Illu Illalu Pillalu Serial Today February 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌కి చుక్కలు చూపిస్తున్న అమూల్య! ప్రేమని ధీరజ్ ప్రేమిస్తున్నాడా!
Illu Illalu Pillalu Today February 10th నర్మద, ప్రేమ ఇచ్చిన ధైర్యంతో అమూల్య విశ్వక్‌తో ఓ ఆట ఆడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ తన ఎస్‌ఐ పరీక్ష గురించి నర్మదకు చెప్తుంది. నర్మద సాగర్‌కి వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం గురించి చెప్తుంది. ఇక ఇద్దరూ అమూల్యని చూసి పిలుస్తారు. ఇంట్లో అంతా ఓకేనా అని అడుగుతారు. రేవతి అత్త, జానకి అమ్మమ్మ బాగా చూసుకుంటున్నారు కానీ విశ్వక్ అని విశ్వక్ తనని బెదిరించిన విషయం చెప్తుంది.
ప్రేమ అమూల్యతో నువ్వు సైలెంట్‌గా ఉంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. ఎదురు తిరుగు అప్పుడు వాడే భయపడతాడు అని ధైర్యం చెప్తుంది. అమూల్య చిన్నపిల్లలా ఏడుస్తూ నాకు ఇక్కడ ఉండాలి అని లేదు వదిన,, అమ్మానాన్న అన్నయ్యలు మీరు అందరూ గుర్తొస్తున్నారు మీతోనే ఉండాలి అని ఉంది అని చెప్తూ ఏడుస్తుంది. ఒక చిన్ని పొరపాటుకి నా వాళ్లు అందరూ నాకు దూరం అయిపోయారు అంటుంది. నీ వాళ్లు ఎవరూ నీకు దూరం అయిపోలేదు.. కాస్త ఓపిక పట్టు అమూల్య జరిగింది అంతా మీ నాన్నకి చెప్పి త్వరలోనే నిన్ను ఇంటికి తీసుకొస్తాం అని అమూల్యకి ధైర్యం చెప్తారు.
విశ్వక్ టిఫెన్‌కి కూర్చొని వాళ్ల అమ్మని పిలుస్తాడు. ఇంతలో అటుగా వచ్చిన అమూల్యని చూసి ఏయ్ పని మనిషి ఇలా రా.. వచ్చి టిఫెన్ వడ్డించు అంటాడు. అమూల్య చిరాకుగా వడ్డిస్తుంది. సాంబారు వేడిగా ఉందా.. అని విశ్వక్ అడిగితే అమూల్య విశ్వక్ చేతి మీద సాంబారు పోసి చేయి కాల్చేస్తుంది. ఇప్పుడు బాగా వేడిగా ఉంది కదా అని సెటైర్లు వేస్తుంది. సాంబారు వేడికి విశ్వక్ అరవడంతో అందరూ వచ్చేస్తారు. ఏవండీ ఏవండీ అంటూ అమూల్య తెగ నటించేస్తుంది. తనే మీద పోసి ఇలా నటిస్తుందని విశ్వక్ అంటాడు. రామరామ ఏంటండీ ఇలా అంటున్నారు అని అమూల్య కూడా అంటుంది. నా మేనల్లుడి మీదే సాంబారు పోస్తావా అని భద్రావతి అడిగితే నేనుఎందుకు పోస్తాను మేం అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అంటుంది. బామ్మ గొడవ ఆపి మీ ఇద్దరిని తీసుకొని గుడికి వెళ్లాలి త్వరగా రెడీ అవ్వండి అంటుంది. దీంతో నేను రాను అని విశ్వక్ అంటే లేపుకెళ్లడం తెలుసుకానీ గుడికి రావడం తెలీదా అని బామ్మ తిడుతుంది.
నర్మద తండ్రి సంతోషంగా గుడికి వస్తాడు. ఏమైందని తెలిసిన వాళ్లు అడిగితే అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్తాడు. మొత్తానికి సాగర్‌ని అల్లుడిగా ఒప్పుకున్నావన్న మాట అని సంతోషం చెప్తారు. రామరాజు ఫ్యామిలీతో గుడికి వస్తారు. అందరినీ చూసి రామరాజు ముఖం చాటేసుకుంటాడు. వేదవతి భర్తతో ఎవరో ఏదో అనుకుంటారు అని మనం ముఖం దాచుకోవడం ఏంటండీ అని అంటుంది. ఇక సాగర్ ఉద్యోగం గురించి తండ్రికి తెలిస్తే ఎలా.. వనజ వాళ్లకి 20 లక్షలు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ వచ్చి నర్మదతో మాట్లాడితే మనం ఏమైనా భార్యాభర్తలమా ఎప్పుడూ నాతోనే ఉంటావు.. వెళ్లు మీ ఆయన దగ్గరకు అని నెట్టేస్తుంది. ప్రేమ వెళ్లి ధీరజ్ మీద పడిపోతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు.
