Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మే 04 ఎపిసోడ్)


 మ‌నును జైలుకు పంపించేందుకే చనిపోయినట్టు నాటకం ఆడానంటూ శైలేంద్రతో మాట్లాడుతాడు రాజీవ్...పోలీస్ స్టేషన్లో మనుని కలిసిన విషయం చెప్పడంతో శైలేంద్ర కంగారుపడిపోతుంటాడు. 
శైలేంద్ర: కొద్ది రోజులు వ‌సుధార‌తో పాటు ఎవ‌రికి క‌నిపించ‌కుండా దూరంగా ఉండడం మంచిది...
రాజీవ్: నా మ‌ర‌ద‌ల‌ని చూడ‌కుండా ఉండ‌లేన‌ు, ఒక‌వేళ నిజంగా చ‌నిపోయినా నా మరదలు కోసం ద‌య్య‌మై వ‌స్తాన‌ు
శైలేంద్ర‌: మరి మనుకు ఎందుకు కనిపించావ్
రాజీవ్: మ‌ను గుండెల్లో ద‌డ‌పుట్టించి భ‌య‌పెట్ట‌డానికే పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాన‌ు..నాకు-నా మరదలకి అడ్డుగోడ‌గా నిలిచి చిన్న చిన్న ఆనందాలు కూడా లేకుండా చేశాడ‌ు..అందుకే మ‌నును టార్చ‌ర్ పెట్ట‌డానికే పోలీస్ స్టేష‌న్ వెళ్లాను
శైలేంద్ర : నువ్వు దొరికిపోతే ఈ ప్లాన్ కూడా ఫెయిల‌వుతుంది.. కొన్నాళ్లు అండ‌ర్‌గ్రౌండ్‌లోనే ఉండ‌ు
రాజీవ్: వ‌సుధార చూడ‌కుండా ఉండలేను..బయటకు వచ్చి తీరుతా
శైలేంద్ర: ఇంకోసారి బ‌య‌ట క‌నిపిస్తే నేనే ఏం చేస్తానో నాకే తెలియ‌ద‌ు
రాజీవ్: న‌న్ను ప‌ట్టుకోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ు


Also Read: నేటి రాశిఫలాలు (04-05-2024)


