Guppedanta Manasu Serial Today Episode: కాలేజీలో నేను కళ్లు తిరిగిపడిపోవడం చూసి కొందరు స్టూడెంట్స్ ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారు.. అంటూ నువ్వు రిషిని తీసుకురావడం చాలా హ్యాపీగా ఉందని శైలేంద్ర, వసుధారకు చెప్తాడు. తర్వాత రిషి, వసుధారలను తీసుకొని తన ఇంటికి వెళ్లిపోతానని మహేంద్ర అంటాడు. అందుకు ఫణీంద్ర, దేవయాని ఒప్పుకోరు. తమ ఇంట్లోనే వారిని ఉండాలని పట్టుబడతారు.
మహేంద్ర: చాలా రోజుల తర్వాత వసుధార, రిషి మళ్లీ కలుసుకున్నారు. వాళ్లకు ప్రైవసీ ఇవ్వడానికైనా మా ఇంటికి వెళ్లిపోవడం కరెక్ట్ కదా అన్నయ్యా.
ఫణీంద్ర: అదేంటి మహేంద్ర అంత మాటన్నావు. వాళ్లకు ఇక్కడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు.
మహేంద్ర: అది కాదు అన్నయ్యా.. వాళ్లు అక్కడ ఉండటమే బెటర్ అనిపిస్తుంది. అన్ని విధాలా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉంటాము అన్నయ్య.
అని చెప్పగానే ముక్తసరిగానే ఫణీంద్ర సరే అంటారు. తర్వాత డిన్నర్ చేయడానికి వసుధార, రిషిని పిలుస్తుంది. అయితే శైలేంద్రను చూసిన రిషి వసుధారతో వెళ్లడానికి ఇష్టం లేన్నట్లుగా నటిస్తాడు. రిషి, వసుధారలను చూసిన మహేంద్ర ఎమోషనల్ గా ఫీలవుతాడు.
మహేంద్ర: మమ్మల్ని వదిలిపెట్టి దూరంగా ఎలా వెళ్లావు... అసలు మమ్మల్ని వదిలిపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది. వసుధార నీ కోసం ఎంత పరితపించిందో తెలుసా? ఎంత బాధ అనుభవించిందో తెలుసా?
శైలేంద్ర: అవును వసుధార.. రిషి అడ్రెస్ నువ్వు ఎలా కనిపెట్టావు.?
వసుధార: రిషి సార్ అడ్రస్ నేను కనిపెట్టలేదు. కాలేజీని గవర్నెమెంట్ హ్యండోవర్ చేసుకుంటుందని తెలిసి ఆపడానికి నేను ఇక్కడికి వచ్చాను అదే టైంలో రిషి సార్ కూడా నాకు మన కాలేజీ గేటు దగ్గరే కనిపించారు.
అని వసుధార అబద్ధం చెబుతుంది. నిజమని శైలేంద్ర నమ్ముతాడు. తర్వాత వసుధారను చంపానని తనకు అబద్దం చెప్పాడని శైలేంద్ర చెంపలు వాయిస్తుంది దేవయాని.
శైలేంద్ర: వసుధారను చంపానని ఆ పాండు గాడు నాకు అబద్ధం చెప్పాడు మామ్.
దేవయాని: శైలేంద్ర నువ్వు చేసిన తప్పు వల్లే ఇప్పుడు మనం చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాం. రంగాను రిషిగా నాటకం ఆడటానికి తీసుకొచ్చామని వసుధార కనిపెడితే మన పరిస్థితి ఏంటి?
శైలేంద్ర: మామ్ వసుధారకు భయపడాల్సిన పనిలేదు. మన ప్లాన్ ఫెయిలైతే నేనైనా చచ్చిపోతా...అవసరమైతే ఆ కుటుంబం మొత్తాన్ని లేపేస్తాను.
అనడంతో దేవయాని, శైలేంద్రను తిడుతుంది. వట్టి మాటలు చెప్పడం కాదు. ఒక్క పని సరిగ్గా చేయడం చేతకాదు అంటూ నిట్టూరుస్తుంది. అందరూ భోజనం చేస్తుంటే రిషి పక్కనే కూర్చుటుంది వసుధార. అయితే వసుధార కారణంగా తాను ఇబ్బంది పడుతున్నట్లు రిషి నటిస్తాడు. అదే నాటకాన్ని కంటిన్యూ చేయమని శైలేంద్ర, రిషికి సైగ చేస్తుంటాడు. ఇంతలో రిషికి వాటర్ తాగిస్తుంది వసుధార. దీంతో దేవయానిలో మరింత టెన్షన్ మొదలవుతుంది.
దేవయాని: ఎన్నో తెలివితేటలు ఉన్న వసుధార రంగాను ఎందుకు గుర్తుపట్టలేకపోతుంది. నిజంగా వాడు రిషి అయితే మనకు మూడినట్లే.
ఫణీంద్ర: దేవయాని.. ఏంటా గుసగుసలు భోజనం చేయడానికి వచ్చారా? మీరు మాట్లాడుకోవడానికి వచ్చారా?
శైలేంద్ర: అదీ డాడ్.. చాలా రోజుల తర్వాత రంగా మన ఇంటికి వచ్చాడు కదా?
ఫణీంద్ర: ఓరేయ్ శైలేంద్ర నీకు మైండ్ దొబ్బిందా? రంగా ఎవర్రా?
శైలేంద్ర: అదీ రిషి అనబోయి.. రంగా అన్నాను డాడ్. డాడ్ ఇక మనందరం కలిసే ఉందాం.. బాబాయ్, తమ్ముడు, వసుధార ఇక్కడే ఉంటే బాగుంటుంది.
అని శైలేంద్ర చెప్పగానే రిషి కూడా సరే అందరం కలిసి ఇక్కడే ఉందామని మహేంద్రకు చెప్తాడు. వసుధార మాత్రం వద్దని ఇక్కడ తాను ఉండలేనని మన ఇంటికి వెళ్లిపోదామని చెబుతుంది. దీంతో మహేంద్ర కూడా వసుధార మా ఇంటి దీపమని, ఆమె ఏం చెబితే అలాగే చేస్తానని అంటాడు. తర్వాత చందమామలో తనకు జగతి అత్తయ్య కనిపిస్తుందని వసుధార, రిషితో చెప్తుంది. అయితే నాకు కూడా జగతిని చూపించమని మహేంద్ర వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.