ఆటోలో ఇంటికి వెళ్తూ... హోటల్ నుంచి సాక్షి కారులో ఇంటికి వెళ్లిపోయిన సంఘటన గురించి వసుధార ఆలోచిస్తుంటుంది. అసలు రిషి సార్ సాక్షితో వెళ్తే నాకెందుకు బాధగా ఉందని అనుకుంటుంది. రిషి సార్‌కు సాక్షి అంటే నచ్చదు... రిషి సార్‌కు సాక్షి తగదు... ఇంత తెలిసిన నేను ఆయన మనసు తెలుసుకోలేకపోయానా అనుకుంటుంది. రిషి సార్ ప్రేమ కాదన్నందుకు నాకే బాధగా ఉందని అంటుంది. 


రోడ్డు పక్కనే యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతంలో ఆటో ఆపుతుంది. వెళ్లి చూస్తే రిషీ సార్ రోడ్డు పక్కనే పడి ఉంటాడు. ఒక్కసారిగా షాక్ తింటుంది వసుధార. అతన్ని తాను వెళ్తున్న ఆటోలనే రిషి ఆసుపత్రికి తీసుకెళ్తుంది వసుధార. అక్కడ చికిత్స చేసి ఇంటికి తీసుకెళ్తుంది. వెళ్తున్నంత సేపు కంగారుతోనే ఉంటుంది. 


ఇవేమీ తెలియని మహేంద్ర, జగతి.. రిషి ఎక్కడకు వెళ్లాడో అని ఆరా తీస్తుంటారు. ఇంతలో  మహేంద్రకు వసుధార ఫోన్ చేస్తుంది. త్వరగా బయటకు రమ్మని చెబుతుంది. రిషిని ఆ పరిస్థితిలో చూసి ఫ్యామిలీ మెంబర్స్‌  షాక్ అవుతారు. 
ఆటోవాడికి డబ్బులు ఇచ్చి వచ్చేసరికి అంతా రిషిని లోపలికి చికిత్స చేయిస్తుంటారు. ఇంతలో విషయం దేవయానికి తెలుస్తోంది. అదే టైంలో వసుధార ఇంట్లోకి వస్తుంటుంది. వసుధారను గుమ్మం ముందే నిలబెట్టేసి నిలదీస్తుంది. 


ఇంట్లోకి వస్తున్న వసుధారను లోపలికి రానియ్యదు దేవయాని. లోపలికి వెళ్లి సరికొత్త డ్రామ మొదలు పెడతావా... నీవెంటో నీ బతుకేంటో నాకు తెలుసు అంటుంది. నేను రిషి సార్‌ను చూడాలి... ఆయన పెద్ద దెబ్బ తగిలింది అంటుంది వసుధార. అసలు రిషీకి యాక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతుంది దేవయాని. నడుచుకుంటూ వెళ్తుంటే జరిగిందని చెబుతుంది వసుధార. కారులో తిరగాల్సిన రిషి కాలి నడకన వెళ్లేలా చేసిందెవరు అని ప్రశ్నిస్తుంది దేవయాని. నాకేం తెలుసు మేడం అంటుంది వసుధార. అసలు రిషి మనసు పాడవడానికి, ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే అంటుంది దేవయానికి. ఆ మాటకు షాక్ అవుతుంది వసుధార. నేను కారణమేంటి మేడం అని అడుగుతుంది. వసుధార చేతిలో డబ్బులు పెట్టి.. ఆటోలో వచ్చావుగా క్యాబ్‌లో వెళ్లిపో... అలాగనే రిషి జీవితం నుంచి  కూడా వెళ్లిపో అంటుంది దేవయాని. నువ్వు, నీ మేడం ఎంత తెలివైన వాళ్లో... ఎంతకు తెగిస్తో నాకు తెలుసు... ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు లేదని అంటుంది దేవయాని. ఎన్ని తిట్టిన పడతాను కానీ రిషిని చూసి వెళ్తానంటుంది వసుధార. ఒక్క అడుగు కూడా లోపిలికి పెట్టనంటుంది దేవయాని. ఇన్నాళ్లు రిషి మంచితనంతో నీ ఆటలు సాగాయి... ఇకపై అలా జరగదని వార్నింగ్ ఇస్తుంది. మర్యాదగా బయటకు పో అంటుంది లేకుంటే గెంటించేస్తానంటుంది. దేవయానిక మాటలకు బాధతో వసుధార వెళ్లిపోతుంది. 


