Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు వేదవతితో నర్మద, ప్రేమ తన పరువు తీసేస్తున్నారని కేవలం వల్లీనే పరువు నిలబెడుతుందని చెప్తాడు. వల్లీ పొంగిపోతుంది. నర్మద, ప్రేమ మామ మాటలు విని చాలా బాధపడతారు. ఇద్దరు కోడల్ని తిడుతూ వల్లీని మెచ్చుకుంటాడు. నర్మద, ప్రేమ రామరాజు మాటలు విని బాధ పడటం వేదవతి చూసి ఇద్దరి దగ్గరకు వెళ్తుంది. 

Continues below advertisement

వల్లీ గెంతులేస్తుంది. వేదవతి ఇద్దరు కోడళ్లని దగ్గరకు తీసుకొని మీ మామయ్య మాటలు పట్టించుకోవద్దని అంటుంది. అలవాటు అయిపోయిందిలే అత్తయ్య అని నర్మద, ప్రేమలు వెళ్లిపోతారు. ఇక గుడి బయట భాగ్యం, ఇడ్లీబాబాయ్ గుడి బయట బజ్జీలు అమ్ముకుంటూ ఉంటారు. ఇడ్లీబాబాయ్ అరుస్తుంటే తిరుపతి వెళ్లి చూస్తాడు. రామరాజుని పిలిచి చూపిస్తాడు. బావగారు మీరేంటి ఇలా అని రామరాజు అంటాడు. ఇక అక్కడే ఉన్న ఒకాయన మీ వియ్యంకులుది బజ్జీ వ్యాపారమా మీకు హ్యాపీ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రీ తినొచ్చు.. టేస్టీగా ఉన్నాయి తిను అని రామరాజుని అంటారు. రామరాజు ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.

వల్లీ అమూల్యని విశ్వని కలపాలని విశ్వ ఉన్న ఓ చోటుకి అమూల్యని తీసుకెళ్లి ఇక్కడే ఉండు నేను వస్తా అని చెప్పి అమూల్యని వదిలేసి వెళ్తుంది. విశ్వ ఓ హార్ట్‌ సింబల్ తీసుకొని వెళ్లి హాయ్ చెప్తాడు. అమూల్య విశ్వపై చిరాకు పడుతుంది. నువ్వు నా అత్త కూతురివి అమూల్య ఇలా చారాకు పడకు.. నీ మీద చెడు ఒపీనియన్ తీసేయ్ అమూల్య రా నీకు గాజులు కొనిపిస్తా అని అమూల్య చేయి పట్టుకుంటాడు. వదల్రా అని అమూల్య అరుస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న కామాక్షి చూసి రేయ్ తాటి చెట్టుగా నా చెల్లితో నీకు ఏంట్రా పని నా చెల్లి చేతికే గాజులు తొడుగుతా అంటావా నిన్ను కొట్టాను అంటే నాకు పరువు తక్కువ ఉండ్రాఅని తన భర్తని తీసుకొస్తుంది. అమూల్య, కామాక్షి ఇద్దరూ కొట్టమని అంటారు. 

Continues below advertisement

కామాక్షి భర్త చూసి ఏంటే నేను కొట్టేది ఏదో సినిమాలో చెప్పినట్లు నేను వాడికి ఎదురెళ్లినా వాడు నాకు ఎదురొచ్చినా నాకే రిస్క్ అని వెళ్లిపోతాడు. విశ్వ నవ్వుకుంటూ అమూల్యని చూసి వెళ్తాడు. కామాక్షి మనసులో సైలెంట్‌గా వెళ్లిపోయాడు లేదంటే ఈ తాటిచెట్టు గాడి దగ్గర నా జాయింట్లు ఊడిపోయేవి అని అనుకుంటుంది. ప్రేమ, నర్మదలు మామ మాటలు తలచుకొని బాధ పడుతుంటారు. 

నర్మద ప్రేమ దగ్గరకు వెళ్లి ధీరజ్‌కి నీ ప్రేమ విషయం చెప్పు అని అంటుంది. మామయ్య మాటలకి బాధగా ఉంది అక్క అని ప్రేమ అంటే నువ్వు మీ పుట్టింటి బతుకమ్మ తీసుకెళ్లడం వెనక అర్థం, సెంటిమెంట్ మామయ్యకి తెలీదు.. పైగా మీ నాన్న అందరి ముందు మామయ్యని అవమానించారు అందుకు అలా అన్నారు అంతే కానీ ఇంకే కాదని అంటుంది. ఇక ప్రేమ ధీరజ్‌కి లవ్ విషయం చెప్పడానికి వెళ్తుంది. ఎలా ఎలా ఎలా తెలుపను.. యదలోన మాటలను అని సాంగ్‌ బ్యాగ్రౌండ్‌లో వస్తుంటే ప్రేమ మెలికలు తిరిగిపోతుంది. 

ధీరజ్ ప్రేమతో ఏమైంది అని అడిగితే నీకో విషయం చెప్పాలి.. నా గుండె ట్రైన్‌ కంటే వేగంగా పరుగెడుతుంది.. మాట్లాడటానికి టెన్షన్‌గా ఉందని అంటుంది. నువ్వు నా మీద పడి రక్కేస్తావు కదా మరి ఈ సిగ్గు ఏంటి అని అడుగుతాడు. ప్రేమ ఐలవ్యూ  చెప్పే టైంకి ఓ పాప తప్పిపోయింది.. పాపకి మాటలు రావు.. తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నారని మైక్లో అనౌన్స్ చేస్తారు. దాంతో ప్రేమ పరుగున అనౌన్స్మెంట్ దగ్గరకు వెళ్తుంది. మైక్ తీసుకొని అందరూ ఎక్కడి వాళ్ల అక్కడ ఆగిపోండి.. పాప తప్పిపోయింది మీ అందర్ని చూస్తే భయపడుతుంది అని చెప్తుంది. పాప తల్లిదండ్రులతో మాటలు రాని వారికి వినికిడి శక్తి ఎక్కువ ఉంటుంది. తను రోజూ వినే పాట చెప్పండి అంటుంది. దాంతో వాళ్లు చెప్పడంతో జోలాలి అని ప్రేమ పాట పాడుతుంది. ఆ పాట విని ఓ చోట పాప ఆగుతుంది. అది ధీరజ్ చూసి పాపని ఎత్తుకొని వెళ్తాడు. పాపని చూసి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. పిల్లాపాపలతో చల్లగా ఉండండి అని ధీరజ్, ప్రేమకి చెప్పి థ్యాంక్స్ చెప్తారు. ఇంతలో గుడికి కలెక్టర్ వస్తారు. కలెక్టర్‌ని రామరాజు విష్ చేస్తే పట్టించుకోడు. ఇంతలో అక్కడే ఉన్న నర్మదని గుర్తు పట్టి మాట్లాడుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.