ఇంతలో వసుధార..శైలేంద్రకి కాల్ చేస్తుంది
ఎక్కడున్నావ్ అని వసుధార అడిగితే...మీ మాటల్లో రెస్పెక్ట్ లేదు అందుకే చెప్పను అంటాడు. అప్పుడు శైలేంద్ర గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అడిగితే...బయట ఉన్నానని చెబుతాడు. అయినా నేనెక్కడుంటే నీకేంటి అంటాడు. మీతో మాట్లాడాలి అర్జెంట్ గా కాలేజీకి రండి అని కాల్ కట్ చేస్తుంది. ఎండీ రూమ్‌లో వ‌సుధార‌తో మ‌హేంద్ర మాట్లాడుతుంటాడు. వారి మాట‌ల్ని చాటు నుంచి శైలేంద్ర వింటాడు. మ‌ను జైలుకు వెళ్లాడు కాబ‌ట్టి కాలేజీ బాధ్య‌త‌లు మీరే తీసుకోవాల‌ని మ‌హేంద్ర‌ను కోరుతుంది వ‌సుధార‌. ఈ బాధ్యతలు తీసుకునేది లేదనేస్తాడు మహేంద్ర.
మహేంద్ర: రాజీవ్‌ను మ‌ను చంపిన‌ట్లు పోలీసుల ద‌గ్గ‌ర‌ ప‌క్కా ఆధారాలు ఉన్నాయి. యాభై కోట్ల చెక్ ఇచ్చి కాలేజీకి మంచి చేసిన మ‌నును కొడుకుగా ద‌త్త‌త తీసుకోవాల‌ని అనుకున్నాన‌ని, కానీ ఇంత ప‌నిచేస్తాడ‌ని ఊహించ‌లేద‌ు
వసుధార: ఈ స‌మ‌స్య‌లన్నీ నా త‌ల‌కు చుట్టుకున్నాయి, ఈ ఒత్తిళ్ల మ‌ధ్య ఎండీ ప‌ద‌వి నిర్వ‌ర్తించ‌లేన‌ు..అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను
మహేంద్ర: రిషి అప్ప‌గించిన బాధ్య‌త‌ను వ‌ద‌లుకోవ‌ద్ద‌ు 
వసు: ప‌ద‌వి వ‌దులుకోవ‌డం నాకు బాధ‌గానే ఉంది  కానీ ప‌రిస్థితులకు తలొగ్గక తప్పలేదు..దీని గురించి చర్చించేందుకే శైలేంద్రని కాలేజీకి రమ్మన్నాను 
ఈ మాటలు విన్న శైలేంద్ర ఆనందానికి అవధులుండవు...అప్పుడే లోపలకు ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర...నువ్వు ఎండీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటే ఆ బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటార‌ు. బాబాయ్ ఎండీగా బాధ్య‌త‌లు తీసుకుంటున్నాడా అని అడుగుతాడు.
మహేంద్ర: నాకు ఈ ప‌ద‌వుల‌పై ఇష్టం లేద‌ు, మ‌నును జైలు నుంచి విడిపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాన‌ు..వ‌సుధార త‌ర్వాత కాలేజీకి కాబోయే ఎండీ ఎవ‌ర‌న్న‌ది అన్న‌య్య‌తో పాటు బోర్డ్ మెంబ‌ర్స్‌తో మాట్లాడి నిర్ణ‌యిస్తారు.. కొత్త ఎండీ ఫిక్సైన తర్వాత మేం ఇద్దరం కాలేజీ నుంచి దూరంగా వెళ్లిపోతాం అంటారు...
ఈ మాటలు విని శైలేంద్ర తాను ఇక ఎండీ అవడం పక్కా అని ఫిక్సైపోతాడు..అక్కడి నుంచి వెళ్లిపోతాడు..


 Also Read: దేశ ఆర్థిక స్థితి ఈ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది - చాణక్య నీతి


నమ్మాడంటారా మావయ్యా అని వసుధార అంటే..వాడికి ఎండీ సీట్ అంటే పిచ్చి కదమ్మా..నమ్మే ఉంటాడు అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. మరోవైపు శైలేంద్ర కూడా ఆలోచనలో పడతాడు...ఎండీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని వ‌సుధార చెప్పిన మాట‌లు నిజ‌మో, క‌లో శైలేంద్ర‌కు అర్థం కాదు.  ఇంతలోనే బోర్డ్ మీటింగ్ కి రమ్మని కబురొస్తుంది. మీటింగ్ ఏర్పాటు చేసిన వ‌సుధార తాను ఎండీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తుంది. ఇంత  పెద్ద నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నావని ఫణీంద్ర అడిగితే...ఏం క‌ష్టం వ‌చ్చింద‌ని రిజైన్ చేస్తున్నావ‌ని అడుగుతాడు. ఫణీంద్ర ఎంత ఒప్పించినా కానీ వసుధార మాత్రం ఒప్పుకోదు.  మరి నువ్వు తప్పుకుంటే నీ తర్వాత ఎవరుంటారని ఫణీంద్ర అడిగితే... బోర్డ్ మెంబర్స్ అంతా శైలేంద్ర పేరు సూచిస్తారు. ఇక ఫణీంద్ర కూడా అందుకు అంగీకరిస్తాడు. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...


గుప్పెడంత మనసు మే 06 సోమవారం ఎపిసోడ్ లో శైలేంద్ర ద్వారా రాజీవ్ బతికే ఉన్నాడని తెలుసుకుని మనుని విడిపించే ప్రయత్నాలు మొదలవుతాయి....