అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today May 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు ముఖం మీద డబ్బు విసిరి కొట్టిన సాగర్! నర్మదని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోతాడా!

Illu Illalu Pillalu Serial Today Episode May 19th సాగర్ 5 లక్షలు తీసుకొచ్చి రామరాజు ముఖం మీద విసిరి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode | వల్లీని మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి రామరాజు, వేదవతి పర్మిషన్ ఇచ్చేస్తారు. వల్లీ బయల్దేరి వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్తుంది. ఇక ధీరజ్, ప్రేమలు కారు ఆన్‌లైన్‌ యాప్లో పెట్టి మొదటి రైడ్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ధీరజ్ అక్కాబావలు మార్కెట్‌కి వెళ్లి వస్తుంటారు. ఆటో వాడు 50 రూపాయలు ఇవ్వాలని అడగటంతో అంత డబ్బా అని నోరెళ్ల బెట్టి కామాక్షి భర్తని నడిపిస్తుంది. కాస్త దూరం వెళ్లిన తర్వాత ధీరజ్, ప్రేమలను చూసి తమ్ముడి కారు ఎక్కి ఏసీలో ఫ్రీగా వెళ్లిపోదాం అని భర్తని తీసుకొస్తుంది.

ALSO READ: కార్తీకదీపం సీరియల్: దీప, కార్తీక్‌లను విడదీసేసిన జ్యోత్స్న! 2 వారాలు జ్యో, దీపలకు కొత్త బాధ్యతలు!

కామాక్షి వల్లే కారు విషయంలో అంత గొడవ జరిగింది అని ధీరజ్ అక్కతో సరిగా మాట్లాడడు. కామాక్షి మాత్రం తన భర్తకి మోకాలి నొప్పులు అని డ్రాప్ చేయమని అంటుంది. మేం చేయం అని ధీరజ్ అంటే ప్రేమ ఏదో ప్లాన్ చేసి అలా అంటావేంట్రా మీ అక్కని డ్రాప్ చేయాల్సిన బాధ్యత నీదే అని చెప్పి డ్రాప్ చేయమని కారు ఎక్కిస్తుంది. ధీరజ్‌కి ఏం అర్థం కాక బిక్కు ముఖం పెడతాడు. మరోవైపు వల్లీ సుకన్యతో మీ అబద్ధాలతో నా కాపురం ముంచేశారే.. మా అమ్మకి ఫోన్ కూడా కలవడం లేదు ఏం చేసి చావాలే అని వల్లీ తెగ టెన్షన్ పడుతుంది. ఇంతలో నర్మద డోర్ కొట్టడంతో ఆడ యమధర్మరాజు వచ్చేసిందే అని గది మొత్తం పరుగులు పెడుతుంది. నర్మద అదే పనిగా డోర్ కొట్టడంతో వల్లీ డోర్ తీస్తుంది. ధీరజ్ కామాక్షి వాళ్లని కారు ఎక్కించుకుంటాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కామాక్షి తమ్ముడితో కాస్త దూరంలో షాప్ ఉంది డ్రింక్ తాగి వెళ్లండి అనేస్తుంది. కామాక్షి వెళ్లిపోతుంటే ప్రేమ ఆపి కారు అద్దె 500 ఇవ్వండి అని అడుగుతుంది. కామాక్షి గుండె ఆగినంత పని అయిపోతుంది. కామాక్షి భర్త 500 ఇస్తాడు. మా వదిన ఆ మాత్రం 500 ఇవ్వలేదా ఏంటి.. ఆడపడుచు కట్నం అడిగి విసిగించడమే కాదు.. ఇలా తమ్ముడికి సాయం చేయడం కూడా వదినకు తెలుసు అని అంటుంది ప్రేమ. 

నర్మద వల్లీని తీసుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతుంది. ఇంతలో భాగ్యం, ఇడ్లీబాబాయ్ వస్తారు. మా అమ్మడుని హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి బయల్దేరారా.. వదిన గారు సంప్రదాయం మీకు తెలీనిది కాదు కదా.. మా అమ్మడుకి మేమే పురుడు పోస్తామని అంటుంది. భాగ్యం వల్లీని హాస్పిటల్‌కి తీసుకెళ్తా అని పిలిస్తే వల్లీ పరుగులు పెడితే నర్మద ఆపుతుంది. మీరు ఏ దిక్కుమాలిన హాస్పిటల్‌కి తీసుకెళ్తారో ఏంటో నేను పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తా అని నర్మద అంటుంది. అలా ఏం లేదమ్మా మంచి హాస్పిటల్‌కే తీసుకెళ్తా అని భాగ్యం అంటే వద్దని నర్మద ఆపి వల్లీని తీసుకెళ్తున్న టైంకి సాగర్ వచ్చి రామరాజు గారు రామరాజు గారు అని అరుస్తాడు. 

