డారు. ఇంద్రజ నిజంగానే హర్ట్ అయ్యారా? లేదంటే స్క్రిప్ట్‌లో భాగమా? అనేది జూలై 19న ప్రసారం అయ్యే 'ఆషాడం పెళ్లికొడుకులు' ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.
Also Read: Shruti Haasan New Chennai Home - శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
Frequently Asked Questions
జబర్దస్త్ ఫైమా ఇటీవల ఏ షో ద్వారా బుల్లితెర రీ ఎంట్రీ ఇచ్చింది?
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఇంద్రజను ఆగ్రహానికి గురిచేసిన ఫైమా స్కిట్ దేని గురించి?
ఫైమా స్కిట్ ఇంద్రజ వ్యాఖ్యలు, సింగింగ్ స్టైల్, 'డెప్త్' అనే పదంపై పేరడీ. ఆమె వ్యక్తిగత జీవితం, 'దసరా' పాట స్టెప్పులను కూడా కామెడీ చేసింది.
ఫైమా స్కిట్ పట్ల ఇంద్రజ ఏ విధంగా స్పందించారు?
ఇంద్రజ
ఫైమా, ఇంద్రజ ఎపిసోడ్ ప్రోమోపై సోషల్ మీడియాలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి?
చాలా మంది నెటిజన్లు ఇది టీఆర్పీ స్టంట్ అని, స్క్రిప్ట్‌లో భాగమేనని అభిప్రాయపడ్డారు. నిజంగా ఇంద్రజ హర్ట్ అయ్యారా అనేది ఎపిసోడ్ ప్రసారం అయ్యాకే తెలుస్తుంది.
ట్రెండింగ్ వార్తలు





















