Illu Illalu Pillalu Serial Today February 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నగలు తాకట్టు పెట్టి అప్పు తీర్చేసిన నర్మద! భాగ్యం, వల్లీలకు ఇదో అవకాశం!
Illu Illalu Pillalu Serial Today Episode February 23rd నర్మద తన నగలు తాకట్టు పెట్టి వనజకు 20 లక్షలు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, సాగర్‌లు నగలు తాకట్టు పెట్టడానికి సేటు దగ్గరకు వెళ్తారు. వల్లీ తండ్రి ఆనంద్ రావు చాటుగా ఫాలో అవుతాడు. నర్మద నగలు ఇచ్చి డబ్బు ఇవ్వమని అంటే ఆ నగలుకి 9 లక్షలే వస్తాయని అంటారు. 20 లక్షలు కావాలి అని నర్మద అడుగుతుంది. మీరు ప్రసాద్ రావు గారి అమ్మాయి కదా,, ఆయన రామరాజు గారి అబ్బాయి కదా మీ కోసం మిగతా 11 లక్షలు రెండు రూపాయల వడ్డీకి ఇస్తానని అంటాడు. నర్మద సరే అంటుంది. సేటు డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించి డబ్బు ఇస్తాడు.
ఇడ్లీబాబాయ్ మొత్తం చూసి విషయం భాగ్యానికి చెప్పడానికి పరుగులు తీస్తాడు. వల్లీ ఇంట్లో పని చేస్తూ త్వరలో కోటీశ్వరురాలు అవ్వబోతున్నాఅయినా ఈ ఇంటి పని చేయడం తప్పడం లేదు.. అధికారం నా చేతిలోకి వస్తే పది మంది పనివాళ్లని పెట్టుకోవాలి అనుకుంటుంది. మరోవైపు ధీరజ్, ప్రేమ బయట నుంచి వస్తారు. ధీరజ్ కోపంగా బైక్ దిగి ఇంట్లోకి వెళ్లిపోతాడు. ప్రేమ వెనకాలే వెళ్లి నీకు ఉద్యోగం ఇచ్చిన వాడి మీద అంత కోపం ఎందుకురా అని అంటుంది. మానాన్నని అంత మాట అంటాడా అని ధీరజ్ అంటాడు. వల్లీ ప్రేమ, వాళ్ల మాటలు వినడానికి చాటుగా తలుపు దగ్గర నిల్చొంటుంది. ప్రేమ ధీరజ్‌తో నువ్వు ఇలా ఉండటం కాదురా.. నువ్వు ఎప్పుటికీ ఇలా డ్రైవర్‌గా ఉండిపోకూడదు.. నువ్వు కూడా నీకు నచ్చిన ఫీల్డ్‌లో ఉండటానికి ట్రై చేయరా అని చెప్తుంది. తర్వాత తలుపు చాటుగా వింటున్న వల్లీ దగ్గరకు వెళ్లి డోర్ తీసి ఇక్కడేం చేస్తున్నావ్.. సిగ్గు ఉందా నీకు.. కడుపునకు అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా.. అని తిడుతుంది.
నర్మద, సాగర్‌లు 20 లక్షలు తీసుకెళ్లి వనజకు ఇస్తారు. వనజ టీ కాఫీ అంటే మీ గుమ్మం తొక్కడమే ఇష్టం లేదు కానీ మర్యాదగా ఇవ్వమని అన్నారు కాబట్టి వచ్చా.. అని అంటుంది. వనజ కొడుకు మనోహర్ దగ్గరకు వెళ్లి నువ్వు ఎప్పుడూ ఎవరినీ లవ్ చేయలేదా అంటుంది.. మనోహర్ సైలెంట్‌గా ఉంటాడు. వనజతో దాని అర్థం తెలుసా ఎప్పుడో ఎక్కడో లవ్ చేసినట్లు అర్థం. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవాలని వచ్చింది కూడా అలాగే కదా,.. వనజ గారు అంటే మాకు గౌరవం ఆ రోజు మీరు మాకు అండగా నిల్చొని ఉంటే ఆ గౌరవం ఉండేది కానీ నోటికొచ్చినట్లు మాట్లాడి గౌరవం పోగొట్టుకున్నారు.. పిల్లలు తప్పు చేశారేమో కానీ మా మామయ్య ఎప్పటికీ తప్పు చేయరు.. పిల్లలు తప్పు చేసినా.. చుట్టు పక్కల వాళ్లు ఎన్ని చేసినా మా మామయ్య శిఖరంలానే ఉంటారు. ఆరోగ్యం బాలేని వాళ్లని పలకరించడం మానేసి నానా మాటలు అన్నప్పుడే మీ గురించి తెలిసిపోయింది అనిఅంటుంది. తర్వాత నర్మద సాగర్‌తో మీ అత్తారింటికి పోనీ కొన్ని లెక్కలు సెట్ చేయాలి అని అంటుంది.
భాగ్యం సాగర్ ఉద్యోగం, వనజ 30 లక్షలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వల్లీ వచ్చి ప్రేమ తిట్టిందని అంటుంది. ఏమైంది అని అంటే జస్ట్ తలుపు చాటుగా వాళ్లు ఏం మాట్లాడుకున్నారా అని వింటే తిట్టిందని అంటుంది. అసలు విషయం ఏంటే అంటే ధీరజ్ కారు గురించి కారు ఓనర్‌తో గొడవ గురించి చెప్తుంది. ఇంతలో భాగ్యానికి మీనాక్షి అనే ఫ్రెండ్ కాల్ చేసి సాగర్ మాట్లాడిన వ్యక్తి ఏజెంట్ అని డబ్బు తీసుకొని ఉద్యోగం ఇస్తాడని చెప్తుంది.
ఇంతలో ఇడ్లీబాబాయ్ వచ్చి నర్మద, సాగర్‌లు నగలు తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకొందని అంటాడు. నర్మద పతనం మొదలైందని తన అంతు చూస్తానని భాగ్యం అంటుంది. ఇంట్లో చెప్పేద్దాం అని వల్లీ అంటే సాక్ష్యాలు లేవు కదా అలా కాదు ఆ ఏజెంట్ వైపు నుంచి నరుక్కురావాలని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























