Illu Illalu Pillalu Serial Today Episode ఆనంద్‌రావు రామరాజు ఇంటికి దొంగతనానికి వస్తాడు. అతను దాక్కోవడం చూసిన నర్మద దొంగ దొంగ అని అరుస్తుంది. దాంతో ఇంట్ల అందరూ వెతకడం మొదలు పెడతారు. ఆనంద్‌రావు పరుగెత్తి భద్రావతి ఇంట్లో దూరుతాడు. ఆనంద్ రావు తనలో తాను మాట్లాడుకోవడంతో భద్రావతి చూసి రేయ్ ఎవడ్రా నువ్వు అని ఇంట్లో అందర్ని పిలుస్తుంది.
భద్రావతి ఇంటల్లో అందర్ని పిలవడంతో అందరూ హాల్లోకి చేరుకుంటారు. ఆనంద్‌రావు భయంతో పరుగులు పెట్టి దొరికిపోతాడు. ఆనంద్‌రావు ముఖం చూసి వాళ్ల ఎవడ్రా నువ్వు ఏ ఊరురా నువ్వు అని చితక్కొడతారు. భద్రావతి వాడిని పరిశీలనగా చూసి శీవల్లి తండ్రిగా గతంలో అతన్ని సూటు బూటులో చూసినట్లు గుర్తిస్తుంది. ఎస్ వీడు వాడే అని అనుకుంటుంది. మరోవైపు రామరాజు ఫ్యామిలీ మొత్తం వాళ్లు ఇళ్లంతా వెతుకుతారు. ఎవరు వచ్చారా అనుకుంటారు. అందరూ హాల్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. వల్లీ టెన్షన్ పడటం నర్మద చూస్తుంది. తర్వాత తాళాలు ఇచ్చి చూపిస్తుంది.
వల్లి దగ్గర ఉండాల్సిన తాళాలు నీ దగ్గర ఉన్నాయి ఏంటి అని వేదవతి అడిగితే నా దగ్గర కాదు దొంగ దగ్గర ఉన్నాయని అంటుంది. వల్లి తడబడుతుంది. దొంగ దగ్గరే ఈ తాళాలు దొరికాయి.. వాడు నీ గదిలోకి వచ్చి వీటిని తీసుకున్నాడు. నీ దగ్గర ఉండాల్సిన తాళాలు వాడి దగ్గర ఎందుకు ఉన్నాయి అంటుంది. నాకు తెలీదు ఆ దొంగ తీసుకున్నాడేమో అని వల్లి అంటుంది. దొంగ ఎక్కడికీ పోడు దొరుకుతాడు అని నర్మద అంటుంది. వల్లి మనసులో నాన్న తప్పించుకో నాన్న అని అనుకుంటుంది. నర్మదకు అనుమానం ఎక్కువవుతుంది. ఈ దొంగతనానికి వల్లికి సంబంధం ఉందని అనుకుంటుంది.
ఆనంద్‌రావుకి ప్రేమ తండ్రి గన్ గురి పెడతాడు. ఆనంద్ రావు గజగజ వణికిపోతాడు. నువ్వు ఆ రామరాజు గాడి వియ్యంకుడివి కదా అని భద్రావతి అడిగితే అవును అండీ కాదండీ అంటూ మాట్లాడుతాడు. నేను దొంగని కాదండీ చంపకండి అని అంటాడు. భద్రావతి సేనత వీడు ఆ రామరాజు వియ్యంకుడే మనం ఒకసారి వీడితో మాట్లాడాం అని గుర్తు చేస్తుంది. గన్ గురి పెట్టి బెదిరించడంతో రామరాజు వియ్యంకుడినే అని ఒప్పుకుంటాడు. అందరూ షాక్ అయిపోతారు. నేను దొంగని కాదండీ అని అంటాడు. కవర్ చేయడానికి మా అమ్మాయి ఇంటికి వెళ్లబోయి దారితప్పి ఇటు వచ్చానని అంటాడు. భద్రావతి అతన్ని వదిలేయమని అంటుంది. వీడిని అడ్డు పెట్టుకొని రామరాజుని నడిరోడ్డు మీదకి లాగుతా.. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌లో పెడతా అంటుంది. వాడి పెద్ద కొడుకుకి ఉన్నతమైన సంబంధం దొరికిందని విర్రవీగుతున్నాడు. కానీ వీడు దొంగఅని తెలిస్తే అవమానంతో చచ్చిపోతాడు అని అంటుంది. తల్లి ఎంత చెప్పినా భద్రావతి వినదు. విశ్వతో చెప్పి ఆనంద్‌రావుని కట్టి పడేయమని అంటుంది. సేనతో పొద్దున్నే పోలీసులకు ఫోన్ చేయమని అంటుంది. ఇలా ఇరుక్కుపోయానేంటి అని ఆనంద్ రావు చాలా భయపడతాడు.
రామరాజు ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. అందరూ పడుకుందాం అని వల్లి అంటే దొంగ ఇక్కడే ఉన్నాడు మనం పడుకుంటే మళ్లీ వస్తాడు అని అంటుంది. తాళాలు నీ దగ్గర ఉన్న విషయం ఇంట్లో వాళ్లకి తప్ప ఎవరికీ తెలీదు అలాంటిది నీ దగ్గరకే వచ్చి తాళం తీసుకున్నాడని అంటే అణువణువు తెలిసిన వాడే వాడికి మన ఇళ్లు అణువణువు తెలిసిన వాడు అంటాడు. అందరూ హాల్లోనే ఉండాలని అనుకుంటారు. చచ్చేంత భయంగా ఉందని వల్లి కంగారు పడుతుంది. నర్మద, ప్రేమలు ఇదే అవకాశంగా అత్తా మామల్ని కలపాలి అని అనుకొని తిరుపతిని అడ్డు పెట్టుకొని ఇలా కలపాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.