Illu Illalu Pillalu Serial Today May 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తను ప్రెగ్నెంట్ కాదు అని చందుతో చెప్పేసిన వల్లీ! సుకన్య ఎంట్రీతో తారుమారు!
Illu Illalu Pillalu Serial Today Episode May 25th వల్లీ కడుపుతో ఉందని చందు చిన్న పిల్లల ఫొటోలు తీసుకొచ్చి గదిలో అలంకరించడం అది చూసి వల్లీ ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode | బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. నర్మద, సాగర్ వేరు కాపురం పెట్టేయడం.. సాగర్ ఆఫీస్‌కి వెళ్తూ బాక్స్ అడిగితే నర్మద ఖాళీ బాక్స్ ఇవ్వడం.. అమూల్య మీద పగ పెంచుకున్న విశ్వక్ అమూల్యని ఇబ్బంది పెట్టడం తదితర ఆసక్తికర సన్నివేశాలతో సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది.. ఈ రోజు(మే 25న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాగర్ తిక్క కుదిర్చిన నర్మద..
సాగర్ దర్జాగా ఆఫీస్‌కి రెడీ అయి నర్మదకి బాక్స్ తీసుకురమ్మని అంటాడు. నర్మద తీసుకొచ్చి టిఫెన్ రెడీ అంటుంది. ఏం చేశావ్ అంటే జీడి పప్పు ఉప్మా అని చెప్తుంది. సాగర్ సంతోషంగా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం ఏం ఉండదు.. ఇందేటి నర్మదా నేను నీకు అంత వెటకారం అయిపోయానా ఖాళీ బాక్స్ ఇచ్చి జీడి పప్పు ఉప్మాఅంటావ్ అని అడుగుతాడు. బాక్స్ తీసుకురా అని వెటకారం మొదలు పెట్టింది ఎవరూ నువ్వే కదా.. మనం ఏమైనా అందరితో కలిసి ఉన్నామా బాక్స్‌లు ఇవ్వడానికి వేరు కాపురం పెట్టావ్ అని నర్మద అంటుంది. ఇంతకు ముందు అంటే అమ్మా టిఫెన్ అమ్మా బాక్స్ అంటే అన్నీ వచ్చేస్తాయా అని అంటుంది. ఏంటి సాగర్ వేరు కాపురం పెట్టాను అని ఫీలవుతున్నావా అని నర్మద అడిగితే అంత సీన్ లేదు నేను బయట తినేస్తా నువ్వు బయట తినేయ్ అని అంటాడు.
కొడుకు స్టైల్.. తండ్రి వెటకారం..
సాగర్ కళ్లజోడు పెట్టుకొని దర్జాగా ఆఫీస్‌కి వెళ్తుంటే అక్కడే పేపర్ చదువుతున్న రామరాజు చూసి తిరుపతితో రేయ్ తప్పు తెలుసుకోకపోవడం,, తప్పు చేసి కూడా నేనే కరెక్ట్ అని వాదించడం వల్ల గొడవలు అవుతాయి.. కుటుంబాలు విడిపోతాయి.. అని అంటాడు. సాగర్ తిరుపతిని పిలిచి మామ ఇంటి మధ్యలో గీత ఉంది.. ఏ విషయంలో ముఖ్యంగా నా విషయంలో గీత దాటొద్దు అని గుర్తు చేయ్ అని అంటాడు. రామరాజు తిరుపతిని పిలిచి రేయ్ కళ్లకు ఆపరేషన్ అయిందా ఏంట్రా ఆ కళ్లద్దాలు ఏంటి అని అంటాడు. దాంతో సాగర్ కళ్లద్దాలు తీసేస్తాడు. రేయ్ మనల్ని గీత దాటొద్దు అనడం కాదు.. పద్ధతిగా ఉంటే అన్నీ బాగుంటాయ్.. లేనిపోని ఆర్భాటాలకు పోతే అంతే సంగతి అని రామరాజు కొడుకుని దెప్పిపొడుస్తాడు. ఛా అనుకొని సాగర్ వెళ్లిపోతాడు. రామరాజు మనసులో ఏ తండ్రి అయినా కొడుకు మంచి ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. కానీ లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కోవడం కాదురా అని అనుకుంటాడు.
ఏమైందో చెప్పు అమూల్య..
అమూల్య ఓ చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వేదవతి వెళ్లి బాక్స్ ఇచ్చి కాలేజ్‌కి వెళ్లమని అంటుంది. నేను వెళ్లను అమ్మా పూర్తిగా కాలేజ్ మానేస్తా అంటుంది. ఇంతలో ధీరజ్, ప్రేమ, నర్మద అమూల్య దగ్గరకు వెళ్లి నీకు ఏం ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటాం అన్నాం కదా.. ఇంకెందుకు పద కాలేజ్‌కి అని అంటే.. అమూల్య ఏడుస్తూ నేను వెళ్లను మానేస్తా అని చెప్పా కదాఅని అంటుంది. అమూల్య ఏమైంది అని నర్మద అడుగుతుంది. ఏం లేదు అని అనేస్తుంది. ఇంతకు ముందు ఇలాగే అన్నావ్ విశ్వక్ విషయం చెప్పకుండా చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు అలా కాకూడదు ఏం అయిందో చెప్పు అని నర్మద అడుగుతుంది.
