Illu Illalu Pillalu Serial actors funny reels 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చూసే ప్రతీ ఒక్కరూ ఆ కథ నిత్యం వాళ్లింట్లోనో పక్కింట్లోనే జరిగేదే అనుకుంటారు. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు కొడుకుల ఉన్న అత్తకి, కోడళ్లకి ఈ సీరియల్ భలే కిక్ ఇస్తుంది. మా ఇంట్లో నర్మద పరిస్థితే నాది అని ఒకరు అనుకుంటే.. ఆ శ్రీవల్లి క్యారెక్టర్ అచ్చం నా కోడలిదే అని అనుకోని అత్తలు ఉండరు. మా అత్త ఆ వేదవతిలా ఉంటే ఎంత బాగున్నో అనుకునే కోడళ్లు ఇంకెంత మందో.. ఇదంతా ఓ ఎత్తు అయితే ఈ పనికి మాలిని వల్లీ ఇలా చేస్తుందేంటి.. పాపం నర్మద, ప్రేమలు.. అంటూ ఉసూరు మనే వాళ్లు చాలా మందే ఉంటారు. మామూలుగా అయితే సీరియల్‌లో ఒకరు అంటే ఒకరికి గిట్టని ఈ తోటికోడళ్లు రియల్ లైఫ్‌లో అదేనండీ.. సీరియల్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారని అనుమానం వచ్చే ఉంటుంది కదా.. అసలు వాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్ వేయండి..
సాధారణంగా మనం సీరియల్స్‌లో అత్తా కోడళ్లు అయినా భార్యభర్తలు అయినా హీరోయిన్ విలన్ కొట్టున్నా వాళ్లు బయట కూడా అలాగే ఉంటారని అనుకుంటాం. కానీ వాళ్లంతా నటన వరకే అలా ఉంటారు. బయట చాలా మంది మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక సెట్స్‌లో అయితే సందడి చేస్తుంటారు. ఒకరికి ఒకరు అంటే పడని ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తోడికోడళ్లు ఎలా కలిసిపోయి డ్యాన్స్‌లు వేస్తున్నారో చూడండి.. ఏక్ నెంబర్.. ఏక్ నెంబరు అనే పాటకి శ్రీవల్లి, నర్మద, ప్రేమ కలిసి ఓ వైపు డ్యాన్స్ చేస్తుంటే.. మరోవైపు సాగర్, ధీరజ్, చందులు డ్యాన్స్ చేస్తారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ వీడియో మీ కోసం..
ఒకే ఇంట్లో ఇద్దరు కూతుళ్లు ఉంటే చిన్న కూతురు నరసింహా సినిమాలో సౌందర్యలా పద్ధతిగా ఉంటే పెద్దమ్మాయి నిలాంబరిలా ఉంటుంది అంటూ వేదవతి, భద్రావతి గెటప్ వేసుకుంటారు. వేదవతి పద్ధతిగా అడుగులో అడుగు వేస్తూ నడుచుకుంటూ ఉంటే భద్రావతి నిలాంబరి రమ్యకృష్ణని తలపించేలా నడుస్తుంది.
నర్మద, ప్రేమలను తొక్కేసి తోడికోడళ్లని టార్చర్ చేయాలి అనుకునే శ్రీవల్లి వాళ్లతో కలిసి చక్కగా వీడియోస్ చేసేస్తుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసిపోయి రీల్స్ చేస్తున్నారు. నానీ గ్యాంగ్ లీడర్ మూవీలో ముగ్గురు పిల్లలు పేర్లు అడగటం వాళ్లు పెద్దదాని పేరు చుట్కీ, చిన్న దాని పేరు చోటాభీమ్.. పొట్టిదాని పేరు అనగానే చిన్నారి పెళ్లి కూతురు అని చెప్పే రీల్‌తో నర్మద, ప్రేమ, వల్లి ఆకట్టుకుంటారు. వీటికి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
పోతా పోతా పైసలన్నీ పట్టక పోతావారా.. పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకపోతావారా.. పోరీపోరీ అంటావ్ దాన్ని చుట్టకపోతావారా.. అంటూ నర్మద, ప్రేమ, వల్లి వేసిన స్టెప్‌లు చూసేయండి..
రామరాజు కుటుంబం మొత్తం సీరియల్ సెట్‌లో సిద్ది పుట్టిన రోజు వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ఈ సందడి మీరు చూసేయండి..
దేవుడా ఈ రోజు మాకో మంచి అమ్మాయి దొరకాలి.. అంటూ సాగర్, తిరుపతి, చందులు గుడికి వెళ్లి అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ అమ్మాయిలన్ని చూసి సిగ్గు పడుతున్నట్లు ఉన్న ఈ రీల్ చాలా ఫన్నీగా ఉంది. మీరూ చూసేయండి.
వల్లీ, సాగర్, చందు, తిరుపతిలు సెట్‌లో ఫ్రీ టైంలో క్రికెట్ ఆడుతారు. పెద్ద బ్యాట్స్ మెన్‌లా సాగర్ బిల్డప్ ఇవ్వడం. వల్లి బౌలింగ్‌లో మొదటి బాల్‌కే చందు పట్టిన క్యాచ్‌తో అవుట్ అయిపోవడం కామెడీగా ఉంటుంది. మీరూ చూసేయండి.