అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today February 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇంట్లో వాళ్లకి షాక్ ఇచ్చిన సాగర్! రైస్‌మిల్లు బాధ్యతలు దక్కించుకున్న వల్లీ! భాగ్యం కుట్రలు!

Illu Illalu Pillalu Serial Today Episode February 12th సాగర్‌కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని తెలియడం, రైస్ మిల్లు బాధ్యతలు వల్లీకి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు వల్లీ వాళ్లని బెదిరించడంతో అసలు అమూల్యకి పెళ్లే అవ్వలేదు  అంట కదా.. అని అంటారు. మీకు ఎవరు చెప్పారు అని ప్రేమ అడిగితే విశ్వకే చెప్పాడు. అమూల్య మెడలో తాళి కట్టలేదు అంట అని మొత్తం చెప్పేస్తారు. మరి మమల్ని ఎందుకు ఎవరు ఏమంటారు అని వల్లీ అడుగుతుంది. దానికి నర్మద అవునా అయితే అమూల్యని విశ్వక్‌కి లవ్ చేయమని చెప్పింది నువ్వు కాదా.. పెళ్లి ముందు రోజు ఇంట్లో నుంచి తీసుకెళ్లింది నువ్వు కాదా ఇది సరిపోవా అని అంటుంది. ఇక్కడ ముఖ్యం ఏంటో తెలుసా.. అమూల్య విశ్వక్‌ని పెళ్లి చేసుకుందా లేదా కాదా.. అమూల్య ప్రేమించడానికి కారణం ఎవరు మీరు.. అమూల్య బయటకు వెళ్లడానికి కారణం ఎవరు మీరు.. అని అంటుంది.

ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటే ఏం కాదు.. నీ వరకు వస్తే అప్పుడు చూసుకుందాం అని నర్మద ధైర్యం చెప్తుంది. తర్వాత రామరాజు, వేదవతిలు ఓ నిర్ణయం తీసుకొని పిల్లలు అందర్ని పిలుస్తారు. రామరాజు సాగర్ని పిలిచి నేను మానసికంగా చాలా కృంగిపోయాను..  అమూల్య బాధ నుంచి నేను బయట పడలేకపోతున్నాను.. ఈ పరిస్థితుల్లో నేను రైసుమిల్లుకి వెళ్లి చూసుకోలేను.. ఇక నుంచి రైసు మిల్లుని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని తాళాలు ఇస్తాడు. అందరూ తాళాలు తీసుకోమని చెప్తారు కానీ సాగర్ తీసుకోడు.. రామరాజుతో సారీ నాన్న నేను రైసుమిల్లు చూసుకోను అని అంటాడు. రామరాజు షాక్ అయిపోతాడు. ఇక ఎప్పటికీ చూసుకోను.. ఇక నుంచి రైసుమిల్లుకు వెళ్లను అని అంటాడు. అలా అంటావేంట్రా అని వేదవతి అడుగుతుంది. ఎందుకు వెళ్లను అంటున్నవ్ సమాధానం చెప్పరా అని రామరాజు అడుగుతాడు. దాంతో సాగర్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాన్న అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. 

అందరూ సాగర్‌ని ప్రశ్నిస్తారు. ఎప్పుడు పరీక్ష రాశావ్.. అని అడుగుతారు. నిన్నే తెలిసిందని అంటాడు. పరీక్ష రాసినప్పుడు ఈ నాన్నకి చెప్పాలి అని కానీ.. నాన్న ఏమంటారో అని చెప్పాలి కానీ లేదా గవర్నమెంట్ జాబ్ వద్దని నీకు చెప్పా కదా  అంటాడు రామరాజు. చెప్పా కదా నాన్న నాకు గవర్నమెంట్ జాబు కావాలి అని సాగర్ అంటాడు. మీ మామ గుడిలో పూజలు చేసి అందరికీ స్వీట్స్ పంచుతుంటే అప్పుడు అర్థం కాలేదు.. కానీ ఇప్పుడు అర్థమైందిరా.. నువ్వు నీ భార్య మీ మామ కలిసి చాప కింద నీరులా చాలా తెలివిగా ప్రవర్తించారు అని అంటాడు. నర్మద మామయ్యతో నాకు కూడా విషయం నిన్నే తెలిసింది మామయ్య అని అంటే ఆపమ్మా నువ్వే వాడితో పరీక్ష రాయించావ్ నీకు తెలీదు అంటే నమ్మేయడానికి అంత పిచ్చోళ్లా కనిపిస్తున్నామా అని అడుగుతుంది. నర్మదకు ఏం తెలీదు అని సాగర్ అంటే వేదవతి లాగి పెట్టి కొట్టి.. సొంత మిల్లుని దొరలాగా దర్జాగా చూసుకోవడాన్ని నీకు మూటలు మూయడంలా అనిపిస్తుందా.. మనం తినే ప్రతీ మెతుకు దాని వల్లే వచ్చిందిరా.. నీ లాగే మీ నాన్న కూడా దాన్ని మూటలు మోయడం అనుకుంటే ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్లం కాదు అని అంటుంది. వదిలేయ్ బుజ్జమ్మా వాడికి ఇళ్లరికం వెళ్లాలి అని ఉందని అందుకే ఇలా చేశాడు అంటాడు. 

