Illu Illalu Pillalu Serial Today Episode దీపావళి పూజకి రామరాజు, వేదవతిల దగ్గర ముగ్గురు కొడుకులు కోడళ్లు ఆశీర్వాదం తీసుకుంటారు. లక్ష్మీ దేవి పూజను వైభవంగా కొడుకులు కోడళ్లతో చేయిస్తారు.
ప్రేమ బ్లౌజ్‌కి ధీరజ్ షర్ట్ అతుక్కుంటుంది. ఇద్దరూ లాక్కుంటూ పీక్కుంటారు. నువ్వు కావాలి అనే చేశావ్ కదా అని ధీరజ్ అడిగితే అవును మరి అని ప్రేమ వెటకారం చేస్తుంది. నర్మద చూసి ధీరజ్ కొన్ని ముడులు పడినంత ఈజీ కాదు విడదీయడం అని అంటుంది. ఇక ధీరజ్ షర్ట్ లాగడంతో చినిగిపోతుంది. దాంతో నాన్న ఫీలవుతాడని ధీరజ్ మార్చకోవడానికి వెళ్తాడు. ప్రేమ కూడా వెనకాలే వెళ్తుంది. నర్మద పూజ చేస్తుంటే సాగర్ పూజ చేయకుండా నర్మదనే చూస్తుంటాడు. చందు, వల్లీ ఇద్దరూ కలిసి పూజ చేసుకుంటుంటాడు.
మరోవైపు రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. మా ఇంటికి వచ్చారు ఏంటి సార్ అని రామరాజు అడిగితే ధీరజ్ మీద కంప్లైంట్ వచ్చింది.. ఎంక్వైరీ చేయాలి తీసుకెళ్లాలి అని అంటాడు. అందరూ భద్రావతి వాళ్ల మీద అనుమానం వస్తుంది. ధీరజ్ రాగానే పోలీసులు ధీరజ్‌ని లాక్కెళ్తుంటే రామరాజు అడ్డుకుంటాడు. ఇక ప్రేమ పోలీసులతో ధీరజ్ ఏం నేరం చేశాడు అని అడిగితే వీడు ఒకమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు.
పోలీసులు ధీరజ్‌ని లాక్కెళ్తుంటే నా కొడుకు మంచోడు వాడి మీద నింద వేస్తారేంటి అని అడుగుతాడు. పోలీసులు నిన్ను నువ్వు అమ్మాయిని కారులో తీసుకెళ్లావు కదా.. ఆ అమ్మాయి ఇంటికి రాలేదు వాళ్ల నాన్న నీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని అంటాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని ధీరజ్ అన్నా ఎంత మంది చెప్పినా వినకుండా పోలీసులు ధీరజ్‌ని తీసుకెళ్తాడు.
ప్రేమ, రామరాజు, వేదవతి ఇంట్లో అందరూ చాలా బాధ పడతాడు. విశ్వ, సేన, భద్రావతి అదంతా చూస్తూ నవ్వుకుంటారు. ధీరజ్ కోసం రామరాజు, చందు, సాగర్, తిరుపతిలు పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంటే సేనాపతి ఆపి ఈ కూలోడికి కిడ్నాప్‌లు లేపుకెళ్లిపోవడాలు స్కామ్‌లు, కుట్రలే వీడికి ఎక్కువ అక్క అని సేనాపతి అంటే అదే బుద్ధి కొడుకులకు నేర్పాడురా.. బాగా డబ్బున్న అమ్మయిల్ని ప్రేమ పేరుతో వల వేస్తున్నారు.. రైస్ మిల్లు పని చేయడం లేదని డబ్బు కోసం కోడళ్లని ఉద్యోగానికి పంపుతున్నాడు అని రామరాజుని బాధ పెడతారు. ఇప్పుడు కొత్తగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే బిజినెస్ మొదలు పెట్టాడు అని అంటాడు. ఏం పెంపకంరా నీది అని రామరాజుని తిడతాడు.
రెండు కుటుంబాలు గొడవ పడతాయి. చందు, సాగర్‌లు సేనా వాళ్ల కాలర్లు పట్టుకొని కొట్టడానికి వెళ్తారు. ఖర్మ అనుభవించాలిరా.. మేం కంప్లైంట్ ఇవ్వలేదు కానీ మా ఇంటి ఆడపిల్లల్ని తీసుకెళ్లినందుకు అనుభవిస్తారురా అని భద్రావతి అంటే అత్త ధీరజ్ గురించి మీకు తెలీదు మీరు మాట్లాడకండీ అని అంటుంది. నా భర్తని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే కన్నవాళ్లు అని కూడా చూడను అని అంటుంది. ధీరజ్ ఎలాంటి వాడో తెలుసా.. నా భర్త దేవుడు.. అసలు నాకు ఎలాంటి పరిస్థితిలో పెళ్లి జరిగిందో తెలుసా.. అని ప్రేమ నిజం చెప్పబోతుంది. వేదవతి, నర్మద ప్రేమని ఆపాలని ప్రయత్నిస్తారు. వాళ్లకి ఏం చెప్పినా అర్థం కాదు ప్రేమ మన ఇంట్లో ప్రతీ ఒక్కరూ తప్పుగా కనిపిస్తారు వాళ్లకి చెప్పడం వేస్ట్ వాళ్లని వదిలేయడం బెటర్ అంటుంది వేదవతి.
భద్రావతి కోపంగా నీ కొడుకుని పోలీసులు పట్టుకెళ్లిపోయారు నీకు అయినా సిగ్గు లేదా మా మీద నింద వేస్తున్నావ్ అని అడిగితే వేదవతి కోపంగా భద్రావతి నా కొడుకు ఏ తప్పు చేయడు అది కన్న నాకు తెలుసు.. చూస్తూ ఉండు నా కొడుకు ఏం తప్పు చేయలేదని పోలీసులే చెప్తారు వాళ్లే నిర్దోషిగా విడిపిస్తారు అని అంటుంది.
రామరాజు వాళ్లతో మీకు ఉన్న అతి పెద్ద రోగం ఏంటో తెలుసా ఎదుటి వాళ్లు బాధ పడుతుంటే ఆనందించడం అదే మిమల్ని తినేస్తుంది ఇప్పటికైనా మారండి అని చెప్పి మిగతా కొడుకుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ప్రేమ ఏడిస్తే వేదవతి కూడా ఏడుస్తుంది. నర్మద ఓదార్చుతుంది. రామరాజు జైలుకి వెళ్తే అక్కడ ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.