Intinti Gruhalakshmi Today Episode: నందుకి పరంధామయ్య పరిస్థితి అంతా చెప్తుంది తులసి. షాక్ అవుతాడు నందు. తర్వాత తండ్రిని కలవటం కోసం అతని రూమ్ కి వెళ్తాడు.
పరంధామయ్య : నందు తో కాసేపు మాట్లాడి కెఫె ఎలా నడుస్తుంది అని అడుగుతాడు.
నందు: మేము కేఫ్ మూసేసి చాలా రోజులైంది నాన్న.
పరంధామయ్య : అదేంటి ఎప్పుడు మూసేసారు, నాకు చెప్పలేదు ఏంటి, ఏంటో ఈ మధ్య ఎవరు ఏమి చెప్పడం లేదు. కేఫ్ మూసేస్తే ఇల్లు మెయింటినెన్స్ ఎలాగా.
నందు: నేను కూడా తులసి తోపాటు సామ్రాట్ గారి ఆఫీసులో పని చేస్తున్నాను.
పరంధామయ్య : అయితే గొడవ లేదు, సామ్రాట్ గారు చాలా మంచివారు. నాకు ఒకసారి ఆయనని చూడాలని ఉంది తీసుకుని రా అంటాడు.
నందు: కుదరదు నాన్న, ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయారు.
పరంధామయ్య : ఏం మాట్లాడుతున్నావ్ రా నేను సామ్రాట్ గారి గురించి మాట్లాడుతున్నాను అంటాడు.
నందు: నేను కూడా సామ్రాట్ గారి గురించే మాట్లాడుతున్నాను.
ఈ మాటలు గుమ్మం బయట నుంచి వింటున్న తులసి లోపలికి వచ్చి నిజమే మావయ్య సామ్రాట్ గారు చనిపోయారు.
పరంధామయ్య: ఏంటి నేను ఎవరి గురించి మాట్లాడినా పోయారు, పోయారు అంటున్నారు. అయినా ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు అంటాడు.
నందు తండ్రి పరిస్థితి వివరించబోతే తులసి అడ్డుకుంటుంది. మీరు పడుకోండి మావయ్య ఈలోపు ఈయన కూడా భోజనం చేసి వస్తారు అని చెప్పి మామగారిని పడుకోబెట్టి కిందికి వస్తుంది.
తులసి: మావయ్య గారికి నిజం చెప్పేద్దామనుకున్నారా అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి ఇప్పటికే ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆయనని గాజు బొమ్మ లాగా కాపాడుకోవాలి అని భర్తకి చెప్తుంది.
మరోవైపు రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చిన బసవయ్య దివ్య ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. మనం ఏం చేసినా అది లొంగేరకం కాదు కదా అంటాడు.
రాజలక్ష్మి : ఇకమీదట తను తినడానికి తాగడానికి కూడా భయపడుతుంది. అందుకే పుట్టింటికి పారిపోవాలనుకుంది పాపం అంటుంది.
బసవయ్య : కానీ మన టార్గెట్ అధికారి కదా దివ్య ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకుండా చేయాలి ఇది కదా మన ప్లాన్ అంటాడు.
రాజ్యలక్ష్మి : ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చి కుక్క అని ప్రపంచానికి తెలిసేలాగా చేయాలి. అప్పుడు మనం దాన్ని ఏం చేసినా సమాజం పట్టించుకోదు. అందుకే ఈ ఇంటిని నేను మయసభ లాగా మార్చేద్దాం అనుకుంటున్నాను అంటూ తమ్ముడికి మరదలు కి తన ప్లాన్ గురించి చెప్తుంది. అది విన్న బసవయ్య దంపతులు ఆనందపడతారు.
మరోవైపు తండ్రి గురించి ఆలోచనలో పడిన నందు ఇకపై తులసి ఏమన్నా పట్టించుకోకూడదు ఆమెకి సపోర్టుగా నిలబడాలి, తనతో పాటు నేను కూడా ఆఫీస్ కి వెళ్తాను అని రెడీ అవ్వటానికి వెళ్తాడు.
ఆ తర్వాత సీన్ లో దివ్య తల్లికి ఫోన్ చేసి కష్టం సుఖం మాట్లాడుతుంది.
దివ్య: అమ్మ.. కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలని ఉంది అక్కడికి వస్తాను అంటుంది.
తులసి : ఏ తల్లి అయినా కూతురు ఇంటికి వస్తానంటే వద్దంటుందా కానీ ఐదో నెల తర్వాత ఎలాగో నువ్వు ఇక్కడికి రావాలి కదా అంతవరకు మీ అత్తగారికి మీ ఆయనకి కూడా నువ్వు అక్కడ ఉండాలని ఉంటుంది కదా.
దివ్య: ఆవిడ కోసం నా సరదాలు వదులుకోమంటావా అవసరమైతే మా ఆయనను కూడా నాతో రమ్మంటాను.
తులసి: అప్పుడు మీ అత్తగారు చీపురు కట్ట పట్టుకుంటుంది, అయినా రావాల్సినంత ఇబ్బంది ఏమైనా ఉందా అని అడుగుతుంది.
తల్లికి ఉన్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని తన బాధని చెప్పుకోవడానికి ఇష్టపడదు దివ్య. ఇక్కడ ఉండడమే మంచిది అనుకొని ఊరికే రావాలనిపించిందిఅంతే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
తర్వాత సీన్లో
రాజ్యలక్ష్మి : మనం అనుకున్నట్టే అంతా రెడీ చేశారు కదా మయసభలో మొదటి ఘట్టం ప్రారంభిద్దాం. ఏమాత్రం తేడా వచ్చినా విక్రమ్ మనల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది.
అంతలోనే అక్కడికి వచ్చిన దివ్యతో ఉపవాసం చేస్తున్నావా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడను అనుకుంటే చేసి తీరుతాను అంటుంది దివ్య. నేను కూడా చేస్తున్నాను పదా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుందాం అని రాజ్యలక్ష్మి అనడంతో ఇద్దరు తులసమ్మ దగ్గరకి వస్తారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ముంబాయ్‌లో ప్రియాంక ఇల్లు చూశారా? ఒక స్లమ్‌లో చిన్న రూమ్‌లో అంతమంది ఉండేవారా?