Guppedanta Manasu Serial Today Episode: మహేంద్ర కోపంగా ఎందుకు మనును విసిగిస్తున్నావు అంటూ శైలేంద్రను తిడతాడు. తన తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే అంతమాత్రాన నువ్వు తనని అంటూ.. నేను కావాలని అనలేదు అంటూ మనును అంటాడు. దీంతో మను కోపంగా లోపం కాదు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మహేంద్ర కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకుని నిన్నేం చేసినా తప్పు లేదురా? అనగానే పిల్లలు తప్పు చేసి ఒకరిమీద ఒకరు తప్పు నెట్టుకున్నట్లు మీరు నా మీద తప్పు నెడుతున్నారేంటి. ఇది కరెక్టు కాదు బాబాయ్. నేను మామూలుగానే తన తండ్రి ఎవరు అని అడిగాను? మీరే దాన్ని ఒక లోపంలా క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ లోపం అంటే ఎంటీ బాబాయ్ అని అడుగుతాడు శైలేంద్ర. దీంతో నీతో పెట్టుకున్న.. బురదలో రాయి వేసినా ఒక్కటే అని వెళ్లిపోతారు. మరోవైపు మను ఒక దగ్గరకు వెళ్లి బాధపడతాడు. శైలైంద్ర అడిగిన ప్రశ్నలు గుర్తుకువచ్చి ఏడుస్తాడు. ఆకాశం వైపు చూస్తూ అసలు నా తండ్రి ఎవరు అని గట్టిగా అరుస్తాడు. మరోవైపు ఇంటికి వచ్చిన శైలేంద్ర సంతోషంగా దేవయానిని పిలుస్తాడు.
దేవయాని: ఏమైంది నాన్న..
శైలేంద్ర: సక్సెస్ మమ్మీ నీ ప్లాన్ సక్సెస్. ఇవాళ నాకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత హ్యాపీగా ఉంది. ఎండీ సీటు నాకు దొరికినంత సంతోషంగా ఉంది. నేను తండ్రి మాట ఎత్తగానే వాడు ఆవేశంతో రెచ్చిపోయాడు. కోపంగా గాజు గ్లాసు పగులగొట్టాడు. ఇన్నాళ్లు వాడు నాకు చేసిన దానికి కరెక్టు రివేంజ్ అనిపించింది. తర్వాత వాడి చాంబర్ లోకి వెళ్లి.. మళ్లీ వాళ్ల నాన్న టాఫిక్ తీసుకొచ్చి టార్చర్ పెట్టాను. బాబాయ్‌ని రెచ్చగొట్టి వాడినే వేలెత్తి చూపేలా చేశాను. మనకు వాడి వీక్‌నెస్ దొరికింది మమ్మీ.
ధరణి: వీక్‌నెస్సా.. ఎంటా వీక్‌నెస్.. చెప్పండి. బలానికి ఏదైనా టానిక్ వాడుదురు కానీ
శైలేంద్ర: ధరణి నాకు ఏ వీక్ నెసులు లేవు. నేను చాలా బలంగా ఉన్నాను.
ధరణి: ఎందుకండి అలా చెప్తారు. మీకు ఎండీ కుర్చి అనే వీక్‌నెస్ ఉందిగా..?
అని ధరణి అనగానే అది పవర్, అంటూ శైలేంద్ర చెప్తాడు. దేవయాని ధరణిని తిట్టి అక్కడి నుంచి వెళ్లగొడుతుంది. మరోవైపు మహేంద్ర, వసుధార బాధపడుతుంటారు.
వసు: ఎందుకు మామయ్యా మరీ అంత గిల్టీగా ఫీలవుతున్నారు.
మహేంద్ర: గిల్టీగా ఫీలవ్వక మరేం చేయమంటావు అమ్మ. నేనేమైనా చిన్న మాట అన్నానా చాలా హర్ట్ అయ్యే మాట అన్నాను. ఇదంతా ఆ శైలేంద్ర గాడి వల్ల జరిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా..!
వసు: మామయ్యా బాధపడకండి మను గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏ సిచ్చుయేషన్‌లో అలా అనాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటారు.
అనగానే ఇలాంటి సిచ్యుయేషన్ మళ్లీ మళ్లీ రాకుండా మనం ఈ సమస్యను పరిష్కరించాలి అంటాడు మహేంద్ర. అనుపమకే నిజం తెలుసు కాబట్టి ఇప్పుడే వెళ్లి అనును అడుగుతాను అంటూ మహేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన మనుకు వాళ్ల బామ్మ కట్టు కడుతుంది. మొరిగే ప్రతి కుక్కకు రాయి విసిరితే మన జీవితం అక్కడే ఆగిపోతుంది నాన్న అంటూ చెప్తుంది. దీంతో వాళ్లు నన్ను ఎన్ని అన్నా నేను పట్టించుకునేవాడిని కాదు కానీ వాళ్లు నా తండ్రి గురించి అడుగుతున్నారు. కనీసం నీ తండ్రి పేరు తెలియదా? అంటూ అవమానిస్తున్నారు అంటూ మను బాధపడతాడు. మరోవైపు దేవయాని, అనుపమకు ఫోన్ చేసి కాలేజీలో జరిగిన విషయం చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: యాంకర్ సుమ మంచి మనసు - 100 పడకల వృద్ధాశ్రమం నిర్మాణం, అండగా ఉంటానంటూ హామీ!