Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు ఆగష్టు 08 ఎపిసోడ్)
కాలేజీలో మళ్లీ ఎండీ బాధ్యతలు చేపట్టిన వసుధార.... ఫైల్స్ అన్ని పెండింగ్‌లోనే ఉండటం చూసి కాలేజీ స్టాఫ్ పై ఫైర్ అవుతుంది.వెంటనే వాటికి సంబంధించిన పనులు పూర్తవ్వాలని స్ట్రాంగ్ గా చెబుతుంది. వర్క్ విషయంలో తాను నిజాయితీగా ఉంటానని, తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలాగే ఉండాలని కోరుకుంటానని చెబుతుంది. ఫైల్స్ పాస్ చేసేందుకు సైన్ చేస్తుండగా అక్కడకు వచ్చిన శైలేంద్ర వచ్చి అడ్డుకుంటాడు
శైలేంద్ర: ఏ అధికారంలో ఉన్నావని ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎండీవి కాదు, కనీసం ఇన్‌ఛార్జ్ కూడా కాదు..ఎండీ సీట్‌కు రిజైన్ చేసిన తర్వాత నీకు కాలేజీలో ఎలాంటి హోదా లేదు..నీ సంతకానికి విలువ లేదు. నువ్వు ఆర్డినరీవే అంటాడు
ఇంతలో అక్కడకు రిషి రావడంతో..నువ్వేంటి మాట్లాడవు..నీ భార్య అని తప్పుచేసినా మాట్లాడకుంటా ఉంటావా అని అంటాడు
రిషి: మీరు చెప్పిందే నిజం..వసుధార ఇప్పుడు ఎండీ కూడా కాద..తన సంతకం చెల్లదు. నీకు ఇప్పుడు అధికారం లేదు, ఈ సీట్‌లో కూర్చున్న వారే ఆ ఫైల్స్ పాస్ చేయాలి
స్టాఫ్: ఇప్పుడు ఎండీ ఎవరూ లేరుకదా ..మరి ఫైల్స్ ఎలా పాస్ అవుతాయి
శైలేంద్ర: రాజీనామా చేసిన వాళ్లు, అర్హత లేనివాళ్లు సంతకాలు పెడితే ఊరుకునేది లేదు..ఈ రోజు వసుధార వచ్చింది, రేపు ఇంకొకరు వస్తారు.. ఎవరికి నచ్చకపోతే వాళ్లు లేచి వెళ్లిపోవాలని ఆలోచించి మళ్లీ వచ్చి కూర్చోవడం సరికాదు
రిషి: వసుధార స్టూడెంట్స్ మంచి కోసమే ఫైల్స్ పాస్ చేయాలని అనుకుంటుందేమో...
శైలేంద్ర: నువ్వు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావా
రిషి: నువ్వు చెప్పినట్టే అన్నీ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి..త్వరలోనే బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎండీ ప్రకటిస్తాను
వసుధార క్యాబిన్ నుంచి బయటకు రాగానే ఎండీగా నా పేరు ఎందుకు చెప్పలేదని రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. వసుధార అడిగిన వెంటనే నా పేరు చెప్పాల్సిందని అంటాడు. అలా వెంటనే పేరు చెప్పేస్తే తాను రిషి కాదు రంగానని వసుధార ఈజీగా కనిపెడుతుందని అందుకే చెప్పలేదంటాడు. ఆ లాజిక్ విని శైలేంద్ర ఓకే అంటాడు.
Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: ఇంటికి వెళ్లిపోతానన్న మహేంద్ర – కాలేజీకి వెళ్లిన రిషి, వసుధార
ఏంజెల్ - రిషి
కాలేజీలో రిషిని చూసి ఏంజెల్ ఎమోషనల్ అవుతుంది. నువ్వు చనిపోయావని వార్తల్లో న్యూస్ చూడగానే నా గుండె ఆగినంత పనైంది. వసుధార మాత్రం నువ్వు బతికే ఉన్నావని నమ్మంది. ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో...ఇప్పుడు నిన్ను మళ్లీ చూసిన తర్వాతే నాకు కొండంత ధైర్యం వచ్చింది.
