Illu Illalu Pillalu Serial Today February 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యం, శ్రీవల్లికి తెలిసిన అసలు నిజం! అమూల్య వెనక ప్రేమ ఉందని తెలిసిపోతుందా!
Illu Illalu Pillalu Serial Today Episode February 11th అమూల్యని తాను పెళ్లి చేసుకోలేదని విశ్వక్ శ్రీవల్లి వాళ్లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ, ధీరజ్‌లు గుడి మెట్ల మీద కూర్చని కొబ్బరి చిప్ప తింటారు. ప్రేమ ధీరజ్‌తో ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్ష రాయనురా అంటుంది. ఈ విషయం గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం.. ఇక ఆ విషయం వదిలేయ్ అంటాడు. ఇక ప్రేమ కొబ్బరి చిప్ప పగలగొడుతుంది. చేతికి గాయం అవ్వడంతో ధీరజ్ కంగారు పడి తన చేతి రుమాలు తీసి తుడుస్తాడు.
ప్రేమ ధీరజ్‌ని అలా చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఎప్పుడూ లేనిది నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నావ్ అని అడుగుతుంది. ఎప్పుడూ లేనిది ఏంటి.. ఎప్పుడూ ఉంటుంది.. అయినా నీకు అన్నీ నేనే కదా మరి నీ మీద కేరింగ్ లేకుండా ఎలా ఉంటుంది. నీకు ఏమైనా అయితే బాధ లేకుండా ఎలా ఉంటుంది అని ధీరజ్ అంటాడు. ప్రేమ అమూల్యకి తను మెడలో తాళి వేసుకోమనడం గుర్తు చేసుకొని.. లైఫ్ లాంగ్ ఇలాగే నా మీద కేరింగ్ చూపిస్తావా.. ఎప్పుడూ ఇలాగే చూసుకుంటావా.. నా చేయి ఎప్పటికీ వదలవు కదా.. అంటుంది. దానికి ధీరజ్ ఎప్పటికీ వదలను.. చనిపోయే చివరి వరకు చేయి వదలను అంటాడు. నా మీద ఎప్పుడైనా కోపం వస్తే అని అడుగుతుంది. దాంతో ధీరజ్ ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ కోపం డామినేట్ చేస్తుంది. మన మధ్య కోపం డామినేట్ చేసే ప్రసక్తే లేదు అంటాడు. మనసు ప్రశాంతంగా ఉంది అని ప్రేమ అంటుంది.
ధీరజ్ తన మనసులో ప్రేమని ప్రేమకి చెప్పాలి అనుకుంటాడు. విషయం చెప్పే టైంకి విశ్వ మోకాలి మీద నడవడం చూస్తారు. ధీరజ్ మనసులో వీళ్లు కూడా వచ్చారా అనుకుంటాడు. ప్రేమతో అమూల్యని నాన్న చూస్తే చాలా ఇబ్బంది పడతారు. వెంటనే నాన్నని తీసుకెళ్లిపోవాలి పద అంటాడు. ఇద్దరూ రామరాజు దగ్గరకు వెళ్తారు. రామరాజు దగ్గరకు వెళ్లిపోదాం అని చెప్పి తీసుకెళ్తాడు. ఇక శ్రీవల్లి పొర్లు దండాలు పెడుతూ రామరాజు వాళ్ల దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా వల్లీ పొర్లుదండాలు ఎందుకు మొక్కుకున్నావ్ అని వేదవతి అడుగుతుంది. చేసిన పాపాలకు భయపడి అని నర్మద అంటుంది. ఏమన్నావ్ అమ్మా అని రామరాజు అడిగితే మీరు ప్రాణాలతో బయట పడితే పొర్లు దండాలు పెడతాను అని మా అమ్మడు మొక్కుకుందని భాగ్యం అంటుంది. ఇంతలో ప్రసాద్ స్వీట్స్ పంచుతూ అక్కడికే వస్తాడు.
