అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today February 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రొమాన్స్‌లో ప్రేమ, ధీరజ్.. అడ్డొచ్చేసిన నర్మద! వేదవతి కన్నీళ్లు.. చివరకు ఏమైందంటే!

Illu Illalu Pillalu Serial Today Episode February 13th వేదవతి కోపాన్ని తగ్గించడానికి నర్మద, ప్రేమ ప్రయత్నించడం సాగర్ ప్రేమ పరీక్ష గురించి తల్లికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద మామయ్య అన్న మాటలు  గుర్తు చేసుకొని బాధ పడుతుంది. ఇంతలో సాగర్ వచ్చి మనసులో బాధ దించేయడంతో చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఉంటాడు. సాగర్ సంతోషంగా మాట్లాడుతూ ఉంటే నీకేం బాధ అనిపించడం లేదా.. నీ మీద కోపంతో మామయ్య ఆ రైస్ మిల్లుని ఆ వల్లీ వాళ్లకి ఇచ్చారు అని అంటుంది. అన్నయ్య చాలా బాగా చూసుకుంటాడు అని సాగర్ అంటాడు. ఆ వల్లీ తన ఫ్యామిలీ ఆ మిల్లుని ఏం చేస్తారో కూడా తెలీదు.. ఈ విషయం వల్ల నువ్వు మీ నాన్నకి దూరం అయిపోతున్నావ్.. అది నీకు అర్థం కావడం లేదా అని అంటుంది.

సాగర్ కోపంగా మా నాన్న కోసం నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను కదా.. ఒక కొడుకుగా ఇన్ని రోజులు మా నాన్న కోసం బతికాను.. ఇప్పుడు మన కోసం బతుకుతున్నా.. నాకు మా నాన్నే కాదు నా భార్య కూడా అర్థం చేసుకోవడం లేదు అనే విరక్తి నాకు ఇవ్వకు ప్లీజ్ అంటాడు. వేదవతి కోపంగా గిన్నెలు అన్నీ విసిరేస్తూ ఉంటుంది. నర్మద వెళ్లి అత్తయ్యా అని మాట్లాడుతూ ఉంటే నాతో మాట్లాడకు నన్ను అత్తయ్యా అనకు అని అరిచి నర్మదని పంపేస్తుంది. అత్తయ్యని కూల్ చేయాలి అంటే ప్రేమని కూడా తీసుకురావాలి అని నర్మద అనుకుంటుంది. 

ప్రేమ ధీరజ్‌తో పరీక్ష రాయను అని చెప్తుంది. రేపు పరీక్ష పెట్టుకొని ఇప్పుడు ఇలా అంటావేంటే అని ధీరజ్ అడిగితే మీ అన్నయ్య విషయంలో ఏం అయిందో చూశావు కదా.. అత్తయ్యా మామయ్య అక్క, బావలతో మాట్లాడటం లేదు.. రేపు మనతో కూడా మాట్లాడకుండా మానేస్తారు అని అంటుంది. ధీరజ్ మాత్రం వద్దంటే వద్దు అంటాడు. ప్రేమ పరీక్ష వద్దూ అని చెప్తూనే ఉంటే ధీరజ్ ప్రేమని పట్టుకొని గిరగిరా తిప్పి ప్రేమగా దగ్గరకు తీసుకొని పట్టుకుంటాడు. వదిలేయనా అని అడుగుతాడు. ప్రేమ వవద్దని వద్దని అంటుంది. ఇప్పుడే వదిలేయ్ అన్నావ్.. ఇంతలోనే వద్దు అంటున్నావ్ అంటాడు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్ రా అని ప్రేమ మాట్లాడుతుంటే ధీరజ్ ప్రేమ పెదవుల మీద చేయి వేసి ముద్దు పెట్టే అంత దగ్గరకు వెళ్తాడు. ఇంతలో నర్మద ప్రేమ అంటూ వస్తుంది. ఇద్దరూ సిగ్గు అయిపోతారు. వస్తున్నా నాన్న అని ధీరజ్ కంగారుగా వెళ్తే నిన్ను ఎవరూ పిలవడం లేదులే ధీరజ్ అని నర్మద సెటైర్ వేస్తుంది. ప్రేమ సిగ్గు అయిపోతే నర్మద నవ్వుతుంది.

