(Source: ECI | ABP NEWS)
Illu Illalu Pillalu Serial Today October 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేదవతి చేసిన తప్పేంటి? శోభ కోసం నర్మద, ప్రేమల పోరాటం! వల్లీ సాయం!
Illu Illalu Pillalu Serial Today Episode Oct 30th నర్మద చెప్పినా వినకుండా వేదవతి నేరుగా వెళ్లి కిడ్నాపర్‌నే శోభ గురించి అడగటం ఆయన ముగ్గుర్ని ఓ ఇంట్లో బంధించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమ, వేదవతిలు శోభ కోసం వెతుకుతూ ఉంటారు. నర్మద వాళ్లు ఉన్న ఓ చోటే శోభని దాచుంటారు. కల్యాణ్ అక్కడే సిగరెట్ తాగడం చూసి వేదవతి ఆమెని అడుగుదామని అంటుంది. అతను వాళ్ల మనిషి కూడా అవ్వొచ్చు అతన్ని అడిగితే ప్లేస్ మార్చే ఛాన్స్ ఉందని ప్రేమ, నర్మద అంటుంది. 
వేదవతి మాత్రం తను ఏమైనా చూడగానే ఎవరు ఎలాంటిదో చెప్పేస్తా అని అతను చాలా మంచోడిలా ఉన్నాడని వాడినే అడుగుతా అని అంటుంది. నర్మద, ప్రేమ ఎంత ఆపినా ఆగకుండా కల్యాణ్ దగ్గరకు వెళ్తుంది. డైరెక్ట్‌గా వేదవతి కల్యాణ్ దగ్గరకు వెళ్లి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిని కిడ్నాప్ చేశారు.. ఇదే ఏరియాలో పెట్టాను నీకు తెలుసా అని అడుగుతుంది. కల్యాణ్ భయంతో వాళ్లని డైవర్ట్ చేయడానికి తెలుసు చూపిస్తా రండి అని అంటాడు. నర్మద డౌట్ ఉంది అన్నా వేదవతి వినకుండా అతని వెంట ఇద్దరు కోడల్ని తీసుకొని వెళ్తుంది. సీన్ చూస్తే వేదవతి చాలా ఓవర్ చేసినట్లు అనిపిస్తుంది. 
కల్యాణ్ వేదవతి, నర్మద, ప్రేమల్ని తీసుకెళ్లి ఓ గదిలో పెట్టి తాళం వేసేస్తాడు. వాడు శోభని కిడ్నాప్ చేసిన వాడిలో ఒకడు.. మిమల్ని నమ్మించి ఇక్కడ బంధించాడని నర్మద, ప్రేమ అత్తతో చెప్తే అత్త ఏడుపు మొదలెడుతుంది. 
రామరాజు జైలు దగ్గర బాధ పడుతూ ఉంటాడు. చందు, సాగర్ వెళ్లి చాలా లాయర్ల దగ్గర ప్రయత్నించాం నాన్న కేసు చాలా స్ట్రాంగ్ అంట అందరూ కోర్టులో చూసుకుందాం అంటున్నారు అని అంటారు. రామరాజు ఏడుస్తాడు. చిన్నోడు అలాంటి వాడు కాదురా అని అంటాడు. ఇక ఎమ్మెల్యేకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు.. చాలా మందికి కాల్ చేస్తారు కానీ ఎవరూ రెస్పెండ్ అవ్వరు. దాంతో చందు సాగర్ బావకి తెలిసిన లాయర్‌ని కలుద్దామని చెప్పిలా వెళ్తారు.
నర్మద, ప్రేమలు వేదవతిని గుర్రుగా చూస్తారు. బోల్తా పడ్డానే ఇందులో నా తప్పేం లేదు నన్ను అలా చూడకండే అని వేదవతి అంటే మీ తప్పేం లేదా చెప్పినా వినకుండా ఓవర్ చేశారు అని నర్మద అత్త మీద ఫైర్ అయిపోతుంది. మా ఆయన కూడా ఎప్పుడూ నన్ను ఇంతలా తిట్టలేదు అని వేదవతి మీతో ఫ్రెండ్‌షిప్ కట్ అంటుంది. అయితే వెళ్లిపోండి అని నర్మద అంటుంది. 
ఇంతలో వల్లీ వస్తుంది. ఏంటి నర్మద అత్తయ్యని అలా తిడుతున్నావు అంటుంది. వేదవతి వెళ్లి చూడవే వల్లీ చూడు అత్త అని గౌరవం లేకుండా ఎలా తిడుతున్నారో అని అంటుంది. ఎంతైనా మీరు వాళ్ల పార్టీనే కదా అని వల్లీ అంటుంది. వల్లీ బయట నుంచి మిమల్ని ఎవరు విడిపిస్తారో అని బాధగా ఉంది అంటే వేదవతి లోపల నుంచి మమల్ని ఎవరు వచ్చి విడిపిస్తారో తెలీక ఇలా ఉన్నాం అంటుంది. మొత్తం వింతగా చూసిన నర్మద, ప్రేమలు మమల్ని బయట నుంచి ఎవరు విడిపిస్తారు అని ఆలోచిస్తున్నారా మీ బుర్రలు అని తల పట్టుకుంటారు. మీ ఇద్దరికీ మైండ్‌లు పని చేస్తున్నాయా,, తను మనలా లోపల ఇరుక్కోలేదు బయటే ఉంది కదా అని అంటుంది. 
వేదవతి వల్లీకి తాళం పగలగొట్టి బయటకు తీయమని అంటుంది. వల్లీ తాళం పగలగొట్టగానే వల్లీ నా బంగారు తల్లీ అని వేదవతి హగ్ చేసుకుంటుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్ అంటే మేం ఎక్కడికి వెళ్లినా మమల్ని ఫాలో అవ్వడం ఈవిడకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రేమ, నర్మదలు అంటారు. ఎప్పుడూ మా మీద చాడీలు చెప్పేది ఈ రోజు మమల్ని కాపాడింది అని నర్మద అంటుంది. అందరూ కలిసి ఆ అమ్మాయిని వెతుకుదాం అని వల్లీ అంటే నర్మద వద్దు అంటుంది. ఎందుకు వద్దే అది మనల్ని కాపాడింది ఇక నుంచి అది కూడా మన టీమే అని చేతులు కలుపుతుంది. 
సేనాపతి సూట్‌కేస్‌తో బయటకు వెళ్తుంటే భద్రావతి చూసి ఎక్కడికి అని అడుగుతుంది. దాంతో సేన పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నా ఆ రామరాజు మనకి ఎలా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నా ఇన్ని రోజులకు అలాంటి అవకాశం దొరికింది.. ఈ డబ్బు పోలీసులకు ఇచ్చి ఆ ధీరజ్ బయటకు రాకుండా చేస్తా అంటాడు. దానికి భద్రావతి అంత శ్రమ మనకు అవసరం లేదు ఆ ధీరజ్ గాడు మునిగిపోయాడు. రామరాజు పతనం మొదలైంది అని అంటుంది.
ప్రేమ ఓ చోట బాధగా కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని వల్లీ అడుగుతుంది. దాంతో ప్రేమ కాసేపట్లో ధీరజ్‌ని కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి వెళ్తే జైలు శిక్ష పడుతుంది. పరిస్థితులు అన్నీ చేజారిపోయావని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















