Illu Illalu Pillalu Serial Today February 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: మిస్సిడ్ ఫీలింగ్స్.. ప్రేమజంట ఒకటవుతుందా! సాగర్‌కి బ్యాడ్ టైం మొదలైందా!
Illu Illalu Pillalu Serial Today Episode February 17th అమూల్యని విశ్వక్ పని మనిషి అని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం రివర్స్‌లో అమూల్య విశ్వక్‌కి పరుగులు పెట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరకంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode | ధీరజ్ ప్రేమకి అద్భుతంగా ప్రపోజ్ చేస్తాడు. ప్రేమ ధీరజ్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. ధీరజ్ సంతోషంలో భార్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేసి చాలా హ్యాపీగా ఉంటాడు. తీరా చూస్తే ఇదంతా ధీరజ్ కల. ప్రేమ పిలిచి ఏంట్రా ఏదో చెప్తా అని చెప్పలేదు అంటుంది. ఏంటి ఇప్పటి వరకు ఏం చెప్పలేదా.. ఇదంతా నా కలా అని ధీరజ్ అనుకొని ఇప్పుడు చెప్పాలి అనుకుంటాడు. కొన్ని మాటలు చెప్పడానికి చాలా తేలికగా ఉంటాయి.. కానీ చెప్పలేం.. కానీ ఇప్పుడు చెప్పేస్తున్నా అని గులాబి తీసి ప్రేమ ముందుకు వస్తాడు.
ప్రేమకి గులాబి ఇచ్చి ఐలవ్‌యూ అని చెప్పే టైంకి అమూల్య పేరుతో ఉన్న చిన్న పాప అక్కడికి వస్తుంది. ఆ పేరు వినగానే ధీరజ్‌కి చెల్లి గుర్తొచ్చి.. జాగ్రత్తమ్మ పడిపోతే చాలా దెబ్బతింటావ్ అని ఎమోషనల్‌గా చెప్తాడు. అమూల్య తల్లితో ఎప్పుడూ చేయి పట్టుకొనే ఉండండి.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే చేయి జారిపోతూనే ఉంటారు.. అని అంటాడు. ఇక పాపని అమూల్య అని పిలిచి గులాబి ఇస్తాడు. పాప థ్యాంక్స్ అన్నయ్యా అని ధీరజ్‌ని హగ్ చేసుకుంటుంది. ఇక ధీరజ్ ప్రపోజ్ చేయకుండా బాధగా వెళ్లిపోయి కన్నీరు పెట్టుకుంటాడు. అమూల్య తన జీవితం నరకంలోకి నెట్టేసింది.. మరి నాకు బాధ లేకుండా ఎలా ఉంటుంది. అయినా నా చెల్లి వాడిని పెళ్లి చేసుకోదు.. ఎవరో తనని పెళ్లి చేసుకోమని చెప్పుంటారు.. వాళ్లు ఎవరో తెలియాలి అని ఆవేశపడతాడు. దాంతో ప్రేమ చాలా కంగారు పడుతుంది. ప్రేమ మనసులో కాసేపటి క్రితం నీ మనసులో ప్రేమ నాకు చెప్పాలి అనుకున్నావ్.. కానీ ఇప్పుడు నన్ను ఎక్కడ వదిలేస్తావో,, అని బాధ అనుభవిస్తున్నాను.. ఒక వైపు కోపం ఒక వైపు ప్రేమ రెండూ నీ గుండెలోనే.. నువ్వే నవ్విస్తున్నావ్,, నువ్వే ఏడిపిస్తున్నావ్,, అంతులోని ప్రేమ ఇస్తూ అంతలోనే తీరని బాధ ఇస్తున్నావ్.. నా జీవితం ఏం అవుతుందో తెలియని ఆయోమయంలో పడేశావ్ కదరా అని అనుకుంటుంది.
సాగర్ మొదటి రోజు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి.. రోడ్డు మీద కొలతలు చూసుకుంటూ ఉంటాడు. లంచం తీసుకొని సాగర్‌కి ఉద్యోగం ఇప్పించిన బ్రోకర్ సాగర్‌తో వచ్చి మాట్లాడతాడు. ఇక అటుగా భాగ్యం, శ్రీవల్లి నడుచుకుంటూ వస్తూ సాగర్ ఉద్యోగం గురించి తేల్చాలి.. నర్మద జుట్టు చేతికి దొరికితే దాని సంగతి చెప్తా అని అనుకుంటూ ఉంటారు. ఇద్దరూ సాగర్‌తో బ్రోకర్‌తో మాట్లాడటం చూసి అతన్ని బతిమాలుతున్నాడేంటి.. సాగర్ దగ్గర ఆయన బలవంతంగా డబ్బు తీసుకోవడం చూసి వీడు ఎవడో మనకు బాగా పనికొస్తాడని అనుకొని ఫోటో తీసుకుంటుంది భాగ్యం. మరోవైపు ప్రేమ పరీక్ష రాస్తుంది.. ధీరజ్ బయట నిల్చొని.. ప్రేమ పరీక్ష అదరగొడుతుందని అనుకుంటాడు. కానీ ప్రేమ ఏం రాకుండా ఆలోచిస్తూ టెన్షన్ అయిపోతుంది. పరీక్ష సరిగా రాయలేదు అనుకుంటూ బయటకు వస్తుంది. ఇంతలో ప్రేమతో మరోవ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ధీరజ్ చూసి ఏరా తనని వాళ్ల ఊరిలో దింపుతావా.. ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాడివి నీకు తన డిటైల్స్ ఎందుకు నాన్న.. అని క్లాస్ పీకుతాడు. ఎవరండీ ఈయన ఇంత తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అని ఆయన అడిగితే నా మొగుడు అని ప్రేమ అంటుంది. బాబు నీకు ఓ దండం, చెల్లీ నీకు ఓ దండం అని వెళ్లిపోతాడు.
అమూల్య అత్తారింట్లో తింటూ ఉంటుంది. విశ్వక్ చూసి ఇది ఈ ఇంట్లో పని మనిషిగా ఉండాలి అనుకుంటూ దర్జాగా ఉందని అనుకుంటాడు. భద్రావతి, సేనాపతి వచ్చి రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్దాం పదరా అని విశ్వక్‌ని అంటే టీ తాగి వెళ్దాం అని అంటాడు. ఉండు అత్త ఈ పని మనిషితో టీ పెట్టించుకుందా అని అమూల్యని పిలిచి టీ పెట్టమని అంటాడు. అమూల్య ఏం అనకుండా సైలెంట్‌గా వెళ్లి టీ చేస్తుంది. విశ్వక్ టీలో ఏదో కలిపి నీకు ఉందిరా.. బండ సచ్చినోడా అని అనుకుంటుంది. వచ్చేసింది మన ఇంటి పనిమనిషి రామరాజు కూతురు అని అంటాడు. అమూల్య వెళ్లి భద్రావతికి పెద్దమ్మా, మామయ్య అని టీ ఇస్తుంది. తర్వాత విశ్వక్‌కి స్పెషల్ టీ అని ఇస్తుంది. విశ్వక్ తాగి ఇది టీనా నీ ముఖంలా ఉందని అంటాడు. బాగుంది కదరా.. అని భద్రావతి అంటుంది. అవును పెద్దమ్మా మా అమ్మ నేర్పింది.. మీకు అమ్మ పెట్టే టీ అంటే ఇష్టం అంట కదా అని అంటుంది. ఇక భద్రావతి వాళ్లు వెళ్తూ ఉంటారు. ఇంతలో విశ్వక్ బాత్‌రూంకి పరుగులు పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























