Illu Illalu Pillalu Serial Today February 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 20 లక్షలు అడిగిన రామరాజు! సాగర్ ఏం చేస్తాడు? సంతోషంలో ధీరజ్!
Illu Illalu Pillalu Serial Today February 9th Episode రామరాజు ఎదురింటిని చూస్తూ అర్దరాత్రి అమూల్య కోసం బాధ పడటం వేదవతి ఓదార్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode | సాగర్ తండ్రి డబ్బు దొంగతనం చేసి జాబ్ కొనేస్తాడు. ఇంటికి రాగానే వేదవతి కొడుకుతో మీ నాన్నకి ఈ రోజు డిశ్చార్జీ చేశారు.. మరి నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్లావని కేకలేస్తుంది. రైస్ మిల్లు దగ్గరకు వెళ్లానని చెప్పి సాగర్ తప్పించుకుంటాడు. దాంతో వేదవతి మీ నాన్నకి పూర్తిగా నయం అయిన వరకు మిల్లుకు రారు.. ఇక మిల్లు పూర్తి బాధ్యత నీదే.. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తుంది. సాగర్ జాబ్లో జాయిన్ అవ్వాలి అన్న విషయం గుర్తు చేసుకొని అలా ఉండిపోతాడు. ఏమైందిరా అని వేదవతి అడిగితే అలాగేమ్మా అని అంటుంది.
రామరాజు సాగర్‌తో మొన్న వనజ వాళ్లు ఇచ్చిన 20 లక్షలు బ్యాంక్‌లో వేయమని చెప్పాను కదా వేశావా అని అడుగుతాడు. వేశాను అని సాగర్ అబద్ధం చెప్తాడు. నేను చెప్పినప్పుడు వాటిని తీసి ఇవ్వరా వాళ్లకి ఇచ్చేయాలి అని రామరాజు అంటాడు. సాగర్ భయపడుతూ సరే అంటాడు. వాళ్లకి ఇవ్వాలా నాన్న వాళ్లు అడగలేదు కదా అని అంటే అలా అంటావేంటిరా వాళ్లు అడగకపోయినా మనం ఇచ్చేయాలి అని రామరాజు చెప్తాడు. ఇక ధీరజ్ గదిలో తండ్రిని తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. ప్రేమ ధీరజ్‌ని చూడకుండా హాల్‌టికెట్ దాచేయాలి అనుకుంటుంది. అక్కడే ఉన్న ధీరజ్ ప్రేమ చేతిలో కవర్ చూసి ఏయ్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. ప్రేమ షాక్ అయి అయితే నువ్వు గదిలోనే ఉన్నావా అంటుంది. ఏదో దాస్తున్నావ్ ఏంటి అని ధీరజ్ అడిగితే ఏం లేదు అని ప్రేమ అంటుంది.
ధీరజ్ లెటర్ తీసుకొని చూసి ఎస్‌ఐ ఎగ్జామ్ హాల్‌టికెట్ ఇంత మంచి విషయం నాకు చెప్పవేంటే అని అడుగుతాడు. నేను పరీక్ష రాయనురా.. ఇప్పటికి ఇంట్లో ఉన్న సమస్యలు చాలు నేను నా ఉద్యోగం మరో సమస్య కాకూడదు అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే కానీ ఇది నీ కల.. నీ కల నిజం అవ్వడం ముఖ్యం కదా.. నీ ఇష్టాలను గెలిపించడం నా బాధ్యత. నువ్వేం టెన్షన్ పడకు.. ఎవరూ బాధ పడకుండా నేను చూసుకుంటా.. టైం తక్కువ ఉంది..బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్పి ప్రేమ నుదిటి మీద ముద్దు పెట్టి సంతోషంగా వెళ్లిపోతాడు.
సాగర్ ఆఫర్ లెటర్ పట్టుకొని ఏం చేయాలి నాన్న డబ్బులు ఇవ్వమని బాంబ్ పేల్చాడు అని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద సాగర్‌ని చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ ఏమైంది అని అడుగుతుంది. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అంటాడు. ఇంత మంచి న్యూస్ చెప్పావ్ అని హగ్ చేసుకుంటుంది. నాకు తెలీకుండా నువ్వు ఎప్పుడు అప్లే చేసి జాబ్ కొట్టావ్.. అని అడుగుతుంది. నాలుగు ఐదులో ఇదొకి ఒకే అయింది అంటాడు. నర్మద అనుమానించి అడిగితే నీ కోసం జాబ్ కొడితే ఇలా అనుమానిస్తావా అని అంటాడు. నర్మద సారీ చెప్పి చాలా సంతోషపడుతుంది. వనజ వాళ్లకి 20 లక్షలు ఇవ్వాల్సిందేనా అంటే ఇవ్వాలి వాళ్లు అడగకపోయినా మనం ఇవ్వాల్సిందే.. మామయ్య చెప్పారు కదా.. అంటుంది.
వేదవతి నిద్రలో అమూల్యని విశ్వ కొట్టిన విషయం తలచుకొని ఉలిక్కి పడి లేస్తుంది. పక్కన చూస్తే రామరాజు ఉండడు.. రామరాజు కోసం బయటకు వెళ్తుంది. రామరాజు బయట నిల్చొని అమూల్య కోసం ఎదురింటి వైపు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అమూల్య కూడా నిద్రపోకుండా తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వేదవతి భర్త దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అండీ.. మీరు కనిపించకపోయే సరికి చాలా కంగారు పడ్డాను అంటుంది.
చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను నాకు ఏం అవుతుందే అని అంటాడు. లైట్ వెలుగుతున్న గదిని చూపించి అక్కడ నా బంగారు తల్లే ఉంటుంది కదా.. నా బంగారు తల్లి అడిగితే ఏమైనా ఇచ్చేస్తా కదా.. మరి మన శత్రువుని ఎలా ప్రేమించిందే.. ఆ ఇంట్లో అందరూ మన మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు.. ఆ విశ్వక్ గాడు మన మీద పగతో దాన్ని చేసుకున్నాడు అది దానికి అర్థం కాలేదు ఏంటే అంటాడు. దాని గురించి వదిలేయండి దాని కోసం మర్చిపోండి అంటుంది. నా కూతురుకి వాళ్లు నరకం చూపిస్తారే అని అంటాడు. దాన్ని వదిలేయండి అని వేదవతి అంటే అవునా అయితే నువ్వు ఎందుకే నిద్రలో లేచావ్.. నీ ముద్దుల కూతురు గుర్తొచ్చే కదా అంటాడు. అలా ఏం కాదు అని వేదవతి అనేస్తుంది.
ఉదయం నర్మద, ప్రేమలు ముగ్గు వేస్తూ మాట్లాడుకుంటారు. సాగర్‌ని గవర్నమెంట్ జాబ్ వచ్చిన విషయం నర్మద చెప్తుంది. ప్రేమ చాలా సంతోషపడుతుంది. ఇంట్లో ఎవరికీ విషయం చెప్పలేదు అని నర్మద అంటుంది. ఇక ప్రేమ కూడా పరీక్ష గురించి చెప్తుంది. నేను పరీక్ష రాయను అంటే ధీరజ్ మొండిపట్టు పట్టాడని అంటుంది. అది మొండి కాదు ప్రేమ అని నర్మద అంటుంది. ఇంతలో అమూల్య ఎవరూ చూడకుండా గేటు వరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