నర్మద ప్రేమతో చెడగొట్టేశానా అని అంటుంది. హా మొత్తం చెడగొట్టేశావ్.. ఏదో అమావాస్యలో చంద్రుడిలా వాడిలో రొమాన్స్ బయటకు తీశావ్.. నువ్వు మొత్తం పోగొట్టేశావ్ అంటుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. విషయం ఏంటి అక్క అంటే అత్తయ్యా అని నర్మద అనడంతో అలిగారా అని ఇద్దరూ వెళ్తారు. కిచెన్‌లో వల్లీ వంట చేస్తూ నర్మద తనని కొట్టడంతో ప్రతీ విషయంలో నన్నే నర్మద కొడుతుంది. నా మొగుడి కంటే ఈ నర్మదే ఎక్కువ ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వేదవతి కస్సుబుస్సులాడుతూ ఉంటుంది. ఎవరి గురించి అత్తయ్యా అని వల్లీ అడిగితే  తెలివైన కోడలు అని నెత్తిన పెట్టుకుంటే కాలితో తన్నేసినట్లే చేసింది కదా ఆ గవర్నమెంట్ కోడలు అని అంటుంది. అంటే మీ జీవితంలో కూడా మామయ్య గారి కంటే ఆ నర్మదే ఎక్కువ ఉంది అన్నమాట అంటుంది శ్రీవల్లి. దానికి వేదవతి నువ్వో తింగరి మాలోకానికి సంబంధం లేకుండా మాట్లాడుతావ్ అంటుంది. 

నర్మద, ప్రేమలు కిచెన్‌లోకి వచ్చి వంట చేసి చేసి అలిసిపోయావ్ కదా వల్లీ అక్కాయ్ ఇక నువ్వు వెళ్లు మేం పనులు చేస్తాం అంటారు. నేను వెళ్లను అని వల్లీ అంటే ఇద్దరూ కోపంగా చూస్తే వల్లీ వెళ్లిపోతా అంటుంది. వెళ్లినట్లే వెళ్లి దొంగచాటుగా చూస్తుంది. ప్రేమ చూసి వెళ్లమని చాకు తీస్తుంది. దాంతో వల్లీ పారిపోతుంది. ప్రేమ అత్తయ్యా గారు చాలా కోపంగా ఉన్నారు అని అంటుంది. దానికి ప్రేమ కోపం లేకుండా ఎలా ఉంటారు అక్క,, నువ్వు మీ ఆయన చేసింది ఏమైనా సన్మానం చేయాల్సిన పనా.. అత్తయ్యా గారు కాబట్టి ఏదో కోపం దగ్గర ఆగిపోయారు. అదే అత్త స్థానంలో నేను ఉంటే నీ కాళ్లు విరిచి పొయ్యిలో పెట్టేసేదాన్ని అని అంటుంది. కోపం కన్న కొడుకు మీద చూపించకుండా కోడలి మీద చూపించడం ఏంటి.. కోడలు బయట నుంచి వచ్చింది అని అంత లోకువ అయిపోయిందన్నమాట.. అని అంటుంది. వేదవతి కోపంగా ఏంటే ఏం అంటున్నావే నేను కోడల్ని పరాయివాళ్లగా చూశానా.. కన్న కూతుళ్లా చూసుకున్నా కానీ ఏ రోజు అయినా వేధించానా అని ఏడుస్తుంది. అయినా కన్నకూతుళ్లే కడుపు కోత పెడుతుంటే.. ఇక కోడళ్లు కొడుకులు పెట్టకుండా ఉంటారా అని పెద్దగా ఏడుస్తుంది. 

