Illu Illalu Pillalu Serial Today Episode నర్మద ఆఫీస్‌కి వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్న మామయ్య దగ్గరకు వెళ్తుంది. మామయ్య గారు ఆఫీస్‌కి వెళ్లొస్తా అని చెప్తుంది. రామరాజు ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి నిల్చొంటాడు. నర్మద కన్నీరు పెట్టుకుంటూ వెళ్తాడు. రామరాజు కోడలు వెళ్లిపోతుంటే చూసి పిలవాలి అని పిలలేకపోతాడు. కోడలిని చూసి చాలా బాధ పడతాడు.
శ్రీవల్లి ఇచ్చిన శిక్షకి ప్రేమ బూజు కర్ర పెట్టుకొని స్టోర్ రూం క్లీన్ చేయడానికి వెళ్తుంది. అబ్బా ఈ వల్లీ చాలా ఎక్స్‌ట్రాలు చేస్తుంది. ఓవైపు ఆ ధీరజ్ మాటలకు తల పగిలిపోతుంటే మరోవైపు ఈమె టార్చర్. వాడి మీద కోపంతో ఈవిడను కొట్టేస్తా అన్న భయం ఉంది.. అయినా వాడి మాటలతో కలిగించిన బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదులే అనుకుంటుంది. ప్రేమ కష్టపడి పని చేస్తుంటే అత్త అక్కడికి వచ్చి దూరంగా నిలబడి చూసి బాధ పడుతుంది. ప్రేమ చూడటం చూసి వేదవతి వెళ్లిపోతుంది. అందరూ ఉన్న ఒంటరి అయిపోయా అని ప్రేమ ఏడుస్తుంది.
ప్రేమ కష్టపడుతుంటే తన తండ్రి చూసి బాధ పడతాడు. ప్రేమ తండ్రి దగ్గరకు వెళ్తుంది. మీ అమ్మ నీకు ఏదైనా పని చెప్తే నా కూతురికి పని చెప్తావా అని కొట్టడానికి వెళ్లేవాడిని అలాంటిది నువ్వు ఇప్పుడు కష్టపడటం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా అమ్మా.. నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అత్తారింట్లో పనులు చేయాలి కదా అని మీ అమ్మ అంటే నా కూతురు మహారాణి కాలు కింద పెట్టించకుండా పది మంది పనిమనుషుల్ని పెట్టి చూసుకుంటే ఇంటికి పంపిస్తా అన్నాను కానీ నువ్వే పని మనిషివి అయిపోయావ్ కదమ్మా.. నాలుగు అయిదు వేల కోసం డ్యాన్స్ క్లాస్‌లు చెప్తున్నావ్ ఇలా పని మనిషిలా అయిపోయావ్.. ఇదా నేను నా కూతురి కోసం కలల కన్న జీవితం.. ఎన్నో కలలు కన్నాను.. ఇలా కోరి కోరి నరకం తెచ్చుకున్నావేంటి అమ్మా. దయచేసి మన ఇంటికి వచ్చేయ్.. నిన్ను ఒక్క మాట అనము మా కూతురు తప్పిపోయి మళ్లీ వచ్చింది అనుకుంటాం.. వచ్చేయమ్మా నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఈ ప్రాణం ఏమైపోతుందో అని అంటాడు.
తండ్రి మాటలకు ప్రేమ ఏడుస్తూ వెళ్లి ఆ మాటలు దాక్కొని విన్న ధీరజ్‌ని చూసి ఏడుస్తుంది. ధీరజ్ చాలా బాధ పడతాడు. మరోవైపు నర్మద ఆటోలో ఆఫీస్‌కి వెళ్తూ నా కుటుంబాన్ని ఆ భాగ్యం కూతురితో కలిసి అల్లకల్లోలం చేస్తున్నా ఎందుకు చూస్తూ ఉండిపోయాను? ఎందుకు వాళ్ల బాగోతం బయట పెట్టడం లేదు? నా ఇంటిని నేనే కాపాడుకోవాలి.. ముందు మామయ్య గారికి నా మీద ఉన్న అసహనం పోగొట్టాలి అని రామరాజు మిల్ దగ్గరకు వెళ్తుంది. తిరుపతి, రామరాజు నర్మదని చూస్తారు. ఇప్పటి వరకు ఎప్పుడు తను ఇక్కడికి రాలేదు. సాగర్ కోసం వచ్చినట్లు ఉంది.. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అంటాడు.