రామరాజు కోపంగా తిరుపతి రైస్ మిల్లు అమ్మేస్తా ఎవరైనా ఉంటారేమో చూడు అని అంటాడు. అందరూ వద్దని అంటారు. వీడికి నామోషీలా ఉంది రేపు నేను పోయిన తర్వాత ఎలాగూ అమ్మేస్తారు కదా అంటుంది. ప్రేమ ధీరజ్‌తో నువ్వు తీసుకుంటా అని చెప్పరా అంటుంది. ఇంతలో చందు వచ్చి నేను చూసుకుంటా ఉద్యోగం మానేస్తా అంటాడు. వద్దులే నీ భార్య కూడా నువ్వు మూటలు మోస్తావని అనుకుంటుంది అని రామరాజు అంటాడు. ఇంతలో వల్లీ వచ్చి అయ్యో అలా ఎందుకు అనుకుంటా మామయ్యగారు అవసరం అయితే నేను అక్కడ మూటలు మోస్తా ఏం పర్లేదు మా ఆయనకు బాధ్యతలు ఇచ్చేయండి అని అంటుంది. దాంతో రామరాజు చూశావా బుజ్జమ్మ బాధ్యత తెలిసిన కోడళ్లు అని వాళ్లని అంటావ్.. కానీ వాళ్ల స్వార్థం వాళ్లు ఎలా చూసుకున్నారో చూశావా.. అంటాడు. ఎవరో ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని వేదవతి నర్మదకి అంటుంది. 

వల్లీ కొంగు చాచి అత్తయ్య గారు ఇక నుంచి నేను నా భర్త రైసు మిల్లు చూసుకుంటాం. తాళాలు ఇవ్వండి అత్తయ్య గారు అని అంటుంది. వేదవతి వల్లీకి తాళాలు ఇచ్చేస్తుంది. తాళాలు తీసుకున్న వల్లీ తల్లిదండ్రులతో కలిసి డ్యాన్స్‌లు వేస్తుంది. భాగ్యం తాళాలు పట్టుకొని మనం ఏం చేయకుండా మనకి తాళాలు వచ్చేశాయి.. లక్షలు లక్షలు లావాదేవీలు జరిగే రైసుమిల్లు తాళాలు మనకి వచ్చేశాయి.. ఇక ఈ దెబ్బతో మన తలరాతలు మారిపోవాలి అంటుంది. రామరాజు మానసికంగా పోయాడు కాబట్టి ఇక ఎప్పటికీ రైసుమిల్లుకి రాలేడు.. నీ మొగుడు అయితే అమాయకుడు. కాబట్టి మీ నాన్నని రైస్‌మిల్లులో క్యాష్‌యర్‌గా పెట్టి డబ్బు కొట్టేయాలి.. రైస్మిల్లు కూడా కొట్టేయాలి అనుకుంటారు. ముగ్గురు సంతోషంగా డ్యాన్స్‌లు వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gunde Ninda Gudi Gantalu March 6th Episode: బాలు అరెస్ట్ , షాక్ లో మీనా! మరో స్కామ్ లో మనోజ్- గుండెనిండా గుడిగంటలు మార్చి 06 ఎపిసోడ్
బాలు అరెస్ట్ , షాక్ లో మీనా! మరో స్కామ్ లో మనోజ్- గుండెనిండా గుడిగంటలు మార్చి 06 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today March 6th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ వర్సస్ గణ! పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా! మంజులకు తగిలించిన గణ!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ వర్సస్ గణ! పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా! మంజులకు తగిలించిన గణ!
Podharillu Serial Today Episode March 6th: అర్థరాత్రి మహా గదిలోకి చక్రి ఎందుకు వెళ్లాడు...? చక్రి చెప్పిన అబద్ధాలన్నీ మహాకు తెలిసిపోయాయా...?
పొదరిల్లు సీరియల్: అర్థరాత్రి మహా గదిలోకి చక్రి ఎందుకు వెళ్లాడు ? చక్రి అబద్ధాలన్నీ మహాకు తెలిసిపోయాయా...?
chinni serial today march 6th: చిన్ని సీరియల్: మ్యాడీని ఆటపట్టించిన చిన్ని! భర్త ఆఫీస్‌కి వెళ్తుందా!
చిన్ని సీరియల్: మ్యాడీని ఆటపట్టించిన చిన్ని! భర్త ఆఫీస్‌కి వెళ్తుందా!
Advertisement

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒక్క చార్జ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణం - రూ.15 లక్షల లోపే బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్‌ కార్లు
పెట్రోల్‌ కోసం రూపాయి కూడా ఖర్చు కాదు - రూ.15 లక్షల లోపే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లు
Embed widget