Vasudhara re-entry as Madhu: వసుధార రీ ఎంట్రీ: చిన్ని సీరియల్‌లో మధుమితగా వసుధార! ఈ మార్పు అందుకేనా!
Vasudhara re-entry as Madhumita చిన్ని సీరియల్‌లో మధుమితగా గుప్పెడంత మనసు సీరియల్ వసుధార ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Vasudhara re-entry as Madhumita in Chinni serial గుప్పెడంత మనసు సీరియల్‌ని జనం విపరీతంగా మెచ్చి గుండెల్లో పెట్టుకొని ఆధరించారు. సీరియల్ అయిపోగానే రిషి, వసులను చాలా మిస్ అయిన ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పేశారు మా టీవీ టీమ్. రేపటి నుంచి వసుధార మళ్లీ అభిమానులకు కనువిందు చేయనుంది. చిన్ని సీరియల్‌లో చిన్ని అలియాస్ మధుమితగా వసుధార ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని మా టీవీ టీమ్ విడుదల చేసింది.
చిన్ని సీరియల్లో ప్రస్తుతం మధు కిడ్నాప్ మిస్టరీ నడుస్తుంది. దాదాపు నాలుగు రోజులు నుంచి ఇదే కథ జరుగుతుంది. మధునే చిన్ని అని తెలుసుకున్న దేవా.. మధుని కిడ్నాప్ చేయించడానికి తన మనుషుల్ని పంపడం.. వాళ్లు చెత్త సేకరించే బండిలో వచ్చి మధుని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. దేవా మధుని కలవడానికి వెళ్లినప్పుడు వాళ్లు కిడ్నాప్ చేసింది మధుని కాదని తెలుస్తుంది. మధుని దేవా కిడ్నాప్ చేయలేదు.. నాగవల్లి చేయలేదు.. మరి మధు ఏమైనట్లు అని ఇప్పటికే ప్రేక్షకులకు ఇదో చిక్కు ముడిగా మారింది. ఈ టైంలోనే పాత మధు స్థానంలో గుప్పెడంత మధు రీ ఎంట్రీ ఇస్తుంది. దీంతో సీరియల్ మీద ఇంకా ఆసక్తి పెరిగింది.
చిన్ని సీరియల్‌లో మెయిన్ నటుల్ని ఎప్పటికప్పుడు మార్చుతూనే ఉన్నారు. చిన్నిని పెద్దయిన తర్వాత మధుగా పరిచయం చేసినప్పుడు కన్నడ నటి కావ్య భగవత్‌ని పరిచయం చేశారు. అప్పట్లో నాగవల్లి స్థానంలో నటించిన నయనను తీసేసి రజిని ప్రవీణ్‌ని పరిచయం చేశారు. తర్వాత శ్రేయ క్యారెక్టర్‌ని కూడా మార్చేశారు.. ఆ తర్వాత మెయిన్ రోల్లో నటించిన కావ్య భగవత్‌ని మార్చేసి స్మృతీ కశ్యప్‌ని పెట్టారు. ఇక ఇప్పుడు ఈమెను రీప్లేస్ చేయడానికి గుప్పెడంత మనసు వసుధార ఎంట్రీ ఇవ్వనుంది. స్మృతిని రీప్లేస్ చేయడానికి తన ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావొచ్చు. గత కొన్ని ఎపిసోడ్స్‌ని చూస్తే ఆమె నడుమునకు సంబంధించి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందని అర్థమవుతుంది. షూటింగ్లో సైతం నడుమునకు బెల్ట్ పెట్టుకొని చాలా సార్లు కనిపించేది..ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా స్మృతి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అందుకేనేమో సీరియల్‌లో ఆమెను పూర్తిగా చూపించేవాళ్లు కాదు. ఆమె ఈ సీరియల్‌లో తప్పుకోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చు. అందుకే ఆమె స్థానంలో రక్ష గౌడ్‌ని రీ ప్లేస్ చేశారు.
చిన్ని సీరియల్ చూసే అందరికీ మొదట్లో చిన్ని క్యారెక్టర్‌లో కావేరి, బాలరాజుల కూతురిగా ఆ రేంజ్‌లో ఉండాలని అనుకున్న అందరికీ మొదటి రెండు క్యారెక్టర్లు కాస్త నిరాశ పరిచాయి అనే చెప్పొచ్చు. ఎప్పుడైతే గుప్పెడంత మనసు వసు ఎంట్రీ ఇవ్వనుందని తెలిసిందో అప్పటి నుంచి సీరియల్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెరిగాయి. గుప్పెడంత మనసులోనే యాటిట్యూడ్తో ఓ ఆట ఆడుకున్న రక్షాగౌడ్.. ఇప్పుడు మధుమితగా దేవా, నాగవల్లికి చుక్కలు చూపిస్తుందని అందరూ అనుకుంటారు. ఇక సీరియల్ విషయానికి వస్తే చిన్ని లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగింది అంటే మ్యాడీ ఆంజనేయ స్వామి ముందు నన్ను అంతగా ప్రేమించిన మధు ఎక్కడుందో అని బాధ పడతాడు. అప్పుడే మధుగా వసుధార తన ముఖానికి ఉన్న ముసుగు తీసి చూస్తుంది. ఎవరు నన్ను ఇక్కడ పెట్టింది అని చూస్తుంది. మధు మిస్సింగ్ మిస్టరీని ఛేదించడానికి బిగ్ బాస్ బ్యూటీ యష్మీగౌడ పోలీస్ అధికారిణి సత్యభామ ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి వసుధార రీ ఎంట్రీతో సాయంత్రం 6 గంటలకు వస్తున్న చిన్ని సీరియల్ క్రేజ్ మరింత పెరుగుతుందనే చెప్పొచ్చు.