నర్మద ఆయనతో నాన్న మీరేంటి స్వీట్స్ పంచుతున్నారు అని అడుగుతుంది. అది సాగర్‌కి అని రామరాజుని చూసి ఆగిపోతాడు. ఏంటి విషయం అని సాగర్ గురించి స్వీట్స్ పంచుతున్నారు ఏంటి ఆ న్యూస్ అని అడుగుతారు పుల్లల బ్యాచ్. దాంతో ప్రసాద్‌రావు.. మా అమ్మాయి, అల్లుడు అన్యోన్యంగా ఉంటున్నారు.. ఎప్పటికీ అలాగే ఉండాలని ఇలా చేస్తున్నా అంటాడు. ఇప్పటి వరకు సాగర్‌ని మీరు అల్లుడిగా అంగీకరించలేదు.. మీ కూతురు అల్లుడిని ఇంటికి కూడా తీసుకెళ్లలేదు.. మరి ఎందుకో డౌట్ కొడుతుంది అని భాగ్యం అంటుంది. నర్మద కోపంగా చూసే సరికి అల్లుడిగా అంగీకరించనంత మాత్రాన.. కూతుర్ని ఇంటికి తీసుకెళ్లనంత మాత్రానా ప్రేమలు ఎక్కడికి పోతాయిలే అని కవర్ చేస్తుంది.
రామరాజు వెళ్తూ అమూల్యని చూస్తాడు. అమూల్య కూడా తండ్రిని చూసి దగ్గరకు వస్తుంది. వేదవతి కోపంగా ప్రశాంత కోసం గుడికి వస్తే ఇక్కడికీ వచ్చారు అని అంటుంది. రామరాజుని తీసుకెళ్లిపోతుంది. పొర్లు దండాలు పెట్టి పెట్టి శ్రీవల్లి నడుం పడిపోయిందని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో విశ్వక్ అమూల్య సైలెంట్ అనుకుంటే టార్చర్ పెట్టి చంపుతుందని అనుకుంటుంది. శ్రీవల్లి విశ్వక్‌ని చూసి ఇదంతా వీడి వల్లే అని పెద్ద రాయి పట్టుకొని వెళ్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడుతా అని పిలిచి ఆ పిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని వచ్చావ్‌రా బండ సచ్చినోడా అని తిడుతుంది. నీ వెనక ఉన్నది నేనే అని నర్మద, ప్రేమలకు తెలిసిపోయిందిరా.. నర్మద అయితే నన్ను పిచ్చకొట్టుకు కొట్టిందిరా.. నా కాపురానికి నిప్పులు పెట్టేశావ్‌రా., అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్‌రా అని తిడుతుంది. నేను అసలు అమూల్యని పెళ్లి చేసుకొని చావలేదు అని విశ్వక్ అంటాడు. అమూల్య మెడలో నేను తాళి కట్టలేదు.. తనే వేసుకుంది అని చెప్తాడు. శ్రీవల్లి వాళ్లు షాక్ అయిపోతారు.
అమూల్య తనంతట తను ఎందుకు తాళి వేసుకుందిరా.. అంటే అది అర్థం కాకే నాకు బుర్ర పోతుంది. అమూల్య తెలివిగా తాళి వేసుకొని వచ్చి నాకు టార్చర్ పెడుతుంది. అమూల్య వెనక ఎవరో ఉన్నారు.. వాళ్లని కనిపెట్టి అప్పుడు అమూల్య పని చెప్తా అంటాడు. భాగ్యం వాళ్లు ఆలోచించి దీని వెనక ఏదో స్కీమ్ స్కామ్ ఉంది ఈ తీగని మనం కదపాలి అని అంటుంది. విశ్వక్ వాలకం చూస్తుంటే వాడు ఎక్కడో ఇరుక్కున్నట్లే ఉన్నాడని అర్థమవుతుంది అని భాగ్యం అంటుంది. ప్రసాద్ రావు స్వీట్స్ ఎందుకు పంచాడో.. సాగర్ సంగతి ఏంటో,, అమూల్య విషయం ఏంటో తెలుసుకోవాలని భాగ్యం అంటుంది. అమ్మ అమూల్య విషయం ఆలోచించు కానీ నర్మద విషయం ఆలోచించకు అది చాలా డేంజర్ అని అంటుంది. ఏంటి బల్లి అక్కాయ్ అని నర్మద, ప్రేమలు వస్తారు. మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టిన నర్మద అక్క మీ సంగతి చెప్పే వరకే కదా.. తర్వాత మీరు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే కదా అంటుంది ప్రేమ. మేం ఎందుకు సర్దుకుంటాం..అసలు అమూల్యకి పెళ్లే అవ్వలేదు అంట కదా అని భాగ్యం అంటుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























