అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today June 2nd: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?

Illu Illalu Pillalu Serial Today Episod June 2nd: మళ్లీ రైస్‌మిల్లు క్యాషియర్‌ సీటులో తండ్రిని కూర్చోబెట్టడానికి వల్లి కొత్త ప్లాన్‌లు వేయగా...భార్యను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపడానికి ధీరజ్ ఏం నాటకం ఆడాడు.

Illu Illalu Pillalu Serial Today Episode: అందమైన కుటుంబ కథతో స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న ఇల్లు,ఇల్లాలు,  పిల్లలు సీరియల్‌ ఇవాళ మంచి ట్విస్టులతో సాగుతుంది. రామరాజు ఇంట్లో పాగా వేయడానికి వల్లివాళ్ల అమ్మానాన్నలు వేసిన ప్లాన్‌ వేయగా....ఎస్‌ఐ కోచింగ్‌కు భార్యను ఒప్పించడానికి ధీరజ్ పథకం వేస్తాడు. అలాగే ధీరజ్‌ను కేసులో ఇరికించడానికి భద్రావతి మరో పన్నాగం పన్నడంతో ఈరోజు ఏపిసోడ్ ట్విస్టులతో సాగుతుంది.

వల్లికి కొత్త ప్లాన్ గురించి చెప్పిన తల్లి
   ఒకరినొకరు కొట్టుకున్న దెబ్బలకు మందులు రాసుకుంటూ భాగ్యం, గోపీ మూలుగుతుండగా సుబ్బును తీసుకుని వల్లి అక్కడికి వస్తుంది.నేను అక్కడ బాధలపడుతుంటే మీరు ఇక్కడ రోమాన్స్‌ చేసుకుంటున్నారా అని ఏడుస్తుంది.రొమాన్స్‌ కాదే తల్లి దెబ్బలకు మందు రాసుకుంటున్నామని చెబుతుంది.మా వల్లే ఆ ఇంట్లో గొడవలు అయ్యాయని...ఇంటి మధ్య గీత గీయడానికి మనమే కారణమని ఆ నర్మదాకు తెలిసిపోయిందని తల్లి భాగ్యం వల్లికి చెబుతుంది. దీంతో వల్లి అదిరిపడుతుంది.అంటే మన ప్రత్యర్థులకు మన కుట్రలు తెలిసిపోయాయన్నమాట అని అంటుంది.

మమ్మల్ని కొట్టి చంపేస్తే ఆ బాధతో నీ కడుపులో బిడ్డకు ఏమైనా అవుతుందని జాలిపడి వదిలేశారని చెబుతుంది. దీంతో వల్లి మరింత కంగారుపడుతుంది. అసలు ఇది నిజం కడుపుకాదని తెలిస్తే మీతోపాటు నా ప్రాణాలు కూడా తీస్తారని వల్లి భయపడుతుంది. ఇప్పటికే రెండు,మూడుసార్లు ఆస్పత్రికి వెళ్దామన్నారని....ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నామని చెబుతుంది. మరోసారి మీనాన్నను రైస్‌మిల్లు క్యాషియర్‌ సీటులో కూర్చోబెట్టడానికి నాదగ్గర మంచి ఉపాయం ఉందని చెప్పి కూతరుకు చెప్పి పంపిస్తుంది.

ధీరజ్‌పై భద్రావతి కుట్రలు
  నా మేనకోడలకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడమేగాక....ఇప్పుడు ఏకంగా నా మేనల్లుడిపై నీ చెల్లితో కేసుపెట్టించి జైలుకు పంపిస్తావా అంటూ ధీరజ్‌పై భద్రావతి నిప్పులు కక్కుతుంది. ఎలాగైనా వాడిని మత్తుమందుల కేసులో ఇరికించాలని ఎస్‌ఐకు చెబుతుంది.ఎస్‌ఐ చెప్పిన ప్లాన్ ప్రకారం తన మనుషులతో పెట్టల్లో కింద మాదకద్రవ్యాలు, పైన మామిడిపండ్లు పెట్టిన పెట్టెలను సిద్ధం చేయిస్తుంది. రోడ్డుపైన ధీరజ్‌గాడి కారు కనిపించగానే కిరాయి కోసమని చెప్పి వాడికారు ఎక్కమని చెబుతుంది. ఆ తర్వాత ఎస్‌ఐ రాగానే దిగి పారిపొమ్మని అంటుంది.అప్పుడు ఆ ఎస్‌ఐ ధీరజ్‌ను అరెస్ట్ చేస్తాడని వాడు జీవితంలో ఇక బయటకు రాడని చెబుతుంది.

