గుప్పెడంతమనసు మే 13 ఎపిసోడ్
జీవితంలో ఒక్కసారి జరిగే యంగేజ్ మెంట్ ని భయంభయంగా చేసుకోవడం ఇష్టంలేదంటుంది వసుధార. రిషి గురించి ఆలోచించు మళ్లీ గొడవలు వస్తే ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది అందుకో ఆలోచించు నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నా అని చెప్పు అని జగతి చెబుతుంది. అక్కడి నుంచి రిషి రూమ్ కి వెళుతుంది వసుధార. సార్ అని పిలిచినా రిషిలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వెనుకనుంచి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది
రిషి: ఎందుకు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేయాలి అనుకున్నావు...
వసు: మీకోసం సార్
రిషి: నిజం చెప్పు వసుధారా..ఏం జరిగింది..ఏదైనా ప్రాబ్లెమా..ఏ సమస్యా లేకపోతే ఏడుపెందుకు.. నీ కన్నీళ్లలో ఏదో భయం, ఆందోళన కనిపిస్తున్నాయని
వసు: ఏం లేదు మాట దాటివేస్తుంది. మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాతే ఎంగేజ్‌మెంట్ జరిగితే బాగుటుందని, మన బంధం మీ లక్ష్యానికి అడ్డుకాకూడదనే ఎంగేజ్‌మెంట్ వద్దన్నాను
రిషి:నాకు కాలేజీ ఎంత ముఖ్యమో నువ్వు అంతే ముఖ్యం..మన ప్రేమ అంతే ముఖ్యం. ఏవోవో కారణాలతో మన మధ్య దూరం మళ్లీ పెరగడం ఇష్టం లేదు. ప్రేమను నిలబెట్టుకోవడానికి గెలిపించుకోవడానికి చాలా కష్టపడ్డాం, చాలా పోరాటం చేశాం..చివరి దశలో మళ్లీ మనం దూరం కావొద్దు.
వసుధార ఎమోషనల్ అవుతుంది
Also Read: ఆంజనేయుడి జన్మరహస్యం గురించి ఏ పురాణంలో ఏముంది!
దేవయాని
మరోవైపు రిషి, వసుధారల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిపించాలని దేవయాని హడావిడి చేస్తుంటుంది. నువ్వు చేస్తున్నంతా చూస్తుంటే ఆనందంగా ఉంది అంటాడు ఫణీంద్ర. ఆ తర్వాత ధరణి దగ్గరకు వెళ్లి ఫంక్షన్ కి ఏఏం కావాలో చేయాలనే జ్ఞానం లేదా అని విరుచుకుపడుతుంది. జగతి ఎక్కడుందో ఆరాతీసి కావాలనే జగతిని తిడుతుంది. జగతితో కలసి పూలు గుచ్చు అని ధరణికి చెబుతుంది.
రిషి-వసుధార
వసుధారను తన గదిలోకి తీసుకొచ్చిన రిషి చీరను బహుమతిగా ఇస్తాడు. రిషి సంతోషంగా గిఫ్ట్ ఇచ్చినా వసుధార ముఖంలో ఆనందం మాత్రం కనిపించదు. చాలా డల్‌గా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని రిషి అనడంతో తెచ్చిపెట్టుకుని నవ్వుతుంది.
జగతి--ధరణి
చిన్నత్తయ్యా ఈ సమయంలో మీరే ఎక్కువ సంతోషంగా ఉండాలి కదా అని ధరణి అంటే..అదేం లేదు అనేస్తుంది జగతి. ఇంతలో వసుధార బయటకు రావడంతో ఇంకా పడుకోలేదా అని జగతి అడిగితే.. రిషి సార్ శారీ ఇచ్చారని చెబుతుంది. నేను కూడా పూలు గుచ్చుతా అని వసుధార అంటే నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అని చెబుతారు జగతి-ధరణి. ప్లీజ్ మేడం అనేసి అక్కడే కూర్చుంటుంది వసుధార. గతంలో పూలు గుచ్చినప్పుడు రిషితో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది...సార్ హాల్లో మేడం,ధరణి పూలు గుచ్చుతున్నారు మనిద్దరం కలసి పూలమాల గుచ్చాలన్నది నా కోరిక అని రిషికి మెసేజ్ చేస్తుంది..