ప్రసాద్‌రావు అల్లుడు కూతురు పేరు మీద అర్చన చేయిస్తాడు. ఇక ప్రసాద్ రావు సంతోషంతో అందరికీ స్వీట్స్ పంచుతాడు. రామరాజు వాళ్లు కూడా గుడికి వెళ్లి అర్చన చేయించుకుంటారు. నర్మద అందరి పేర్లు చెప్పి అమూల్య పేరు కూడా చెప్తుంది. తన పేరు ఎందుకు చెప్పావ్.. మనం అక్కర్లేని వాళ్ల గురించి మనకు అక్కర్లేదు.. ఇంకోసారి మన ఫ్యామిలీలో తన ప్రస్తావన రావొద్దని వేదవతి అంటుంది. అమూల్య, విశ్వక్, బామ్మ గుడికి వస్తారు. ఇలాంటి మొద్దు వెదవని ఎలా ప్రేమించావ్ అమ్మా అని అడిగితే ప్రేమించే వరకు వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించాడని అమూల్య అంటుంది. తన కుటుంబం అంతా బాగుండాలి అని రామరాజు కోరుకుంటాడు. సాగర్ ఉద్యోగ విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఏం గొడవ అవ్వకూడదు అని నర్మద కోరుకుంటుంది. ఇక ధీరజ్ ప్రేమ ఈ కష్టకాలంతో తన కుటుంబానికి తనకి కొండంత అండగా ఉందని.. తనని కూడా ప్రేమగా చూసుకుంటానని గుడి నుంచి వెళ్లే లోపు ప్రేమ చెప్పేస్తా అని అనుకుంటాడు.
వల్లీ చందు వచ్చుంటే బాగున్నను అని రామరాజు అంటాడు. వల్లీ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిందని వేదవతి చెప్తే ప్రేమ నర్మదతో ఇంకా ఎవరి కొంపలు కూల్చేయడానికి వెళ్లారో అనుకుంటారు. వల్లీ గుడిలో పొర్లు దండాలు పెడుతుంది. పొర్లు దండాలు పెడుతూ తిప్పలు పడుతూ తల్లిదండ్రుల్ని తిడుతుంది. నీ కాపురం బాగుండాలి అని ఇలా మొక్కుకున్నామని అంటారు. అమూల్య కావాలనే విశ్వక్‌తో మొక్క తీర్చుకుందువు పదా.. అని అంటుంది. ఏం మొక్కు అని విశ్వక్ అడిగితే మన పెళ్లి అయితే మోకాల ప్రదక్షిణ చేస్తా అని మొక్కుకున్నావ్ కదా అని అంటుంది. బామ్మ విశ్వక్‌ని తిట్టి మోకాల మీద నడవమని అంటుంది. విశ్వ్ మనసులో దీన్ని అడ్డుపెట్టుకొని దీని బాబుకి నేను నరకం చూపించాలి అనుకుంటే ఇది నాకు నరకం చూపిస్తుంది ఏంటి అని విశ్వక్ తిట్టుకొని మోకాల మీద నడుస్తాడు. విశ్వక్, శ్రీవల్లి ఒకరికి ఒకరు చూసుకోకుండా గుద్దుకుంటారు. నువ్వేంటి విశ్వ మోకాలి మీద నడుస్తున్నావ్ అని భాగ్యం అడుగుతుంది. మమల్ని టార్చర్ పెట్టినందుకు అమూల్య నిన్ను బాగా చెక్కేస్తున్నట్లు ఉందని వల్లీ అంటుంది. ఏయ్ ఎక్కువ చేస్తే నిన్ను చంపేస్తా అని విశ్వక్ అరుస్తాడు. మరోవైపు ప్రేమ, ధీరజ్ ఓ చోట కూర్చొంటారు. ప్రేమ పరీక్ష వద్దురా అని అంటే కొన్ని రోజులు పోతే సమస్యలు అన్నీ సెట్ అయిపోతాయిలే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























