Illu Illalu Pillalu Serial Today Episode నర్మద ఇంటికి వస్తే సేనాపతి, భద్రావతి మాటలతో అవమానిస్తారు. లంచం తీసుకుంటూ దొరికిపోయి కూడా ఇంటికి వచ్చింది.. ఈ అవమానంతో ఇంటికి రాకుండా ఏదో ఒకటి చేసుకోవాలి అలా కాకుండా వచ్చింది అంటే గట్టి గుండె అక్క అని సేనాపతి అంటాడు. దానికి భద్రావతి వాళ్ల మామకి మంది సొమ్ము తినడం అలవాటే కదరా.. అందుకే లంచం తీసుకొమని చెప్పుంటాడు. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది.. ఉద్యోగం చేశామా,, జీతం తీసుకున్నామా అన్నట్లు ఉండాలి.. లేదని కొమ్ములు విధిలిస్తే కూశాలతో సహా పీకి అవతల పడేస్తాం అని అంటుంది భద్రావతి.
నర్మద లోపలికి వచ్చే సరికి అందరూ దిగులుగా ఉంటారు. సాగర్, ప్రేమ, ధీరజ్ అందరూ ఏమైంది.. నీ మీద ఆరోపణలు రావడం ఏంటి అని అడుగుతారు. నర్మద కూల్‌గా నీరు తాగి అందరి మధ్యకి వస్తుంది. నర్మద మౌనం చూసి వల్లీ అర్థం చేసుకోండి తను లంచం తీసుకుందని అని అంటుంది. అక్కా అలా మాట్లాడుతావేంటి అని ప్రేమ అంటుంది. దానికి శ్రీవల్లి తను లంచం తీసుకుంది కాబట్టి తల దించుకొని ఉంది.. లేదంటే అందర్ని దబాయించేది కదా.. అయినా ఏంటి నర్మద నువ్వు పెళ్లి చేసుకొన్న తర్వాత భర్త, అత్తామామల్ని చూసుకోకుండా ఉద్యోగాలు అవసరమా నీ వల్ల మామయ్య గారికి చెడ్డ పేరు వచ్చింది అని శ్రీవల్లి అంటుంది.
భాగ్యం కూడా నర్మదని అనడానికి వచ్చేస్తుంది. ఇంత మంచి ఇంటికి కోడలు అయి అత్తారింటి పరువు నిలబెట్టేలా ఉండాలి కానీ ఇలా పరువు తీయడం ఏంటమ్మా.. మమల్ని చూసు నిజాయితీగా ఎలా ఉన్నాం అని భాగ్యం అంటుంది. శ్రీవల్లి దొంగ ఏడుపు నటిస్తూ లంచం తీసుకొని నువ్వు బాగానే ఉన్నావ్ కానీ మామయ్య గారికి మాత్రం పరువు తక్కువ.. మామయ్య గారు ఆ బాధలో తలెత్తుకొని తిరగగలరా.. అని అంటుంది. నానా మాటలు అని వల్లీ అలిసిపోతుంది. మొత్తం విన్న నర్మద హ్యాపీగా ఫుల్ హ్యాపీనా అంటే వల్లీ తలూపుతుంది. సరే అయితే నాకు నిద్రోస్తుంది.. వెళ్లి పడుకుంటా అని నర్మద వెళ్లిపోతుంది. అందరూ బిత్తరపోతారు.
వల్లీ వాళ్ల అమ్మతో ఉద్యోగం పోయింది ఏడుస్తూ ఇంటికి వస్తుంది.. ఓ మూలన కూర్చొంటుంది అనుకున్నాం ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు అని అనుకుంటారు. దానికి ఇడ్లీబాబాయ్ చిరుత పులి దెబ్బ తిన్నా ఎవరికీ భయపడదు అని అనగానే తల్లీకూతుళ్లు ఇడ్లీబాబాయ్‌ని కొట్టేస్తారు.
