Illu Illalu Pillalu Serial Today February 19th:ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్ నర్మదకు దొరికిపోయాడా! 20 లక్షల సమస్యని నర్మద పరిష్కరిస్తుందా!
Illu Illalu Pillalu Today Episode February 19th వల్లీ రైస్ మిల్లు సంపాదన చూసి తనో కోటీశ్వరురాళ్లా.. నర్మద, ప్రేమలు తన కింద పని వాళ్లలా కలలు కని గాల్లో తేలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode వేదవతి ముగ్గురు కొడుకుల్ని పక్కన కూర్చొపెట్టుకొని మీ ముగ్గురు నాకు మాటివ్వండిరా అని అడుగుతుంది. ఏంటి అని అందరూ అడిగితే మీకు ఏమైనా అయినా.. మీలో మీకు గొడవలు అయినా మీ నాన్న ప్రాణం పోయే అంతలా విలవిల్లాడిపోతారు. వీడు మీ నాన్నకి చెప్పకుండా ఉద్యోగం వెతుక్కునేసరికి మీరు కూడా మీ నాన్నకి చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసి మీ నాన్నని వదిలేసి ఈ గుమ్మం దాటి వెళ్లిపోతారేమో అని మీ నాన్న చాలా భయపడుతున్నారురా.. మీ నాన్నని బాధ పెట్టేలా ఎలాంటి పొరపాట్లు చేయమని.. ఏం జరిగినా సరే మీలో మీరు గొడవలు పడి దూరం అవ్వమని.. ఎలాంటి పరిస్థితులు అయినా సరే గుమ్మం దాటమని మీ ముగ్గురు మాటివ్వండిరా అని అడుగుతుంది.
ధీరజ్ తల్లితో ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంత ఏడ్వాలా అమ్మ మేం ఎలాంటి పరిస్థితుల్లో దూరం అవ్వమని ధీరజ్, చందు తల్లి చేతిలో చేయి వేసి మాటిస్తారు. సాగర్ మాటివ్వకుండా ఉండటంతో నర్మద మాటివ్వమని అంటుంది. చందు కూడా చెప్తాడు. వేదవతి సాగర్‌తో ఏంట్రా మాటివ్వడానికి ఆలోచిస్తున్నావ్ నీ మనసులో ఏమైనా ఉందా అని అడగటంతో సాగర్ మాటిస్తాడు. తల్లీకొడుకులు ఒకర్ని ఒకరు పట్టుకొని ఎమోషనల్ అవుతారు. మరోవైపు చందు రైస్ మిల్లు కలక్షన్ పట్టుకొని లెక్కిస్తుంటే వల్లీ చూసి ఎంత డబ్బు అని పొంగిపోతుంది. ఒక్క రోజుకి పాతిక వేలు అనగానే వల్లీ గాల్లో తేలిపోతుంది. మొత్తం తనకే అన్నట్లు కలలు కంటుంది. శ్రీవల్లీ కోటీశ్వరురాలు అని అనుకుంటూ తానో మహారాణిలా ఊహించుకొని నర్మద, ప్రేమ పని వాళ్లలా ఫీలవుతుంది. నర్మద, ప్రేమ ఇద్దరికీ తను పనులు చేయమని ఆర్డుర్లు వేయడం చేస్తుంది. ఇక చందు లెక్కలు చూసి డబ్బు తండ్రికి ఇవ్వాలని వెళ్తుంటే వెళ్లనివ్వదు.. అన్నీ మీరే చూసుకోండి అని చెప్తుంది. చందు ఓకే అనడంతో ప్రస్తుతానికి మామయ్యకి డబ్బు ఇవ్వకుండా ఆపేశా.. ఇక రైస్మిల్లును దక్కించుకోవాలని అనుకుంటుంది.
ఇడ్లీబాబాయ్ చేతికి మల్లెపూలు చుట్టుకొని భాగ్యం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆరు బయట భాగ్యం ఉంటే అక్కడికి వెళ్తాడు. భార్యని పట్టుకొని డ్యాన్స్‌లు చేస్తాడు. భాగ్యం నడుం తిప్పాలని చూస్తే కదలదు.. దాంతో ఇడ్లీ మీద పెట్టిన మూతలా ఇలా బిగుసుకుపోయింది ఏంటి భాగ్యం అని అంటాడు. దాంతో భాగ్యం భర్తని వాయించేస్తుంది. ఇక ఇడ్లీబాబాయ్ రైస్మిల్లులో 2 వేలు కొట్టేశానని భాగ్యానికి చెప్పి డబ్బులు చూపిస్తాడు. భాగ్యం భర్తని లాగిపెట్టి ఒక్కటి కొట్టి నీకు అస్సలు బుర్ర లేదు అని తిడుతుంది. ఇలా వేయి రెండు వేలు కొట్టేయడం అల్లుడు గారు చూస్తే నిన్ను మిల్లుకి రానివ్వరు.. మన టార్గెట్ మిల్లు ఇలా చిల్లర కాదు అని అంటుంది.
సాగర్ 20 లక్షలు ఎలా ఇవ్వాలి.. ఆ డబ్బుతో ఉద్యోగం కొనుకున్నా అని నాన్నకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద ఫుడ్ తీసుకొని వస్తుంది. తనే సాగర్‌కి గోరు ముద్దలు తినిపిస్తుంది. అందరూ నీ ఉద్యోగం కోసం రకరకాలుగా అంటున్నారు సాగర్.. నేను మాత్రం నిన్ను బాగా నమ్ముతున్నాను.. నువ్వు పరీక్ష రాసే ఉద్యోగం తెచ్చుకున్నావని నమ్ముతున్నా అని అంటుంది. నువ్వు ఎప్పుడు పరీక్ష రాశావ్ అని అడిగితే 16, 17 అని తికమకగా చెప్తాడు. పరీక్ష విజయవాడలో అన్నావ్ కదా.. అంటూ సాగర్‌కి రకరకాల ప్రశ్నలు వేస్తూ గమనిస్తూ ఉంటుంది. సాగర్ సమాధానం చెప్పలేక చాలా కంగారు పడతాడు. రేపు ఉదయం 20 లక్షలు బ్యాంక్ నుంచి తీసుకొచ్చి వనజ గారికి ఇవ్వాలి ఆ విషయం మర్చిపోవద్దని అంటుంది. 20 లక్షలు బ్యాంక్‌లోనే ఉన్నాయి కదా అంటుంది. ఉన్నాయి అని సాగర్ అంటాడు. ప్రామిస్ కూడా వేస్తాడు. ఒక్క నిమిషం ఆగు ఆ రమ్య సంగతి చెప్తా అని ఫోన్ చేసి సాగర్ బ్యాంక్‌కి వచ్చి 20 లక్షలు తీసుకెళ్లాడు అన్నావ్.. అని అడుగుతుంది. నిజంగానే తీసుకెళ్లాడే నేను అబద్ధం చెప్తానా అని రమ్య అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























