అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today February 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ-ధీరజ్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్.. అదిరిపోయిన ప్రపోజ్‌! గుండెల్ని మెలిపెట్టే ట్విస్ట్!

Illu Illalu Pillalu Serial Today Episode February 16th రైస్‌మిల్లుకి చందుతో పాటు భాగ్యం తన భర్తని పంపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ మొదటి రోజు ఆఫీస్‌కి వెళ్తే మీరు మాకు చెప్పకుండా వెళ్లావని బాధే కానీ నీ మీద ఏం ద్వేషం లేదురా అని కొడుకుని ఆశీర్వదించి పంపిస్తుంది. తర్వాత వేదవతి ప్రేమ, ధీరజ్‌లను వెళ్లమని అంటుంది. వాళ్లు ఎక్కడికి అన్నట్లు రామరాజు చూస్తే అదే అండీ.. చిన్నోడు కారు పని మీద విజయవాడ వెళ్తున్నాడు అని చెప్పా కదండీ నిన్న.. అందుకే ప్రేమని పంపిస్తున్నాను.. భర్తతో కలిసి వెళ్తే తను సంతోషంగా ఉంటుంది కదా అంటుంది. రామరాజు సరే అంటాడు. 

ప్రేమ మామయ్య కాళ్లకు దండం పెట్టి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకమ్మా అని అంటే మీరు పంపించరు అనుకుంది ఇప్పుడు వెళ్లమని అనే సరికి సంతోషంతో ఇలా అందని ధీరజ్ అంటాడు. ధీరజ్, ప్రేమలు వెళ్లడం చూసి ప్రేమ, భాగ్యం వాళ్లు వీళ్లు కూడా ఏదో గూడుపుటానీ చేస్తున్నారని అనిపిస్తుందని అనుకుంటారు. ఇక చందు రైస్ మిల్లుకి వెళ్తానని తండ్రికి చెప్తాడు. రామరాజు పెద్ద కొడుకుతో పిల్లలు అంటే తండ్రి ఆస్తికి వారసులు కాదురా.. కన్నవాళ్ల నమ్మకానికి వారసులు.. అలా ఈ నాన్న నమ్మకం నిలబెట్టడంలో నువ్వే నిజమైన వారసుడివిరా.. పెద్దోడా రైస్మిల్లు అంటే అందరిలా మనకు వ్యాపారం కాదురా,, మన అమ్మ.. అమ్మలాంటి రైస్‌మిల్లుని జాగ్రత్తగా చూసుకోరా అని అంటాడు. 

రామరాజు వేదవతికి తాళాలు తీసుకొచ్చి ఇవ్వమని అంటే భాగ్యం కలుగ జేసుకొని అమ్మడు నువ్వు ఇవ్వవే మీ అత్త మామయ్యకి ఇచ్చేది ఇప్పుడు నువ్వు వారసత్వంగా మీ ఆయనకు ఇవ్వవే అంటుంది. వల్లీ ఆ తాళాలు తీసుకొని వీటితో పాటు ఇంటి తాళాలు కూడా కావాలి అనుకుంటుంది. వల్లీ తాళాలు ఇవ్వడం చూసి వేదవతి కన్నీరు పెట్టుకుంటుంది. భాగ్యం తన భర్తని కూడా మిల్లుకి వెళ్లమని అంటుంది. నర్మద వద్దు అని అంటే బాధ్యతలు తీసుకోకుండా మధ్యలో వదిలేసినవాళ్లు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి ఏం ఇవ్వాలో నాకు తెలుసు అంటాడు.

ప్రేమ, ధీరజ్‌లు కారులో వెళ్తూ ఉంటారు. ధీరజ్ ప్రేమని లవ్ చేస్తున్న విషయం చెప్పాలి అనుకుంటాడు కానీ నేను నిన్ను.. అంటూ చెప్పలేకపోతాడు. ఏంట్రా చెప్పరా అంటే నేను నిన్ను పోలీస్ ఆఫీసర్‌ని చేయాలి అనుకుంటున్నా అంటాడు. దానికి ప్రేమ ఇది చెప్పడానికేనా అలా చూస్తున్నావ్ అని అంటుంది. ప్రేమిస్తున్నా అని చెప్పలేకపోతున్నా ఏంటి.. అయినా మనం ఆయుధంతో వెళ్లాం కదా.. ఆ ఆయుధం ఇక బయటకు తీద్దాం అని అనుకొని కారులో ప్రేమ పాటలు పెడతాడు. ఇవేం పాటలురా అని ప్రేమ అంటే నేను పాడుతున్నా అంటే నా మనసులోకి తొంగి చూడాలి అని అంటాడు. ఈ పాటలు ఏంట్రా అన్నీ ఒకేలా ఉన్నాయ్ అని అడిగితే నా మనసులో మాటలు అన్నీ అర్థమయ్యేలా పెట్టానని అంటాడు. 

ధీరజ్ ప్రేమతో నీకు ఒక సర్‌ఫ్రైజ్ ఉందని అంటాడు. ఏంట్రా అని ప్రేమ అడుగుతుంది. ప్రేమ ఎరుపు రంగు చీర కట్టుకొని అందంగా రెడీ అవుతుంది. ధీరజ్ కూడా రెడీ అవుతాడు. సడెన్‌గా రెడీ అవ్వమని ఎందుకు చెప్పావురా.. ఎక్కడికి తీసుకెళ్తున్నావ్‌రా అని ప్రేమ అడుగుతుంది. ధీరజ్ సర్‌ఫ్రైజ్ అని చెప్పకుండా తీసుకెళ్తాడు. ప్రేమ కళ్లు మూసి తీసుకెళ్తాడు. ఓ గది నిండా హర్ట్ బెలూన్స్ డెకరేట్ చేసి ఉండటం చూసి ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ధీరజ్ మనసులో ప్రేమ ఒకప్పుడు ఈ లోకంలో నాకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే.. ఇప్పుడు నా జీవితంలో నుంచి విడదీయని వాళ్లు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే.. చావు బతుకుల మధ్య  ఉన్న నాన్న టైంలో నువ్వు నాకు ఇచ్చిన ఓదార్పు నాకు నేను కోలుకోవడమే కాదు చాలా మనోధైర్యం ఉంది.. మన మనసులో బాధ పంచుకునే వాళ్లు లేకపోతే జీవితం నరకంగా ఉంటుంది.. నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రేమ అనుకుంటాడు. 

ప్రేమని ధీరజ్ పట్టుకొని నిన్ను ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నా.. నా మనసులో మాట నీకు చెప్పాలి అనుకుంటున్నా.. నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాలి అనుకున్నా.. కానీ నీకు చెప్పడానికి అస్సలు లేటు చేయను.. ప్రేమ నువ్వు నడిచే దారిలో నేను నీ నీడ అవుతా.. ప్రతీ క్షణం నిన్ను చూసుకొనే దారిని అవుతా.. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నా నా ప్రాణం పోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. ఐలవ్‌యూ ప్రేమ గులాబి ఇచ్చి మోకాలి మీద కూర్చొని ప్రపోజ్ చేస్తాడు. ప్రేమ సంతోషంగా గులాబీ తీసుకొని ధీరజ్ నుదిటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ధీరజ్ ప్రేమని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
Embed widget