రిషికి చికిత్స చేస్తుంటారు. ఇంతలో అక్కడు హడావిడిగా వచ్చిన దేవయాని బాధ పడినట్టు కలరింగ్ ఇస్తుంటుంది. ఆమెను చూసి అంతా మొహాలు చూసుకుంటారు. ఇంతలో డాక్టర్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి ఎవరో కానీ టైంకు తీసుకొచ్చిందంటాడు. కాస్త ఫీవర్ వస్తుందని దగ్గరుండి చూసుకోమంటాడు డాక్టర్. ఫణీంద్ర మాట్లాడుతూ... రిషిని జగతి, మహేంద్రని చూసుకోమంటాడు. బలవతంగా దేవయానిని బయటకు తీసుకెళ్లిపోతాడు. 


రిషి ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు మహేంద్రకు ఫోన్ చేస్తుంది వసుధార. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బాధ పడుతుంది. రిషి సార్ ఎలా ఉన్నారో ఆయన పరిస్థితి తెలిసేది ఎలా అనుకుంటుంది. ఇప్పుడు ఆయన అలా ఉంటే నేనేమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది వసుధార. 


ఇక్కడ రిషిని అలా బెడ్‌పై చూసి కన్నీరు పెట్టుకుంటుంది జగతి. ఆయన్ని టచ్ చేద్దామనుకున్న టైంలో డాడ్‌ అని కలవరిస్తాడు. ఏంటి నాన్న నీకు ఈ బాధ... ఆ బాధలో నాకు భాగస్వామిగా ఉన్నానా... ఇన్నాళ్లూ మనసులో మాట చెప్పలేదని బాధ పడ్డానని.. ఇప్పుడు చెప్పాక కూడా బాధ పడుతున్నానని అనుకుంటుంది జగతి. 


కాస్త మెలకువలోకి వచ్చిన రిషి దాహం అంటాడు. నీళ్లు తాగిస్తుంది జగతి. డాడ్‌.. డాడ్ అని పిలుస్తుంటాడు రిషి. అప్పుడే వచ్చిన మహేంద్ర రిషితో మాట్లాడతాడు. నాన్న రిషీ ఇక్కడే ఉన్నాను అంటాడు. నీకేం కాదు... మేం ఉన్నాం కదా అంటాడు. అలా పక్కనే ఉన్న మహేంద్రను చూసి పడుకుండిపోతాడు రిషి. 


రిషికి యాక్సిడెంట్‌ అయిన సంగతి సాక్షికి చేరవేస్తుంది దేవయాని. ఈ అవకాశాన్ని అనుకూలంగా వినియోగించుకోవాలని సజెస్ట్ చేస్తుంది. వెంటనే ఇంటికి వచ్చేయమంటుంది. దానికి సాక్షి కూడా సరే అన్నట్టు తలాడిస్తుంది. ఫోన్ కట్‌ చేసిన తర్వాత... మీరు ఎలా చెప్తే అలా కాదు ఆంటీ... నేను చేసేది నేను చేస్తాను అంటుంది. ఇక్కడ దేవయాని కూడా నేను చెప్పినట్టు వింటుంది సాక్షి అని అనుకుంటుంది.  చెప్పింది చెప్పినట్టు వినేవాళ్లు అంటే నాకు చాలా ఇష్టమంటుంది. 


అమ్మవారి వద్ద పూజ చేసి కుంకుమ తీసుకొస్తుంది వసుధార. రిషి సార్‌ను త్వరగా కోలుకునేలా చేయమంటుంది. 


రేపటి భాగం
అమ్మవారి వద్ద బొట్టను రిషికి పెట్టాలని మరోసారి రిషి ఇంటికి వస్తుంది. ద్వారం వద్దే ఉన్న దేవయాని వసుధారను లోపలికి వెళ్లనివ్వదు. ఎంత వేడుకున్నా కనికరించదు. ఏం చేయాలో అర్థం కాక తిరిగి వెళ్లిపోతుంది వసుధార. ఇంతలో పై నుంచి చూస్తాడు రిషి. ఇంతలో రిషి పిలిచినట్టు అనిపించి పైకి చూస్తుంది.