Also Read : Ram Charan : ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్

ప్రేమను ఒప్పించిన ధీరజ్‌
                 ఎన్నిసార్లు చెప్పినా ఎస్‌ఐ కోచింగ్‌కు ప్రేమ వెళ్లడం లేదని గ్రహించి...ఇంటికి పూలు,హల్వా తీసుకుని వస్తాడు. ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్‌నైట్ చేసుకుందామని వెంటపడతాడు. దీంతో ప్రేమ అరిచి నర్మదను పిలుస్తుంది. దీంతో ధీరజ్‌ పూలు,హల్వా దాచిపెట్టి నాకేం తెలియదంటాడు. లేదు అక్క ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ చేసుకుందామని ఏడిపించాడని చెబుతుంది. అయితే చేసుకోవచ్చు కదా అంటూ నర్మద నవ్వుతుంది.లేదు వదిన ఇప్పటి వరకు ఇదే నన్ను ఊపిరి ఆడనివ్వలేదని...సరదాగా అబద్ధ చెబుతాడు. దీంతో నవ్వుకుని నర్మద అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రేమ భర్తతో మీ గురించి నాకు తెలియదా అని అంటుంది.నా ఆశయం కోసం మీరు ఎంత నిగ్రహంగా ఉంటున్నారో నేను అర్థం చేసుకోగలనని అంటుంది. మీకోసం నేను కోచింగ్‌కు వెళ్తానని చెప్పడంతో ధీరజ్ ఆనందంతో ఆమెను ఎత్తుకుని తిప్పుతాడు.

Also Read : Janhvi Kapoor : తెలుగులో స్పీచ్ అదరగొట్టిన జాన్వీ - ట్రెడిషనల్ లుక్‌లో అచ్చియమ్మ

వల్లి కొత్త ఎత్తులు
  తండ్రిని మళ్లీ రైస్‌మిల్లులోకి తీసుకొచ్చేందుకు వాళ్ల అమ్మ చెప్పిన ప్లాన్ ప్రకారం వల్లి భర్తను చూసి ఏడుపులంకించుకుంటుంది. మానాన్న రోడ్డుపక్కన ఇడ్లీలు అమ్ముతూ వడదెబ్బకొట్టి కిందపడిపోయాడని చెబుతుంది.ఆయనకు అసలే గుండెనొప్పి  ఉందని...ఎండలో పనిచేయలేకపోతున్నాడని అంటుంది.ఇంతలో ధీరజ్‌ టిఫిన్ పట్టుకుని అక్కడ ప్రత్యక్షమవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కిడ్నాప్ చేసింది ఎవరు? అంబిక, సుభాష్ బండారం బయట పడిపోయిందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కిడ్నాప్ చేసింది ఎవరు? అంబిక, సుభాష్ బండారం బయట పడిపోయిందా!
Karthika Deepam 2 Serial Today June 10th: కార్తీకదీపం 2 సీరియల్: నిజం తెలుసుకున్న కుటుంబం.. జ్యోత్స్నని పెద్దాయన ఇంట్లో నుంచి గెంటేసినట్లేనా!
కార్తీకదీపం 2 సీరియల్: నిజం తెలుసుకున్న కుటుంబం.. జ్యోత్స్నని పెద్దాయన ఇంట్లో నుంచి గెంటేసినట్లేనా!
Godavari Serial Today June 10th: 'గోదావరి' సీరియల్: సూర్య, జాను స్నేహం షురూ! మురళీ సూర్యకి ఏం చెప్పాడు! భువన పరామర్శ!
'గోదావరి' సీరియల్: సూర్య, జాను స్నేహం షురూ! మురళీ సూర్యకి ఏం చెప్పాడు! భువన పరామర్శ!
Podarillu Serial Today June 10th: కన్నా తల్లిని రోడ్డుపై చూసిన మహాలక్ష్మీ...ఆమె గురించి నారాయణను నిలదీసిన మహా...
పొదరిల్లు: కన్నా తల్లిని రోడ్డుపై చూసిన మహాలక్ష్మీ...ఆమె గురించి నారాయణను నిలదీసిన మహా...
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NBK111 Glimpse : NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
Cricketer Bharti Fulmali : మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget