Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ ధీరజ్‌ని బయటకు వెళ్లొద్దని కుడి కన్ను అదురుతుందని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ధీరజ్ మాత్రం జాబ్‌కి మొదటి రోజు వెళ్లాల్సిందే అని అంటాడు. ప్రేమ ధీరజ్ వెంట పడుతూ ఆపాలని చూస్తుంది.
వేదవతి, నర్మద, తిరుపతి, అమూల్య చూసి ఏమైందని అడుగుతారు. దానికి ధీరజ్ చూడమ్మా కుడి కన్ను అదురుతుంది. ఎడమకన్ను అదురు తుంది అని నన్ను జాబ్‌లో జాయిన్ అవ్వనివ్వడం లేదు అని అంటాడు. వేదవతి ప్రేమని పట్టుకొని వెళ్లనివ్వే అని అంటే నర్మద ధీరజ్‌ని పట్టుకొని ఆపాలని చూస్తుంది. ఇంతలో ఇంతలో రామరాజు చూసి ఏమైందని అడుగుతాడు. ధీరజ్ వెళ్లి డెలివరీ బాయ్ జాబ్ మానేశా క్యాబ్ డ్రైవర్‌గా చేరానని అంటాడు. దానికి రామరాజు రైస్ మిల్లుకి రాలేదని చెప్పిన మాట వినరు ఎవరి ఖర్మకి వాళ్లే బాధ్యత అని అంటాడు.
ధీరజ్ తల్లితో చెప్పి వెళ్లిపోతాడు. నీ ముద్దుల కొడుకు పొగరు చూడు నాకు చెప్పకుండా నీకు చెప్పి వెళ్లిపోతున్నాడు అని రామరాజు అంటే దానికి వేదవతి అంటే అన్నాను అంటారు కానీ వాడు బుద్ధిగా చెప్పడానికి వస్తే నానా మాటలు అని తలంటేశారు మరి ఎందుకు చెప్తాడు అని అంటుంది. నేను వాడి మంచి కోసమే చెప్పాను అని రామరాజు అంటాడు. తిరుపతి బొమ్మరిల్లు ఫాదర్ డైలాగ్స్ చెప్పి వీలైతే ఇప్పటికైనా వాడి చేయి వదిలేయ్ బావ.. వాడి బతుకు వాడిని బతకనివ్వు అని అంటాడు. దాంతో రామరాజు బామ్మర్దికి లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నా కోపమే మీకు కనిపిస్తుంది కానీ వాడు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడనే నా సంతోషం మీకు కనిపించదు అని అంటాడు. బావ ఏంటి అక్క ఇలా ఉన్నాడు.. ఇంత విచిత్రమైన క్యారెక్టర్‌ని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ అని అడుగుతాడు. వేదవతి కూడా తమ్ముడికి ఒక్కటి పీకి మా ఆయన గురించి ఏమైనా అంటే ఊరుకోను అంటుంది.
విశ్వ అమూల్యని తన బుట్టలో వేసుకోవాలని చూస్తాడు. బయట వల్లీ కనిపిస్తే పిలిచి అమూల్యతో మాట్లాడాలి బయటకు తీసుకురా అని అంటాడు. అనవసరంగా వీళ్ల దగ్గర డబ్బు తీసుకున్నా ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి అని వల్లీ అనుకుంటుంది.
వల్లీ అమూల్య దగ్గరకు వెళ్లి కడుపులో మంటగా ఉంది కూల్‌డ్రింక్ తీసుకురావా అని చెప్పి షాప్‌కి పంపిస్తుంది. అమూల్య బయటకు వెళ్తుంటే విశ్వ కూడా బయల్దేరుతాడు. ఇంతలో అమూల్యకి ఎదురుగా ప్రేమ వస్తుంది. ప్రేమని చూసి విశ్వ బైక్ పక్కన ఆపి దాక్కుంటాడు. అమూల్య ఎక్కడికి వెళ్తాన్నావ్ అని ప్రేమ అడుగుతుంది. వదిన కూల్ డ్రింక్ తీసుకురమ్మని చెప్పిందని అమూల్య అంటే నువ్వు వెళ్లకండా తనకి చెప్తావ్ ఏంటి అని అడుగుతుంది. వదినని కాబట్టి చెప్పా ఇష్టముంటే తీసుకొస్తుంది లేదంటే లేదు అని వల్లీ వెళ్తుంది.
అమూల్యని ప్రేమ పక్కకి తీసుకెళ్లి ధీరజ్ మా విశ్వని కొట్టాడు కదా..అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో అమూల్య ప్రేమతో ఈ మధ్య మీ అన్నయ్య నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నన్ను ఫాలో చేస్తున్నాడు.. నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు.. నాన్నకి చెప్తా అన్నా భయపడటంలేదు.. నువ్వు నా మామయ్య కూతురివి కదా నీతో మాట్లాడితే తప్పేంటి అని అంటున్నాడు అని అంటుంది. ఎప్పుడూ లేనిది మా అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ప్రేమ అంటుంది. దానికి అమూల్య నాకు అదే అర్థం కావడం లేదు వదిన.. మొన్న గుడిలో కూడా నాతో మాట్లాడు నీకు గాజులు కొనిపిస్తా అని నా చేయి పట్టుకున్నాడు అందుకే మా ధీరజ్ అన్నయ్యకి అంతలా కోపం వచ్చి కొట్టాడని అంటుంది.
ప్రేమ సరే అని నువ్వు అందరితో ఉండకుండా ఒక్కదానివే అక్కడ ఎందుకు ఉన్నావ్ అని అడుగుతుంది. దానికి అమూల్య వల్లీ వదిన తీసుకెళ్లిందని చెప్తుంది. నా పేరు చెప్పేసింది నా పని అయిపోయిందిరా బాబు అని వల్లీ తలబాదుకుంటుంది. ఈలోకంతో ఇక నాకు రుణం తీరిపోయింది దేవుడా అని వల్లీ ఏడుస్తుంది.
ధీరజ్ క్యాబ్ డ్రైవర్‌గా చేరగానే అన్నవరం ట్రిప్ వస్తుంది. ఓ అమ్మాయి తన ఫ్రెండ్స్‌తో వెళ్తాను అని చెప్పి అంటుంది. ఆమె తండ్రి కారులో నీ ఫ్రెండ్స్ లేరు కదా అమ్మా అంటే మన దగ్గరకే ఫస్ట్ కారు వచ్చింది నాన్న ముందు నేను వెళ్తే తర్వాత వాళ్లు ఎక్కుతారు అంటుంది. ఇక తండ్రి ధీరజ్‌తో నా కూతురు ఒక్కదాయి వెళ్తుంది.. జాగ్రత్తగా ఉండాలి అని ధీరజ్‌ని క్యాబ్‌ని ఫొటోలు తీసి జాగ్రత్తగా తీసుకెళ్లమని అంటాడు. మధ్యలో ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కారు ఎక్కుతారని చెప్పి కారు ఆపిస్తుంది. కారులో ఇద్దరు అబ్బాయిలు ఎక్కుతారు. శోభ వాళ్లతో అంజలి, గౌతమి ఎక్కడ అని అడుగుతుంది. వస్తారు అని వాళ్లు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.