నర్మద మామయ్య దగ్గరకు వస్తుంది. మీతో మాట్లాడాలి మామయ్య అంటుంది. మాట్లాడటానికి ఏముందు అమ్మా అని రామరాజు అంటాడు. నర్మద సారీ చెప్తూ సంజాయిషీ ఇవ్వనివ్వండి అంటుంది. ఇంటి విషయాలు ఇక్కడ వద్దు అని రామరాజు అంటాడు. అయినా నర్మద చెప్తుంది. మామయ్య కూతురికి ఏదైనా సమస్య వస్తే తండ్రితోనే చెప్పుకుంటుంది కదా. మరి తండ్రి కూతురి బాధ వినకపోతే ఎవరితో చెప్పుకోవాలి మామయ్య. ఆ బాధని ఎలా మోస్తుంది. ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయం నాకు నిజంగా తెలీదు.. కానీ నేను ఎందుకు ప్రేమకి సపోర్ట్ చేశాను అంటే తను నా చెల్లి లాంటిది.. ప్రస్తుతం తనకు నా అనే వాళ్లు ఎవరూ లేరు. అలాగే తన భర్త కష్టం చూడలేక తను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అనుకుంది అందులోనూ న్యాయం ఉంది అనిపించింది. ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడం తప్పే కానీ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి. మీరు మాతో మాట్లాడకుండా శిక్షిస్తే మేం ఏమైపోవాలి మామయ్య అని నర్మద ఏడుస్తుంది.
నర్మద ఏంటమ్మా ఇది ఆడపిల్ల కంట తడి పెట్టుకోకూడదు అది ఎవరికీ మంచిది కాదు అని అంటాడు. నర్మదకు తాగడానికి నీరు ఇస్తారు. మా పెళ్లి అయినప్పటి నుంచి మా అమ్మానాన్న నాతో మాట్లాడటం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడటం లేదు. అత్తయ్య మాట్లాడటం లేదు.. సాగర్ దూరం పెడుతున్నాడు. అందరూ దూరం పెడితే నేను ఎన్నాళ్లు ఆ ఇంట్లో ఉండగలను మామయ్య.. తప్పు చేశాను కాబట్టి శిక్షించండి కానీ మాట్లాడకుండా ఉండొద్దు. అటు కన్నవాళ్లు దూరం పెట్టి ఇటు మీరు కూడా దూరం పెడితే మేం ఏమైపోతాం అని ఏడుస్తుంది. నేను మాట్లాడుతా నువ్వు ఏడ్వొద్దు అని చెప్తాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మామయ్య అని ఆఫీస్‌కి బయల్దేరుతుంది. వెళ్తూ వెళ్తూ సాగర్‌ని చూసి ఆగుతుంది. సాగర్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. రామరాజు చూసి రేయ్ ఏంట్రా నీ భార్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనిపించడం లేదా.. లేపుకెళ్లి పెళ్లి చేసుకోవడం తెలుసు పెళ్లాన్ని ఎలా చూసుకోవాలో తెలీదా వెళ్లి డ్రాప్ చేయ్ అని అంటాడు. సాగర్ సరే అని వెళ్తాడు.
ప్రేమ తండ్రి మాటలు తలచుకొని బాధపడుతూ పనులు చేస్తుంది. ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ చేతిలో కర్ర పడేస్తాడు. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావ్ నీకు ఎవరు చేయమన్నారు అని అడుగుతాడు. నువ్వు నన్ను భార్యగా చూడకపోయినా మనిషిలా కూడా చూడకపోయినా నా మెడలో తాళి కట్టి నా ముఖం మీద ధీరజ్ భార్య అని రాశావు కదా మరి అప్పుడు నేను ఈ పనులు చేయాలి కదా.. నువ్వు నన్ను ఓ వస్తువులా చూస్తావు కానీ ఇంట్లో అందరూ ధీరజ్ భార్యగా ఈ ఇంటి కోడలిగా చూస్తారు. నీతో నాకు భార్య అనే బంధం లేకపోయినా సరే నేను చచ్చినట్లు మీ పెద్ద వదిన చెప్పినట్లు చేయాలి అంటుంది. నేను వెళ్లి అడుగుతా అని ధీరజ్ అంటే నువ్వు ఎవరు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.