Illu Illalu Pillalu Serial Today Episode అత్తామామల్ని కలపాలి అని నర్మద, ప్రేమ ప్లాన్ చేస్తారు. అత్తని పిలుస్తారు. నేను మీతో మాట్లాడటం లేదు కదా ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతారని వేదవతి అంటుంది.
నర్మద, ప్రేమలు వేదవతికి వాళ్ల లవ్ స్టోరీ చెప్పమని అంటాడు. ఇక సాగర్, ధీరజ్ అందరూ లవ్ స్టోరీ చెప్పమని అడుగుతారు. ఇంతలో తిరుపతి వీళ్ల లవ్‌స్టోరీ చెప్పడానికి వాళ్లే అవసరం లేదు వీళ్ల ప్రేమకి పెళ్లికి మెయిన్ పిల్లర్ అయిన నేను చెప్తా.. ప్రేమ అనేది ఆస్తులు అంతస్తులు చూసుకొని కాదు మనసులు నచ్చి పుడుతుంది అనడానికి మా అక్కా బావ నిదర్శనం. మనసుకు నచ్చిన వాడితో జీవితం బాగుంటుంది అని మా అక్క నమ్మింది. అందుకే ఇంట్లో పనోడు అని కూడా ఆలోచించలేదు.. పాతికేళ్ల క్రితం కోట లాంటి ఇంటిని యువరాణి రాజభోగాన్ని వదిలేసి బావ చేయి పట్టుకొని వచ్చింది మా అక్క, ఇప్పటికీ అలాగే ఉంది. మా బావ కూడా అక్క కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మా నాన్న తుపాకీ గురి పెట్టినా బెదరలేదు. బావని మించిపోయింది మా అక్క బావ ప్రాణాలకు మా అక్క ప్రాణం అడ్డేసింది. ఈ పాతికేళ్లు బావే ప్రాణంగా బతికింది. కష్టాలు దిగమింగింది.. అంత గొప్ప ప్రేమ మా అక్కది. అంత గొప్ప బంధం వాళ్లది. చావు చివరి వరకు ఇలాగే ఉంటారు కానీ ఒకరి చేయి ఒకరు విడిచిపెట్టరు అని తిరుపతి చెప్పడంతో వేదవతి ఏడుస్తుంది.
నర్మద రామరాజుతో మామయ్య అత్తయ్యకి మీ కంటే ఎవరూ ఎక్కువ కాదు ఆఖరికి కన్నపిల్లలు కూడా మీ తర్వాతే.. ఈ పాతికేళ్లలో ఒక్క విషయం దాయని అత్తయ్య మేనకోడలి కోసం మీ దగ్గర ఆ విషయం దాస్తారు అని ఎలా అనుకున్నారు అని అంటుంది. ప్రేమ కూడా మామతో నేను నిజంగా అత్తకి ఏం చెప్పలేదు మామయ్య.. అత్తకి మీరు అంటే ప్రాణం.. అత్తని దయచేసి అర్థం చేసుకోండి. మనస్ఫూర్తిగా అత్తతో మాట్లాడండి.. అత్త అనుభవిస్తున్న నరకాన్ని తనకు దూరం చేయండి ప్లీజ్ అని ప్రేమ చెప్తుంది. వేదవతి ఏడుస్తుంది.
ప్రేమ, వేదవతిల పుట్టింటి వాళ్లు ఆనంద్‌రావుని తీసుకొని వస్తారు. రేయ్ రామరాజు బయటకు రారా అని సేన పిలుస్తాడు. అయ్య బాబాయో నేను దొంగని కాదండీ.. నన్ను నమ్మండీ అని ఆందన్‌రావు అంటాడు. రామరాజు ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తుంది. రేయ్ మా వియ్యంకుడికి కట్టేస్తారా ఎంత ధైర్యం మీకు అని రామరాజు అడుగుతాడు. దాంతో భద్రావతి దొంగతనానికి వచ్చిన వాడిని కట్టేయమా అని అంటుంది. నిందలు వేయడమేంటి అని వేదవతి అంటుంది. గొప్ప మర్యాదస్తుడుని దొంగ అంటే ఊరుకోను అని రామరాజు అంటే దానికి విశ్వ గొప్ప పరువు ప్రతిష్ఠ అర్థరాత్రి మా ఇంటికి వచ్చాడు వీడు వీడిని అడుగు అని ఆనంద్రావుని అడుగుతాడు. రామరాజు అడగటంలో ఆనంద్‌రావు మా అమ్మడుని చూడటానికి రాత్రి వచ్చానండీ కన్ఫూజ్ అయి వాళ్ల ఇంటికి వెళ్లిపోయానండీ.. రాత్రి అంతా కట్టేశారండీ అని అంటాడు. పొరపాటున వచ్చారని చెప్పారు కదా అని ధీరజ్, సాగర్, చందు అంటారు.
సేన పోలీసుల్ని పిలుస్తాను అంటాడు. పిలవండీ ఏం చేస్తార చూస్తా అని చందు అంటే మీకు పోలీస్ స్టేషన్ కొత్తేంట్రా ఒకసారి నువ్వు మీ నాన్న మీ వాళ్లు అందరూ వెళ్లారు కదా అని అంటాడు విశ్వ. దాంతో విశ్వని సాగర్, చందు, ధీరజ్‌లు కాలర్ పట్టుకొని గొడవ పడతారు. మాటా మాటా పెరిగి పోలీసుల్ని పిలుద్దామని భద్రావతి అంటుంది. నేను దొంగ కాదండీ అని ఆనంద్రావు అంటాడు. ఇంతలో వల్లి కూడా వచ్చి మీకు దండం పెడతా అండీ పోలీసులు పిలవొద్దు అంటుంది. వాళ్లని బతిమాలడం ఏంటి అని చందు అంటాడు. సేనాపతి పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇంతలో ఆయన గారండీ అని అంటూ భాగ్యం ఎంట్రీ ఇస్తుంది.
వల్లి దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి రాత్రి మీ నాన్న వచ్చారు ఎక్కడే అని అడుగుతుంది. ఇంతలో ఆనంద్ రావు దెబ్బలు, కట్లు చూసి ఏంటండీ ఏమైంది అండీ ఎవరండీ మా ఆయన్ని ఇలా కట్టేసి కొట్టింది అని అంటుంది. అన్నీ చెప్తాం కానీ ఇప్పుడు మీరు శుభాకాంక్షలు అన్నారు ఏంటి అని అడిగితే ఈ రోజు మా వల్లి పుట్టిన రోజు అండీ అందుకే ప్రతీ ఏడాదిలా అర్థరాత్రి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారని అంటుంది. రాత్రి నుంచి ఆ విషయం మాకు ఎందుకు చెప్పలేదు అని భద్రావతి అంటే మీరు నాకు చెప్పనివ్వలేదు కదా అని అంటాడు. ఇక రామరాజు గొడవని అక్కడితో ఆపి అందర్నీ లోపలికి తీసుకెళ్తాడు. అమ్మయ్య అని భాగ్యం అనుకోవడం నర్మద చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.