Intinti Gruhalakshmi November 22 : ఈరోజు ఎపిసోడ్ లో భార్య కోసం భోజనం పట్టుకెళుతున్న నందుని వారిస్తుంది దివ్య.
దివ్య: వద్దు నాన్న ఇప్పటికే జరిగిందానికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాము ఇప్పుడు మళ్లీ కొత్త గొడవ వద్దు. అసలే అమ్మ చాలా ఆవేశంగా ఉంది. మీరు కొద్ది రోజులు అమ్మకు దూరంగా ఉండండి. నేను అమ్మకి భోజనం తినిపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్లి భోజనం తినమంటుంది.
తులసి: తినాలని లేదు మా అమ్మ వచ్చి తినిపిస్తే తింటాను.
నందు: ఆవేశంగా లోపలికి వచ్చి నేను తప్పు చేశాను నువ్వు ఏ శిక్ష వేసిన భరిస్తాను అంతేకానీ నువ్వు ఆకలితో ఉండొద్దు, నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు.
తులసి: ఆవేశంతో ఈయనని నా గదిలోకి ఎవరు రమ్మన్నారు, అసలు ఆయనెవరు నా గదిలోకి రావడానికి అని కేకలు వేస్తుంది.
దివ్య: ఎందుకమ్మా అంత ఆవేశపడతావు,ఎంతైనా అందరూ ఇంట్లో కలిసే ఉంటున్నారు కదా.
తులసి: అదే నేను చేస్తున్న పెద్ద తప్పు. ఎంత జరిగినా నేను ఇంట్లో ఉన్నాను అంటే కారణం అత్తయ్య మామయ్యల వల్లే. వాళ్లు నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని ఆవేశంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
పరంధామయ్య : చూసావు కదా తులసి మనసులో నీ స్థానం ఎంత దిగజారిపోయిందో కొన్ని రోజులైనా నువ్వు తనకి దూరంగా ఉండు అని నందుకి చెప్తాడు.
మరోవైపు ఆలోచనలో ఉంటుంది రాజ్యలక్ష్మి. ఆమె దగ్గరికి వచ్చిన బసవయ్య దంపతులు విక్రమ్ మారిపోయాడు నువ్వు వచ్చావని తెలిసిన ఇంకా ఇక్కడికి రాలేదు మాట్లాడుతారు. అంతలో అక్కడికి విక్రమ్ రావడంతో..
బసవయ్య: తను వచ్చేసరికి నువ్వు ఎగురుకుంటూ వస్తావు అనుకుంది పాపం పిచ్చి తల్లి.
విక్రమ్ : వద్దాం అనే అనుకున్నాను అమ్మ కానీ అక్కడ ఏవో పనులు ఉండటం వల్ల రాలేకపోయాను.
బసవయ్య భార్య : అల్లుడువి నువ్వు పనులు చేయటం ఏమిటి?
విక్రమ్ : అల్లుడు ఏమి ఆకాశం నుంచి ఊడి పడలేదు, నేను కూడా ఆ ఇంటి సభ్యుడినే.
బసవయ్య భార్య : దివ్య ఏది, అత్తగారు వచ్చిందని తెలిసిన రాలేదా అని నిష్టూరంగా అడుగుతుంది.
విక్రమ్: అక్కడ తన అవసరం ఉంది, దివ్య అందరు లాంటిది కాదు తనే నన్ను దగ్గరుండి ఎక్కడికి పంపించింది తన గురించి తప్పుగా మాట్లాడొద్దు అని బసవయ్య దంపతులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
విక్రమ్ ప్రవర్తనకి అందరూ షాక్ అయిపోతారు.
రాజ్యలక్ష్మి : విక్రమ్ ఎప్పుడూ నా కాలి కింద చెప్పు లాగే ఉండాలి వాళ్ళిద్దర్నీ ఎలా అయినా విడదీస్తాను.
మరోవైపు తల్లిపోయిన తోటికోడల్ని పలకరించడానికి బయలుదేరుతుంది భాగ్యం.
లాస్య: నేను కూడా నీతో వస్తాను, నేను కూడా తనని పలకరిస్తాను.
భాగ్యం: వద్దు, అక్కడికి వస్తే నువ్వు ఏదో ఒకటి అంటావు. నన్ను ఇరికించేస్తావు.
లాస్య: అలాంటిదేమీ జరగదు.
భాగ్యం : అయినా వద్దంటే నువ్వు మానేస్తావ్ ఏంటి త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అనటంతో లాస్య ఆనందంగా రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తుంది.
మరోవైపు తల్లిలో ఎప్పుడు అంత ఆవేశాన్ని చూడని దివ్య ఆలోచిస్తూ కూర్చుంటుంది.
పరంధామయ్య దంపతులు : ఏమ్మా, అలా కూర్చున్నావ్ ఏమి ఆలోచిస్తున్నావ్.
దివ్య: అమ్మ ఎప్పుడు ఇంత మొండిగా ప్రవర్తించలేదు. అసలు ఏమీ తినటం లేదు, తాగటం లేదు.
పరంధామయ్య : తన విషయంలో నందుని క్షమించగలిగింది కానీ ఇప్పుడు నందుని క్షమించలేక పోతుంది తను భోజనం చేయకపోతే భయపెట్టి భోజనం చేసేలాగా చేయు అంటూ ఏదో సలహా ఇస్తాడు.
దివ్య: ఈ ఐడియా బాగుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అనసూయ: నందు చేసింది తప్పని తెలుసు కానీ కడుపు తీపి నా నోరు నొక్కేస్తోంది అని భర్తకి చెప్తుంది.
మరోవైపు తల్లి కోసం పాలు తీసుకువెళ్లిన దివ్య పాలు పక్కనపెట్టి తల్లిని హత్తుకుంటుంది. ఆమె ప్రవర్తనకి షాక్ అవుతుంది తులసి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.