ALSO READ: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం చెల్లినే ఎదురించిన సింహాద్రి! మురళీ, నందుల నిశ్చితార్థం జరుగుతుందా!

వేదవతి, నర్మద వాళ్లు బయటకు వెళ్లి రేయ్ నీకు బుద్ధి ఉందా కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఏంట్రా అని అడుగుతుంది. కన్నకొడుకుకి ఇవ్వాల్సిన మర్యాద ఆయన ఇస్తే నేను మర్యాద ఇస్తా అని అంటాడు. రామరాజు బయటకు వస్తాడు. మీ 5 లక్షలు విసిరి కొట్టి నా భార్యని తీసుకెళ్లమని  చెప్పారు కదా అని 5 లక్షలు రామరాజు ముఖాన విసిరి కొట్టేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు.  వేదవతి సాగర్‌ని లాగిపెట్టి కొట్టి.. ఏరా మీ నాన్న మీదే డబ్బు విసిరి కొట్టే అంత పెద్దోడివి అయిపోయావారా అని అంటుంది. తప్పేముంది అమ్మా ఆయనే విసిరి కొట్టమని చెప్పాడు కదా అని అంటాడు. నోర్ముయ్‌రా.. మీ నాన్న చిన్నోడు ఆ రోజు డబ్బు కట్టమని ఎందుకు అన్నారో తెలుసా అని వేదవతి అంటే వీళ్లకి కన్నకొడుకు, తోడపుట్టిన వాడికంటే డబ్బే ఎక్కువ కాబట్టి అని అంటాడు.

నోర్ముయ్‌రా మీరు ఇంటి నుంచి వెళ్లకుండా ఆపాలని అలా అన్నారు అంటుంది వేదవతి.. ఆయనది ప్రేమ కాదు ఇగో నేను ఆయన మాట వినకుండా మంచి జాబ్ చేయడం ఆయనకు ఇష్టం లేదు.. ఆయన కింద పనోడిలా రైస్‌మిల్లులో మూటలు మోయాలని చూస్తున్నాడు అని సాగర్ అంటాడు. రేయ్ ఏంట్రా ఆ మాటలు ఆయన దేవుడురా అని వేదవతి అంటే మీ ఆయనను దేవుడు అనడం ఆపమ్మా అని సాగర్ అంటాడు. చందు వచ్చి రేయ్ నాన్న మన విషయంలో నిజంగానే దేవుడు అని అంటే అన్నా చందన్నా నువ్వు ఆయన ముద్దుల కొడుకు కాబట్టి నీకు ఆయన దేవుడే.. కానీ నన్ను కొడుకులా కాకుండా శత్రువులా పొడుచుకు తింటున్నారు.. అని అంటాడు సాగర్. నర్మద సాగర్‌తో ఏంటి సాగర్ రెండు రోజులకు ఒక్కసారి గొడవ పెడతావా.. ఇంట్లో వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వవా అని అడుగుతుంది. ఇక నుంచి నేను ఇంటి నుంచి వెళ్లిపోతా కదా వాళ్లు ప్రశాంతంగా ఉంటారులే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నేను విలన్ కాదు నాన్న.. నిద్రపోయిన విహారితో మాట్లాడి ఏడిపించేసిన సిరి పాప!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నేను విలన్ కాదు నాన్న.. నిద్రపోయిన విహారితో మాట్లాడి ఏడిపించేసిన సిరి పాప!
Podarillu Serial Today June 11th:నారాయణ బెదిరింపులకు నోరుమూసుకుని వెళ్లిన రమణయ్య...ఇంతకీ ఏం చెప్పి బెదిరించాడు..?
పొదరిల్లు: నారాయణ బెదిరింపులకు నోరుమూసుకుని వెళ్లిన రమణయ్య...ఇంతకీ ఏం చెప్పి బెదిరించాడు..?
Karthika Deepam 2 Serial Today June 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి ఐలవ్‌యూ చెప్పిన సూరజ్! నా అసలైన మనవరాలు దీపే.. డూప్లికేట్‌కి టైం దగ్గర పడిందా!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి ఐలవ్‌యూ చెప్పిన సూరజ్! నా అసలైన మనవరాలు దీపే.. డూప్లికేట్‌కి టైం దగ్గర పడిందా!
Godavari Serial Today June 11th: 'గోదావరి' సీరియల్: తోట డాక్యుమెంట్స్ గురించి తెలుసుకున్న జాను! సింహాద్రి అంతు చూస్తుందా!
'గోదావరి' సీరియల్: తోట డాక్యుమెంట్స్ గురించి తెలుసుకున్న జాను! సింహాద్రి అంతు చూస్తుందా!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget