Illu Illalu Pillalu Serial Today February 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు పరువు తీసేసిన వనజ! సాగర్ 20 లక్షలు ఎలా ఇస్తాడు?
Illu Illalu Pillalu Serial Today Episode February 18th వనజ ఇంటికి వచ్చి డబ్బు అడగటం సాగర్‌కి డబ్బు తీసుకురమ్మని రామరాజు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode విశ్వ ఆట కట్టించడానికి అమూల్య విశ్వక్‌కి ఇచ్చిన టీలో ట్యాబ్లెట్ కలిపేస్తుంది. దాంతో విశ్వక్ బాత్‌రూంకి పరుగులు పెట్టి కూలబడిపోతాడు. ఏమైందిరా ఇప్పటి వరకు బాగానే ఉన్నావ్ కదా అంటే.. అదే టీలో ఏదో కలిపింది అని అంటాడు. మేం కూడా అదే టీ తాగాం కదా అని భద్రావతి అంటుంది. దానికి బామ్మ భద్రావతి కొత్తగా పెళ్లి అయింది కదా.. పెళ్లాంతో ఉండటానికి ఈ నాటకాలు అని అంటుంది. నీకు అలా అర్థమైందా బామ్మ అని విశ్వక్ అంటాడు.
సేనాపతి కొడుకుతో శత్రువుల కూతురు అది చేస్తా ఇది చేస్తా అని అన్నావ్.. ఇప్పుడు ఇలా పెళ్లాం కోసం నీరుగారిపోతావా ఛీ అని అంటాడు. పెళ్లయిన కొత్తలో నీ పెళ్లాం కొంగు వదిలేవాడికి కాదు నువ్వు మాట్లాడుతున్నావా అని బామ్మ సేనాని అంటుంది. భద్రావతి తమ్ముడిని తీసుకెళ్లిపోతుంది. పాలు చిక్కగా..టీ స్ట్రాంగ్‌గా కావాలా అండీ అని అమూల్య అడిగితే నీకో దండం అని విశ్వక్ అంటాడు. సాగర్ నర్మదని కలుస్తాడు. నర్మద ఫ్రెండ్స్ సాగర్తో మాట్లాడుతారు. ఏంటి టిప్ టాప్గా వచ్చావ్.. బయటకు ప్లాన్ చేశారా అని అడుగుతారు. దానికి సాగర్‌కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని నర్మద చెప్తుంది. ఇప్పుడేం పరీక్షలు లేవుకదా.. అని ఫ్రెండ్స్ అడగటంతో సాగర్ తడబడి కంగారుగా నర్మదని తీసుకొని వచ్చేస్తాడు. నర్మదకి అనుమానం వస్తుంది.
ఇడ్లీబాబాయ్ పచ్చడి తినాలి అనడంతో భాగ్యం పచ్చడి చేస్తుంది. సాగర్ గురించి తేల్చకుండా ఇక్కడ మీ సరసాలు ఏంటి అని శ్రీవల్లి కోప్పడుతుంది. ఇంతలో అక్కడికి వనజ వస్తుంది. రామరాజు అని అరుస్తుంది. వేదవతి, రామరాజు, శ్రీవల్లి వాళ్లు బయటకు వస్తారు. ఇంట్లోకి రండి అని పిలుస్తారు. మర్యాద లేని వాళ్ల ఇంట్లో నేను కాలు పెట్టను అని వనజ అంటే మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు..అయినా ఆ రోజు మేం బాధలో ఉంటే చేయాల్సింది అంతా చేశారు.. ఇప్పుడేం మిగిలింది అంట అని వేదవతి అడుగుతుంది. మీకు పిల్లల్ని పెంచడం మాత్రమే తెలీదు అనుకున్నా.. సంస్కారం కూడా తెలీదన్నమాట అని అంటుంది. పదే పదే నోరు జారితే ఊరుకోను అని వేదవతి అంటుంది. ఏ పని మీద వచ్చారు చెల్లమ్మా అని రామరాజు అడిగితే ఆ రోజు మీ కూతురికి బంగారం కొనమని 20 లక్షలు ఇచ్చాను.. అవి తిరిగి ఇవ్వాలి అని జ్ఞానం లేదా.. ఎవడబ్బ సొమ్మని మీ దగ్గర అట్టి పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తుంది.