పెళ్లితో పాటు ఫస్ట్‌నైట్ అయిపోయిందా..
అమూల్య కాలేజ్ నుంచి వస్తుంటే విశ్వక్ ఫ్రెండ్స్ అమూల్య దగ్గరకు వెళ్లి నీకు విశ్వక్‌కి పెళ్లి అయింది అంట.. ఫస్ట్‌నైట్ కూడా అయిపోయిందా.. అయినా డమ్మీ పెళ్లి కదా అయిండదులే.. మీ ఇంటికి వచ్చి మేం మాట్లాడుతాం.. మాకు ఓకే చెప్పు నువ్వు ఓకే చెప్పే వరకు నీ వెంటే ఉంటాం అని ఇబ్బంది పెడతారు. అమూల్య ఏడుస్తూ వెళ్లిపోతుంది.
వాళ్లని చంపేస్తా..
విషయం తెలిసిన తర్వాత ధీరజ్ వాడిని చంపేస్తా అని వెళ్తుంటే అందరూ ఆపుతారు. ఇప్పటికి అయిన గొడవలు చాలు అన్నయ్యా ఇంకే వద్దు అని అమూల్య అంటుంది. నర్మద ధీరజ్‌తో ఇప్పుడు మనం విశ్వక్‌ని కొడితే నేను ఏమైనా అమూల్యని అన్నానా.. అని అడుగుతాడు. వాడు వాడి ఫ్రెండ్స్‌ని పంపి ఇలా చేస్తున్నాడు.. అవసరం అయితే నీ మీద రివర్స్ కేసు పెడతాడు. అందుకే మనం వేరేలా డీల్ చేయాలి అని అంటుంది. ఈ విషయాన్ని మీతో డీల్ చేయిస్తా అని ధీరజ్ అంటాడు.
చందు సంతోషం.. ఇళ్లంతా అలంకరణ..
చందు గదిలోకి బొమ్మలు చిన్న పిల్లల ఫొటోలు తీసుకొచ్చి గది మొత్తం నింపేస్తాడు. ఇదేంటి బా అని వల్లీ అడిగితే నీ కోసమే నువ్వు గర్భవతివి కదా అని అంటాడు. బావ నాకు బిడ్డ పుడతాడు అని చాలా ఆశలు పెట్టుకున్నాడు.. ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదు అని తెలిస్తే తట్టుకోలేడు.. ఏది అయితే అది అయింది.. బావకి నిజం చెప్పేస్తా అని వల్లీ అనుకుంటుంది.
నన్ను క్షమించు బా..
బా నీకో విషయం చెప్పాలి.. అది చెప్పిన తర్వాత నన్ను నీ జీవితం నుంచి పంపేయకు అని అంటుంది. ఏంటి వల్లీ అని చందు అడిగితే దానికి వల్లీ నా కడుపులో నిజంగా బిడ్డ లేదు బా అని వల్లీ చెప్పేస్తుంది. చందు షాక్ అయిపోతాడు. నేను కడుపుతో లేను బా.. కడుపుతో ఉన్నాను అన్నది అబద్ధం.. నేను నెల తప్పాను అన్నది నాటకం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వల్లీ అని చందు బిత్తరపోతాడు. వల్లీ జరిగింది అంతా చెప్పడంతో చందు వల్లీని లాగి పెట్టి కొడతాడు.
వల్లీ యాక్టింగ్ సూపర్..
చందు వల్లీ మీద సీరియస్ అవుతుంటే సుకన్య వీడియో తీసుకుంటూ వచ్చి వల్లీ నీ యాక్టింగ్ సూపర్ అని వల్లీ కడుపుతో లేను అని ఫ్రాంక్ వీడియో చేసిందని చెప్తుంది. నీకు బుద్ధుందా కాసేపు నా ప్రాణం పోయినట్లు అయిందని సీరియస్ అవుతాడు. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి కారణమే ఆ బిడ్డ.. అదే అబద్ధం అయితే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అని చందు తిడతాడు. సుకన్య వల్లీతో నీకేం మాయరోగం వచ్చి సచ్చిందే నిజం చెప్పావ్ అని తిడుతుంది. నా బా నా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.. అని వల్లీ ఏడుస్తుంది. నిన్ను నీ భర్తని ఒకటి చేసి నీకు గర్భం వచ్చేలా చేసే బాధ్యత నాది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని సుకన్య అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
వల్లీ చందుతో నిజం చెప్పిన విషయం సుకన్య భాగ్యానికి చెప్పి వల్లీని తిట్టించడం, ధీరజ్ ఆడ వాళ్లతోనే విశ్వక్‌కి వాయించేలా చేయడం లాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