శైలేంద్ర-దేవయాని
నువ్వు ఏం చేసినా నా సంతోషం కోసమే అని నాకు తెలుసు అని దేవయాని అంటే...ఈ శుభకార్యం జరిపించడం వెనుక రీజన్ మనల్ని అందలం ఎక్కిస్తుంది..వాళ్ల పతనానికి నాంది పలుకుతుందంటాడు శైలేంద్ర. ప్రతి జన్మలో నువ్వే నా కొడుకుగా పుట్టాలి నాన్న అంటుంది దేవయాని. మన టార్గెట్ కోం కొత్త ప్లాన్ అమలు చేస్తున్నానంటూ దేవయానికి సీక్రెట్ గా చెబుతాడు శైలేంద్ర..అంతా విన్న దేవయాని ముఖం వెలిగిపోతుంది. ఈ ప్లాన్ లో మనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్లని అడ్డుతప్పించి అయినా అమలుచేయాలంటాడు శైలేంద్ర
Also Read: నిశ్చితార్థం వద్దన్న వసు - ఆవేశంతో ఊగిపోయిన రిషి , శైలేంద్ర నెక్ట్స్ స్టెప్ ఏంటి!
రిషి-వసు
జగతి, ధరణిలతో కలిసి వసుధార పువ్వులు గుచ్చుతుంటుంది. అక్కడికి రిషి వస్తాడు.. ధరణి, జగతి పని ఉన్నట్లుగా కిచెన్‌లోకి వెళ్లిపోతారు. రిషి, వసుధార కలిసి ఆ పూలు గుచ్చుతుంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని వాళ్ల ఆనందాన్ని చెడగొడుతుంది.
శైలేంద్ర-రిషి
శైలేంద్ర పిలవడంతో రిషి తన రూమ్ కి వెళతాడు.రిషితో కాలక్షేపం చేస్తూ సంబరపడుతున్నావా అంత సంబరం వద్దు నీ ఆనందం ఆవిరైపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది దేవయాని. ఆ తర్వాత రిషికి కొన్ని పేపర్స్ ఇచ్చిన శైలేంద్ర వాటిపై సంతకాలు కావాలని అంటాడు. రిషి వాటిని చదవకుండానే సంతకం పెట్టడానికి రెడీ అవుతాడు...ఇంతలోనే అక్కడకు వచ్చి న జగతి వాటిలో ఏముందో చెక్ చేసుకోకుండా సంతకం పెట్టొద్దని అంటుంది. అన్నయ్యపై నాకు నమ్మకం ఉందని రిషి అనడంతో ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది కదా అని జగతి అంటుంది. స్పందించిన శైలేంద్ర నీకు నాపై నమ్మకం ఉంది కానీ పిన్నికి నాపై నమ్మకం ఉండాలని లేదు కదా ఓసారి చెక్ చేయి రిషి ప్లీజ్ అంటాడు శైలేంద్ర. అంతా చూసిన రిషి.. బాగానే ఉందంటాడు. మీరు ప్రతి విషయానికి ఎందుకు కంగారుపడుతున్నారు, మనవాళ్లపై కూడా డౌట్ పడుతున్నారు మీరిలా ప్రవర్తించడం బాలేదు అనేసి సంతకం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.
శైలంద్ర-జగతి
జగతి కూడా వెళ్లిపోతుండగా ఆపిన శైలేంద్ర..కంగారు పడ్డావా , భయపడ్డావా..చూడు పేపర్లపై దొంగసంతకాలు పెట్టే చీప్ ట్రిక్స్ ప్లే చేయను అంటాడు శైలేంద్ర. అన్ని రోజులూ నీవే అనుకోవద్దు ఏదో ఒక రోజు ముగింపు వస్తుంది చూడు అంటుంది జగతి. నీ కొడుకుతో ఎండీ సీట్ కి ముగింపు పలికేలా చేయాలని శైలేంద్ర అంటే అది జరగని పని అంటుంది జగతి. రేపు జరగబోయే నిశ్చితార్థంలో ఎలాంటి పరిణామాల ఎదురవుతాయో నేను చెప్పలేను..నీ కొడుకును ఎలా కాపాడుకోవాలో తీరిగ్గా ఆలోచించుకో అని శైలేంద్ అంటే..నాకు బాగా తెలుసు అంటుంది జగతి. నిద్రలేచిన తర్వాత కూడా జగతి డల్ గా కూర్చుని ఉంటుంది. నా కొడుకు నిశ్చితార్థం రోజుకూడా భయంభయంగా ఉండాల్సి వస్తోంది వాళ్లు ఏం ప్రమాదం తలపెడతారో అని భయంగా ఉంది అనుకుంటుంది.