నర్మద, సాగర్ అప్పుడే వస్తారు. సాగర్ వనజని చూసి చాలా కంగారు పడతారు. రామరాజు వనజతో చెల్లమ్మా ఏంటి మీరు అనేది.. మా రెండో వాడికి ఆ డబ్బు ఇవ్వమని చెప్పాను..ఇంకా ఇవ్వలేదా అని అంటాడు. ఇన్నిరోజులు హాస్పిటల్లో ఉన్నారని ఊరుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వలేదని నిలదీయడానికి వచ్చా అంటుంది. సాగర్కి ఇప్పుడే కాల్ చేసి అడుగుతా అని అంటాడు. సాగర్ అక్కడే ఉన్నాడని శ్రీవల్లి చెప్తుంది. రామరాజు సాగర్‌ని అడుగుతాడు. కొత్త జాబులో పడి మర్చిపోయా అని సాగర్ అంటాడు. ఇంత నిర్లక్ష్యం ఏంట్రా.. అప్పుడే ఇచ్చేసుంటే ఇప్పుడు ఇలా నిలదీసేవాళ్లు కదా.. ఇంకా అలా చూస్తున్నావేంట్రా.. బ్యాంక్ నుంచి డబ్బు తీసుకురా అంటాడు. నర్మద బ్యాంక్కి వెళ్దాం అని అంటే సాగర్ కదలడు. దానికి శ్రీవల్లి సాగర్ మరిది గారు వెళ్లి డబ్బు తీసుకురాలేరుగా చెల్లాయ్,, సాగర్ మరిదే కాదు ఇంట్లో ఎవరూ బ్యాంక్‌కి వెళ్లి డబ్బు తీసుకురాలేరు.. సాయంత్రం అయిపోయింది అని శ్రీవల్లి అంటుంది. నీ బుద్ధి తక్కువ పని వల్ల మరోసారి నేను తల దించుకొని నిలబడాల్సి వస్తుంది కదరా అని రామరాజు అంటాడు. వెంటనే పెద్దోడికి కాల్ చేసి రైస్‌మిల్లులో ఎంత డబ్బు ఉందో తీసుకురారా.. మిగతావి గుమస్తాకి అడిగి తీసుకురారా అంటాడు. వనజ రామరాజుతో నేను ఎంత మర్యాదగా ఇచ్చానో అంతే మర్యాదగా మీరు నాకు నా ఇంటికి తెచ్చి ఇవ్వండి అంటుంది.
రామరాజు సాగర్‌తో రేపు ఉదయమే వాళ్లకి డబ్బు ఇచ్చేర్ అని అంటాడు. వేదవతి జరిగిన విషయం తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. ధీరజ్, ప్రేమలు అప్పుడే వచ్చి ఏమైందని అడుగుతారు. చందు కూడా ఏమైంది అని అడుగుతాడు. వేదవతి ఏం చెప్పదు. సాగర్ కూడా పిలుస్తుంది. నర్మద, సాగర్ వస్తారు. ముగ్గురు కొడుకులు తల్లి చుట్టూ కూర్చొంటాడు. కుటుంబం అంతే కేవలం మనుషులు కలిసి ఉండటమే కాదురా.. మనసుల నుంచి వాళ్లు వాళ్ల జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఉండటం.. ఎంత పెద్ద కష్టం వచ్చినా కలిసి ఉండాలే కానీ దూరం అయిపోకూడదు.. భయం వేస్తుందిరా.. ఈ మధ్య మన ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే మీ నాన్నకి ఏమవుతుందా అని భయంగా ఉందిరా.. అమూల్య అలా చేయడం నుంచి ఇంకా మీ నాన్న కోలుకోలేకపోతుంటే ఇందాక వనజ డబ్బు కోసం చేసిన అవమానం నుంచి మీ నాన్న కోలుకోలేకపోతున్నారురా అని అంటుంది. రేపు బ్యాంక్ నుంచి తీసుకొచ్చి ఇస్తా అని సాగర్ చెప్పాడని అంటుంది. అవన్నీ వదిలేయండిరా మీ ముగ్గురు నాకు ఒక మాట ఇవ్వండి అని వేదవతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























