Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ పోలీస్ యూనీఫాం వేసుకొని వస్తుంది. ధీరజ్‌తో ఏంట్రా నన్ను ఈ యూనీఫాంలో చూసి అలా ఉండిపోయావ్. ఈ యూనీఫాం వేసుకోగానే నిజంగానే పోలీస్ అయిపోయినట్లు ఉందిరా.. నేను ఇలాగే బయటకు వెళ్తే అందరూ నిజంగా పోలీస్ అని భయపడతారు కదా అని అంటుంది. 

Continues below advertisement

ప్రేమ మాటలకు ధీరజ్ పెద్దగా నవ్వుతాడు. ఎందుకు నవ్వి చస్తున్నావ్‌రా అని ప్రేమ అడుగుతుంది. దానికి ధీరజ్ నువ్వు అసలే ఇంత ఉంటావ్‌.. ఈ డ్రస్‌లో ఇంకా పొట్టిగా ఉన్నావ్.. పొట్టి పోలీస్‌ ఆఫీసర్‌ని చూస్తుంటే భలే నవ్వొస్తుంది తెలుసా అని నవ్వుతాడు. ప్రేమ లాఠీతో ధీరజ్‌ని వాయించేస్తుంది. తర్వాత ధీరజ్ బుంగ మూతి పెట్టుకున్న ప్రేమతో నువ్వు ఈ డ్రస్‌లో చాలా బాగున్నావ్ అంటాడు. ప్రేమ కూడా ధీరజ్‌కి థ్యాంక్స్ చెప్తుంది. 

భాగ్యం, ఇడ్లీబాబాయ్ రామరాజు ఇంటికి వస్తారు. రామరాజుతో మీరు ఇచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాం బాగా జరుగుతుంది అని ఇంట్లో అందరికీ స్వీట్స్ ఇస్తారు. కష్టపడి పని చేసుకోండి ఇంతకు ముందు ఉన్న స్థాయికి రండి అని రామరాజు అంటాడు. భాగ్యం రామరాజుతో అన్ని విషయాలు బాగున్నాయి కానీ ఒకటే ప్రాబ్లమ్ ఉందని చెప్తుంది. ఏంటి అని రామరాజు అడిగితే మా వల్లీని ఉద్యోగం చేయమని చెప్పారు కదా.. పెద్ద చిక్కు వచ్చిందండి.. తను చదువుకున్న ఎమ్‌ఏ సర్టిఫికేట్ల చిక్కు వచ్చిందని అంటుంది. సర్టిఫికేట్ల చిక్కా ఏమైంది మీ అమ్మాయి కొంప తీసి చదువుకోలేదా అని ప్రేమ అడుగుతుంది. 

Continues below advertisement

ఇళ్లు మారినప్పుడు సర్టిఫికేట్ ఎక్కడో పడిపోయింది .. కనిపించడం లేదు అని అంటారు. ఇదక్కా వాళ్ల ఓవర్ యాక్షన్ అని ప్రేమ అంటే మనం దిమ్మతిరిగే షాక్ ఇద్దాం అని నర్మద అంటుంది. ఇక వల్లీ ఏం తెలీనట్లు తన సర్టిఫికేట్లు పోగొట్టేశారా అని తల్లిదండ్రుల మీద సీరియస్ అయిపోతుంది. మీ నిర్లక్ష్యంతో మామయ్య గారి మాట నేను పాటించని కోడల్ని చేసేశారు అని అంటుంది. అంత బాధ పడకు అక్క నువ్వు జాబ్ చేస్తావులే అని నర్మద అంటుంది. ఎలా సర్టిఫికేట్ పోయింది కదా అని వల్లీ అంటే ఆన్‌లైన్‌లో అప్లే చేస్తే డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తారు.. నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు.. నీ సంగతి చూసుకోవడానికి మేం ఉన్నాం కదా అని నర్మద, ప్రేమ అంటాడు. 

వల్లీ బిత్తరపోతుంది. భాగ్యం కూడా నోరెళ్లబెడుతుంది. వల్లీకి ఇద్దరూ ఎక్కడ చదివావో డిటైల్స్ చెప్పు అని అడుగుతుంది. దానికి భాగ్యం నాకు ఓ మాస్టారు బాగా తెలుసు ఆయనకు చెప్పి సర్టిఫికేట్లు తెప్పిస్తాం అంటారు. దాంతో రామరాజు త్వరగా సర్టిఫికేట్లు తెప్పించండి అంటాడు. ఎన్ని ప్లాన్స్‌ వేసినా ఇలా అయింది ఏంటి అని శ్రీవల్లి తల పట్టుకుంటుంది. 

సాగర్ నర్మద తండ్రి దగ్గరకు వెళ్తాడు. నర్మద నా కోసం మిమల్ని వదిలేసి ఎంత బాధ పడుతుందో నాకు తెలుసు.. కానీ నేను నా నర్మదకు బాధ దూరం చేయాలి అని ఎంతో కష్టపడి చదువుతున్నా కానీ నేను గవర్నమెంట్ జాబ్‌ తెచ్చుకోవడానికి రాను అని అందరూ అంటున్నారు.. నా కారణంగా నర్మద బాధ పడటం నాకు ఇష్టం లేదు.. మీరు తనని దగ్గరకు తీసుకోవాలి అంటే నేనేం చేయాలో చెప్పండి.. మీరు ఏం చెప్తే అది చేస్తా అని అడుగుతాడు. దానికి ఆయన వ్యక్తిగతంగా నాకు నీ మీద కోపం లేదు.. కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న నా కూతురి భర్త రైస్ మిల్లులో పని చేస్తాడు అంటే నాకు అవమానం.. నువ్వు జాబ్ కొట్టలేకపోతున్నా అంటున్నావ్ కాబట్టి నీకు ఇంకో సలహా ఇస్తున్నా జాబ్‌ కొనుక్కో అని అంటాడు. ఇందుకు నేను నీకు సాయం చేయలేను ఎందుకంటే నా కూతురు నన్ను తప్పుగా అనుకుంటుంది.. అని అంటాడు. జాబ్ కొనడానికి ఎంత అవుతుందని సాగర్ అడిగితే 20 లక్షలు అవ్వొచ్చని ఆయన చెప్తారు. రామరాజు ఇంటికి భోజనానికి వస్తాడు. ఇంతలో ఓ కాల్ వస్తుంది. ఓ కస్టమర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతాడు. నాకు ఇంగ్లీష్ రాదు అని రామరాజు చెప్పి అక్కడే ఉన్న వల్లీని పిలిచి మా కోడలికి ఇంగ్లీష్ బాగా వచ్చు తనతో మాట్లాడండి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.