Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు వేదవతితో కోడళ్లను నెత్తికి ఎక్కించుకొని ఈ పరిస్థితికి తీసుకొచ్చావని తిడతాడు. ఇదంతా అసలు వీళ్ల వల్లే అని రామరాజు కోపంతో వల్లీ తల్లి భాగ్యంకి కాల్ చేస్తాడు. భాగ్యం ఏమైందని అడిగితే రేపు అర్జెంట్‌గా మా ఇంటికి నువ్వు నీ భర్త రండి అని పిలుస్తాడు. ఎందుకని భాగ్యం అడిగితే నువ్వు నీ భర్త నా పెద్ద కొడుకు దగ్గర తీసుకున్న డబ్బు గురించి అని చెప్తాడు. భాగ్యం గుండె మీద రాయి పడినట్లు అయిపోతుంది.
రామరాజు చాలా ఆలోచిస్తాడు. పెద్దోడు డబ్బు ఇవ్వడం ఏంటి అని అనుకుంటాడు. ఇక ధీరజ్ ప్రేమని నిలదీస్తాడు. నిన్ను ఎవరు మా అన్నయ్యకి నేను డబ్బులు ఇచ్చిన విషయం చెప్పమని అన్నారు అని అడుగుతాడు. వల్లీ అన్ని మాటలు అంటుంటే నేను ఎలా చెప్పకుండా ఉంటానురా అని అడుగుతుంది. అది మా అన్నాదమ్ముల విషయం మా అన్నయ్య కోసం నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా పడతాను.. మా నాన్నతో ఎన్ని సార్లు అయినా తిట్టించుకుంటా నీకు ఎందుకు అయినా ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల మా నాన్న దృష్టిలో మా అన్నయ్య దోషిగా నిలబడ్డాడు. వాడి మీద ఉన్న నమ్మకం పోయింది అని అడుగుతాడు. చేయని తప్పునకు నువ్వు మాటలు పడితే నేను ఎలా ఊరుకుంటానురా అని ప్రేమ అంటుంది. నీకు ఎందుకు అని ధీరజ్ అంటే నువ్వు నా భర్తవిరా అని అంటుంది. కల్యాణ్ విషయంలో నన్ను నువ్వు సేవ్ చేశావ్.. మరి నా గురించి అంత శ్రద్ధ నువ్వు చూపిస్తే నీ మీద నాకు ఉంటుంది. భర్త అనే బంధం ఆ రోజు నువ్వు నా కోసం తాపత్రయ పడేలా చేసింది భార్య అనే బంధం ఈ రోజు నువ్వు మాటలు పడకుండా కాపాడింది అని చెప్తుంది.
వేదవతి ఉదయం ముగ్గు వేస్తూ బయట ఉన్న అక్కని చూస్తుంది. భద్రావతి కూడా చెల్లిని చూస్తుంది. ఒకర్ని ఒకరు చూసుకొని గతం గుర్తు చేసుకుంటారు. ప్రేమానురాగాలు గుర్తు చేసుకుంటారు. నర్మద చూసి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారా.. అనుకొని ఏది ఏమైనా మీ అక్కాచెల్లెళ్ల కెమిస్ట్రీ సూపర్ అత్తయ్య.. పైకి కారాలు మిర్యాలు నూరుతున్నట్లు ఉంటారు కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రం పొంగిపోతుందని అంటుంది. ఇలా దూరం నుంచి చూసి ప్రేమలు పెంచుకునేకంటే దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చు కదా అత్తయ్య.. కొడుతుంది అని భయమా అని అడుతుంది. అంటే అన్నాను అంటావ్ కానీ మా అక్కకి నేను అంటే చాలా ప్రేమ ఆ ప్రేమ వల్లే ఇలా అయింది అంటుంది.
నర్మద వేదవతితో ఆఫీస్‌లో జరిగిన విషయం చెప్తుంది. నేనేమైనా తప్పు చేశానా అని నర్మద అంటే నీ డ్యూటీ నువ్వు చేశావ్.. అలాగే మా అక్క ఆ క్షణం కోపంలో అలా మాట్లాడింది అంతే కానీ పగ పెట్టుకోదని అంటుంది. మీ ప్రేమ ఏదో ఒక రోజు తప్పకుండా మిమల్ని కలుపుతుంది.. సరే మీరు ప్రేమించుకోండి నేను వెళ్తా అని నర్మద అంటుంది. వేదవతి ఆపి ముగ్గురు కోడళ్లు ఎందుకు అలా కొట్టుకున్నారే.. నువ్వు బాగా చదువుకున్న దాన్ని.. తెలివైనదానివి కదా.. నువ్వే అన్నీ సెట్ చేయాలే.. నా తర్వాత నువ్వే ఈ ఇంటిని చూసుకోవాలి కదా అంటే.. అంతా వల్లీ వల్లే అది వల్లీ కాదు కుళ్లు అని అంటుంది నర్మద. కాస్త నా బాధ అర్థం చేసుకోవే అని అంటుంది. సరేలే అని నర్మద అంటుంది.
ఇడ్లీబాబాయ్ బ్యాగ్ సర్దేసి నేను పోతానండీ ఆవిడ గారు.. అని అంటాడు. ఏమైంది అని భాగ్యం అడిగితే ఇక్కడుండి ఆ రామరాజు చేతిలో పోయే కంటే కాశీ రామేశ్వరం పోవడం బెటర్ అని అంటాడు. భాగ్యం ఆపి ఎప్పటిలా రెండు తిట్లు పడతాయి అంతే అని అంటుంది. నువ్వు ఆడ విలన్ కాబట్టి నీకు ఏం అనడు.. నన్ను అయితే మీదకి ఎత్తి చంపేస్తాడు అని అంటాడు. నేను చూసుకుంటా నువ్వు ఉండు అని భాగ్యం అంటుంది. మళ్లీ రామరాజు భాగ్యానికి ఫోన్ చేస్తాడు. భాగ్యం ఫోన్ ఎత్తుదు.. రెండు రోజులు చేసి చేసి వదిలేస్తాడని భాగ్యం అంటుంది. రామరాజు ఎంత పొగరు వీళ్లకి అని అనుకొని వల్లీని పిలుస్తాడు. మీ అమ్మానాన్న ఫోన్ తీయలేదు అంటే పనిలో ఉంటారని వల్లీ అంటే కాదు భయంలో ఉంటారు. నేను పిలిచినా రాలేదు అనుకుంటే పెద్దోడి విషయంలో ఏదో చేశారు.. అంత తేలికగా వదలను అని రామరాజు అంటాడు. వల్లీ భయపడుతుంది. ప్రేమ వల్లి దగ్గరకు వెళ్లి ఈవినింగ్ ధీరజ్ ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీ ఉంది.. ఏ డ్రస్ వేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది. ఇద్దరం ఆలోచిద్దాం అని నర్మద అంటే వేదవతి వచ్చి ఏంటి అని అడిగితే అత్తని ఎలా చెప్పుచేతల్లో పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.