Intinti Gruhalakshmi, October 19, ఈరోజు ఎపిసోడ్ లో ఇంటి చుట్టూ సీసీ టీవీ లు పెట్టిస్తుంది తులసి. ఎందుకు అని అత్తమామలు అడిగితే కారణం చెప్పకుండా వెళ్ళిపోతుంది. నందు తులసి ఎందుకో భయపడుతుంది అని అనుమాన పడతాడు.


మరోవైపు


రాజ్యలక్ష్మి : కథ అడ్డం తిరిగిందేంటి?


జాను: నాకు అదే అర్థం కావట్లేదు దివ్య ఇంత జాగ్రత్త పడుతుంది అనుకోలేదు.


రాజ్యలక్ష్మి: అది విక్రమ్ కి కూడా బ్రెయిన్ వాష్ చేస్తుంది. వాడు నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చింది కూడా వాడి ఉద్దేశం నీకు తెలియాలనే.


జాను: ఎప్పుడూ లేనిది దివ్య భయపడుతుందంటే బావని నేను లాక్కుంటానని నమ్ముతుంది. తనకి నా మీద అంత నమ్మకం ఉంటే నా మీద నాకు ఇంకెంత నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నా చెంప పగలగొట్టిందో అప్పుడే తన పతనాన్ని కొని తెచ్చుకుంది. ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకునేది బావనే. 


రాజ్యలక్ష్మి మేనకోడల్ని దూసుకుపొమ్మని ఎంకరేజ్ చేస్తుంది.


మరోవైపు అందరూ పడుకుంటే తులసి మాత్రం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ కాపలా కాస్తూ ఉంటుంది.


లాస్య: ఇదంతా ఫోన్లో అమెరికా జంటకి చూపిస్తూ.. ఎలాంటి తులసి ఎలా అయిపోయిందో అని నవ్వుకుంటుంది. నాకు కావాల్సింది ఇదే, ఇక మిగిలింది హనీ ని తిరిగి అప్పగించేలాగా చేయడం.


దానికోసమే ఎదురు చూస్తున్నాం అంటారు అమెరికా దంపతులు.


మరోవైపు రాత్రంతా నిద్ర లేక పగటి పూట డైనింగ్ టేబుల్ దగ్గర పడుకుంటుంది తులసి. అది చూసిన పరంధామయ్య దంపతులు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని లేపుతారు. కంగారుపడుతూ లేస్తుంది తులసి.


నందు: ఎందుకంత కంగారు పడుతున్నావ్.


తులసి: ఏమి లేదు పీడకల వచ్చింది అందుకే.


అనసూయ: ఇక్కడ పడుకున్నావ్ ఏంటి, రాత్రి నిద్ర పట్టలేదా.


తులసి: అవును తలనొప్పితో నిద్ర పట్టలేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


 మరుసటి రోజు రాత్రి కూడా తులసి నిద్రపోకుండా కాపలా కాస్తూ వరండాలోనే పడుకుంటుంది. తులసిని వెతుక్కుంటూ బయటికి వస్తాడు నందు.


నందు: తులసిని లేపి ఇప్పుడైనా నిజం చెప్పు, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు.


తులసి: ఎందుకు నా నుంచి అన్ని చెప్పించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు.


నందు: ఒకప్పుడు మన మధ్య దూరం ఉండేది కానీ ఇప్పుడు మనం అన్ని సమస్యలు కలిసి పరిష్కరించుకుంటున్నాం కదా.


తులసి: మళ్లీ నేను ఏం మాట్లాడినా టాపిక్ మార్చేశాను అంటారు. నేను హనీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


నందు: ఇది రాత్రులు నిద్ర మానుకొని మరీ ఆలోచించవలసినంత పెద్ద సమస్య కాదు కదా అని మనసులో అనుమానపడతాడు.


మరోవైపు పెళ్లి చూపుల్లో కూర్చున్న జానుని ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు. దానికి జాను తిక్క తిక్కగా, విక్రమ్ ని చూస్తూ సమాధానాలు చెప్తూ ఉంటుంది.


దివ్య: కావాలనే ఇదంతా చేస్తుంది అనుకుంటుంది.


పెళ్ళికొడుకు తల్లి : పెళ్ళికొడుకు ఇటువైపు ఉన్నాడు.


జాను :మా బావని తప్ప పరాయి మగవాళ్ళని చూడడానికి సిగ్గు.


పెళ్ళికొడుకు: నేను నచ్చానా


జాను: మా బావని అడిగి చెప్తాను అని చెప్పి విక్రమ్ ని గదిలోకి తీసుకువెళ్లి సిగ్గుపడుతూ బయటికి వస్తుంది.


పెళ్ళికొడుకు : కోపంగా లేచి ఇంకోసారి పెళ్లి చూపులు అంటే చెప్పిచ్చుక్కొట్టు అని తల్లికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


పెళ్ళికొడుకు తల్లి : పెద్ద సాంప్రదాయ కుటుంబం అని చెప్పి తీసుకువచ్చారు అని చెప్పి కోపంగా భర్తని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.


మరోవైపు లాస్య తులసికి ఫోన్ చేస్తుంది. కూల్ గా మాట్లాడుతున్న తులసి తో ఏంటి అంత కూల్ గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది.


తులసి: ఒకసారి భయపడతారు, రెండుసార్లు భయపడతారు అంతేకానీ ప్రతిసారి ఎవరూ భయపడరు.


లాస్య: నా బెదిరింపులు నీకు నాన్న పులి కథ లాగా అనిపిస్తుందా, అయితే ఇప్పుడు మీ ఇంటికి ఒక కొరియర్ వచ్చింది కదా..


తులసి: టెన్షన్ పడుతూ అవును అంటుంది


తరువాయి భాగంలో


విక్రమ్ : నీకు పెళ్లిచూపులు ఇష్టం లేదంటే చెప్పొచ్చు కదా అంతేగాని అలా ఎందుకు ప్రవర్తించావు.


జాను: నాకు బావ అంటే ఇష్టం, చచ్చేంత ప్రేమ అంటుంది. ఆ మాటలకి విక్రమ్ దివ్యలు ఇద్దరు షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.