రిషితో ఏంజెల్ మాట్లాడటం చూసిన శైలేంద్ర...తాను ఏంజెల్ ఫొటో చూపించకుండానే నిజంగానే పరిచయం ఉన్నవాడిలా ఎలా మాట్లాడుతున్నాడని కంగారు పడతాడు. రంగాలా తన ముందు నటిస్తున్నది నిజంగానే రిషినా అనే అనుమానం శైలేంద్రలో మొదలవుతుంది. ఏంజెల్‌తో రిషి ఏం మాట్లాడుతున్నాడో వినాలని దాక్కుంటాడు. అది గమనించిన రిషి..ఈ అమ్మాయి ఎవరో బెస్ట్ ఫ్రెండ్ అని చనువుగా మాట్లాడుతూ ప్రాణాలు తీస్తోందని, నేను ఎలాగోలా మ్యానేజ్ చేస్తున్నానని...ఈమె గురించి ఎందుకు చెప్పలేదని శైలేంద్రకి మెసేజ్ చేస్తాడు..హమ్మయ్య అనుకుంటాడు శైలేంద్ర. వాళ్ల మధ్యకి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర..మను ఎక్కడ అని అడుగుతాడు. మా బావ నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పి..రిషిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఏంజెల్ - వసుధార
రిషిని తిరిగి తీసుకొచ్చిన వసుధారని ఏంజెల్ తెగ పొగడేస్తుంది. రిషితో పాటు నా ప్రాణం వెనక్కి తెచ్చుకున్నాను, రిషి లేకపోతే ఈ వసుధార లేనట్టేనని ఎమోషనల్ అవుతుంది. . మను ఎందుకు కాలేజీకి రావడం లేదని ఏంజెల్‌ను అడుగుతుంది వసుధార. ఏమైందో తెలియదు కానీ మహేంద్ర దగ్గర నుంచి వెళ్లిపోవడంతో పాటూ అనుపమ కాలేజీకి కూడా రావడం లేదంటుంది ఏంజెల్. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వసుధార అనుమానపడుతుంది. తన తండ్రి ఎవరో మనుకి ఇప్పటికీ తెలియలేదని ఏంజెల్ చెప్పచంతో ..తాను రాసిన లెటర్ చదవలేదని అర్థమవుతుంది. ఆ విషయం చెప్పాలని వసుధార అనుకుంటుంది. కానీ మను ఆమె మాట వినడు...తండ్రి గురించి తాను చెప్పే వరకు ఎవరిని అడగొద్దని అనుపమ తన దగ్గర మాట తీసుకుందనే నిజం బయటపెడతాడు. కాలేజీకి ఎందుకు రావడం లేదని అడిగితే మీరు, రిషి వచ్చారు కదా ఆ టాపిక్ వదిలేయండి అనేస్తాడు.
శైలేంద్ర సంబరం
రేపో మాపో తాను ఎండీని కాబోతున్నట్లు సంబరపడిపోతాడు శైలేంద్ర . తననే ఎండీ అని రంగా ప్రకటించడం ఖాయమని తల్లితో చెబుతాడు. రంగా నిజంగానే నీ పేరు చెబుతాడా అంటూ అనుమానపడుతుంది దేవయాని. వాడు మనం చెప్పినట్టే చెబుతాడు అంటాడు శైలేంద్ర. వీలైనంత తొందరగా పని పూర్తిచేసి రంగాను ఊరు పంపించమని దేవయాని అంటే..మన రహస్యాలు బయటపడతాయి అందుకే వాడిని తిరిగిరానిలోకాలకు పంపిస్తానంటాడు. పని పూర్తైన వెంటనే వాడిని చంపేస్తానని క్లారిటీ ఇస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ధరణి..ఏం మాట్లాడుకుంటున్నారని నిలదీస్తుంది...
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది... గుప్పెడంత మనసు ఆగష్టు 09 ఎపిసోడ్ లో కాలేజీ ఎండీగా ఎవర్ని ప్రకటిస్తారో చూడాలి....