నర్మద దగ్గరకు వేదవతి వెళ్లి ఎందుకు ఇలా చేశావ్ నర్మద అని అడుగుతుంది. దాంతో నర్మద అత్తయ్య నేను లంచం చేసుకున్నారా అని అనుకుంటుంది. వేదవతి నర్మదతో నా కోడలు ఏ తప్ప చేయదు అని నాకు తెలుసు.. ప్రాణం పోయినా లంచం తీసుకోదు అని తెలుసు. అలాగే ఎవరు అయినా నీ తప్పు లేకుండా ఏమైనా అంటే ఊరుకోవు అని కూడా తెలుసు కానీ ఎందుకు ఒక్క మాట అనలేదు.. మా కోసమే కదా మా కోసం ఆలోచించే ఇలా మౌనంగా ఉన్నావ్ కదా.. నిన్ను లంచం కేసులో ఇరికించింది మా పుట్టింటి వాళ్లే కదా.. మా వాళ్లకి ఎదురు తిరిగి నువ్వు వాళ్లకి సమాధానం చెప్తే నలుగురిలో వాళ్ల పరువు పోతుందని వాళ్లు బాధ పడితే నేను బాధ పడతా అని నువ్వు మౌనంగా ఉన్నావ్ కదా అని వేదవతి ఏడుస్తుంది.
వేదవతి చెప్తున్న మాటలు ప్రేమ కూడా వింటూ కన్నీరు పెట్టుకుంటుంది. నర్మదని వేదవతి హగ్ చేసుకొని ఎంత గొప్ప కోడలివి నర్మద నువ్వు. మేం బాధ పడకూడదు అని నువ్వు అవమానాలు పడుతున్నావ్.. ఎంత ఉన్నతమైన మనసే నీది అని ఏడుస్తుంది.
నర్మద వేదవతితో అత్తయ్య నా వ్యక్తిత్వం చంపుకోలేదు.. నా మీద నింద వేస్తే ఊరుకోలేదు.. కానీ ఈ సారి నాకు మీరు, ప్రేమ గుర్తొచ్చారు. మీరు నాతో మాట్లాడకపోయినా.. ప్రేమ నా పక్కనే చెల్లిగా లేకపోయినా నేను తట్టుకోలేను.. మీ ఇద్దరూ లేకపోతే నేను అనాథని అత్తయ్య అని అంటుంది.
ప్రేమ ఏడుస్తుంది. వేదవతి నర్మదతో నువ్వు ఇలా ఉండకే నీలా ఉండు.. నువ్వు చేయని తప్పునకు నింద మోయొద్దు.. మా వాళ్లతో పెట్టుకోవద్దు అని చెప్పిన నేనే ఈ రోజు చెప్తున్నా.. నువ్వు ఇలా తల వంచి ఉండొద్దే.. నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్లు ఎవరో అని నేను ఆలోచించను.. ఏ సమస్యని నర్మద ఎలా ఎదురుకుంటుందో అలాగే ఈ సమస్యని ఎదుర్కో నా కోడలు కొట్టే దెబ్బకు అందరికీ తల తిరిగిపోవాలి.. వాళ్లు నా పుట్టింటి వాళ్లు అయినా ఇంకెవరు అయినా సరే నువ్వు వెనకడుగు వేయొద్దు.. అని వెళ్లిపోతుంది.
ప్రేమ నర్మద దగ్గరకు వెళ్లి ఈ చెల్లి మాట్లాడకపోతే నీకు భరించలేదని బాధ అన్నావ్.. మరి మా అక్క చేయని తప్పునకు నింద మోస్తే అది నాకు బాధ కాదా.. అక్కడుండే మావాళ్ల కోసం ఆలోచించకు అక్క నీ నిజాయితీకి మచ్చ రాకూడదు అని మాత్రమే ఆలోచించు అని అంటుంది.
ధీరజ్ ప్రేమ తండ్రి మాటలు తలచుకొని రగిలిపోతూ ఉంటాడు. ప్రేమ వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావ్ అంటే ధీరజ్ కోపంతో ప్రేమ మీదకు వెళ్లి మళ్లీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తిట్టాలి అని ఉన్నా తిట్టలేక బూతులు మింగేస్తున్నావ్ కదా ప్రేమ అంటే ఈ మాత్రం భయం ఉండాలి అంటుంది. ఎవరే భయపడేది.. మీ పుట్టింటి వాళ్లకి సిగ్గు ఉందా అని తిడతాడు. తిడితే మా పుట్టింటికి వెళ్లిపోతా అని ప్రేమ అంటే పోవే అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ పుట్టింటికి వెళ్లిపోతుంది. భాగ్యం, ఆనంద్‌రావు అది చూస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.