ధీరజ్ కూడా తల్లి దగ్గరకు వస్తాడు. అందరూ ఆయన గుండెలమీద తన్నేవాళ్లే .. ఆయన ప్రాణాలతో ఆడుకునేవాళ్లే.. ఎవరి జీవితం వాళ్లది అయిపోయింది.. ఎవరి స్వార్థం వాళ్లది అయిపోయింది. ఇన్నాళ్లు పెంచిన తండ్రికి విలువ లేకుండా అయిపోయింది అని అంటుంది. దానికి ధీరజ్ అమ్మ జాబ్ చేయడం వాడి కల వదిలేయ్ అమ్మా అంటాడు. నర్మద అత్తతో మీ కొడుకు జాబ్ చేయడం మీకు నిజంగా ఇష్టం లేదా.. మీ అబ్బాయి ఆఫీసర్‌గా రెడీ అయి అందరిలో గౌరవంగా తిరగడం మీకు ఇష్టం లేదా,, లేదు అంటే చెప్పండి ఇప్పుడే ఈ క్షణమే సాగర్ని ఆపేస్తా అంటుంది. కొడుకు దొరబాబులా ఉండటం ఏ కొడుకుకి ఇష్టం ఉండదు చెప్పండి అని వేదవతి ఏడుస్తుంది. పిల్లలు ఆయన చేయి దాటి పోతున్నారు అని ఆయన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. మా ఆయన తర్వాత పిల్లలు అయినా.. మీ అందరూ నా దగ్గర అన్నీ దాచేస్తారు.. కానీ నా చిన్నకొడుకే నాకు అన్నీ చెప్తాడు.. నమ్మకానికి మారుపేరు నా చిన్న కొడుకు అని అంటుంది. నేను నీ దగ్గర ఒక విషయం దాచాను అమ్మా అని ప్రేమ ఎస్‌ఐ విషయం గురించి చెప్తాడు. ప్రేమని వేదవతి  కోపంగా చూస్తే అమ్మా నాకేం తెలీదు.. నేను వద్దు అని చెప్పేశా., కానీ పరీక్ష రాయమని మీ అబ్బాయి చెప్తున్నాడు అని అంటుంది.

ధీరజ్ తల్లితో పోలీస్ అవ్వాలి అని ప్రేమ కల అమ్మా,, వాళ్ల ఇంట్లో ఉంటే వాళ్ల నాన్న వద్దు అనేవాడా.. నువ్వే ఆలోచించు అమ్మా అని అంటాడు. నువ్వు సెంటిమెంట్‌తో మాట్లాడితే ఏం చేయాలిరా.. నడిపోడు ఆ విధంగా షాక్ ఇస్తే నువ్వు ఇలా షాక్ ఇచ్చావ్ అని అంటుంది. ఏదో ఒకటి చేయి మీకు పంపిస్తా కానీ మీ నాన్నకి చెప్పకండి అని అంటుంది. మా మంచి అమ్మ మా మంచి అత్త అని అందరూ వేదవతిని హగ్ చేసుకుంటారు. దానికి వేదవతి చేయాల్సినవన్నీ చేసి మా మంచి అమ్మ.. మా మంచి అత్త అంట ఏమిటో అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 13th: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
Gunde Ninda Gudi Gantalu March 13th Episode: రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్
రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్
Telugu TV Movies Today: మార్చి 13, శుక్రవారం... తెలుగు టీవీ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే
మార్చి 13, శుక్రవారం... తెలుగు టీవీ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే
Lakshimi Raave Maa Intiki Serial Today March 12th: యాక్సిడెంట్ కేసులో మ్యాడీకి దొరికిన కీలక ఆధారాలేంటి..? మ్యాడీపై దాడి చేసి కిడ్నాప్ చేసిందెవరు...?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: యాక్సిడెంట్ కేసులో మ్యాడీకి దొరికిన కీలక ఆధారాలేంటి..? మ్యాడీపై దాడి చేసి కిడ్నాప్ చేసిందెవరు...?
Advertisement

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Embed widget