అన్వేషించండి

Gundenininda Gudigantalu Today May26th: పార్లలమ్మ పన్ను పీకించేసిన శ్రుతి, మనోజ్ కి షాక్ ఇచ్చిన మలేషియా దంపతులు - గుండెనిండా గుడిగంటలు మే 26 ఎపిసోడ్

Gundenininda Gudigantalu Serial:మలేషియా దంపతులు ఇంటికి రావడంతో రోహిణిలో టెన్షన్ మొదలవుతుంది. తప్పించుకునేందుకు హాస్పిటల్ కి వెళ్లి ఇరుక్కుపోతుంది. గుండెనిండా గుడిగంటలు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu May 26 Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు మే 26 ఎపిసోడ్

మలేషియా నుంచి వచ్చిన దంపతులను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసుకుంటాడు బాలు. వంట చేయమని మీనాకు చెబుతాడు. మీనా ఆ ఏర్పాట్లలో ఉండగా ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. ఏయ్ ఏం చేస్తున్నావ్ అంటూ ఫైర్ అవుతుంది. రవికి కాల్ చేయండి..తన హోటల్ పక్కనే హాస్పిటల్ ఉంది చెక్ చేయిస్తాడు అని కౌంటర్ ఇస్తుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ అనగానే..మరి చూస్తూనే అడుగుతున్నారేంటి? ఇక్కడ మీనా ఇన్ని కూరగాయలు కట్ చేస్తుంటే మీరు కామాక్షి ఆంటీ ఇంట్లో కందిపప్పు డబ్బాలో డబ్బులు దాచుతున్నారా అని సెటైర్ వేస్తుంది. అవును మీ ఆయన నాకు లక్షలు ఇచ్చాడు దాచుకుంటున్నా అంటుంది... మా ఆయన లక్షలు సంపాదించినా ఇంటికి మాత్రం తీసుకురానివ్వను..ఇక్కడ దాచేవారు కన్నా మింగేవారే ఎక్కువ అని మరో సెటైర్ వేస్తుంది. 

కోపంగా సత్యం రూమ్ కి వెళ్లిన ప్రభావతి..దారినపోయేవాళ్లకి భోజనాలు పెట్టడం ఏంటి అంటుంది. అథిధులకు భోజనం పెడితేనే ఆ ఇంటికి మంచిది..నీకు ఎలాగూ చేతకాదు, మా అమ్మ అయితే ఇంటికి ఎవరు వచ్చినా అది కూడా జంటగా వస్తే ఆది దంపతులు వస్తున్నారు అనేది అని గుర్తుచేస్తాడు. బాలు నాకు కాల్ చేసి చెప్పాడు..అమ్మా మీనా నువ్వు వంట చేయి అంటాడు సత్యం. సరే అని వెళుతుంది మీనా. వాళ్లు వస్తున్నది మలేషియా నుంచి అని చెబుతాడు సత్యం.

రోహిణి వచ్చి ఏం చేస్తున్నారు అంటుంది.. ఇంటికి ఎవరో వస్తున్నారట భోజనానికి అంటుంది శ్రుతి. ఇదేదో బావుంది.. బాలు కారెక్కినవాళ్లకు ఇంట్లో భోజనం ఫ్రీ అనే ఆఫర్ బావుందన్నమాట అంటుంది. మీ ఆయన లక్షలు మింగితే బావుందా అని శ్రుతి కౌంటర్ ఇస్తుంది. వంటకు వాడుతున్న సరుకులన్నీ మా ఆయన కొనిచ్చాడు.. దారినపోయే దానయ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని మీనా ఇచ్చిపడేస్తుంది. కోపంగా వెళ్లిపోతుంది రోహిణి.  

రవి ఇంటికి రావడంతో.. ఏంట్రా ఈ సమయంలో వచ్చావ్ అని సత్యం అడుగుతాడు. ఈ రోజు ఇంట్లో వదిన స్పెషల్స్ చేస్తోంది అందుకే వచ్చాను అంటాడు. ఇంతోటి వంటలు ఎవ్వరూ వండలేరా అని ప్రభావతి అంటే.. మెచ్చుకోవడానికి మంచి మనసు ఉండాలిలే అని సెటైర్ వేస్తాడు సత్యం. ఇంతలో మలేషియా జంట ఇంట్లోకి వస్తారు. ప్రభావతి అసహనం వ్యక్తం చేస్తుంది కానీ బాలు అవేమీ పట్టించుకోడు. ఇంతలో శ్రుతి మలేషియా గురించి మాట్లాడగానే ప్రభావతి టోన్ మారిపోతుంది. తన పెద్ద కోడలు కూడా మలేషియా నుంచి వచ్చిందంటూ గొప్పలు చెబుతుంది ప్రభావతి. దంపతులు మరిన్ని వివరాలు అడగడంతో ప్రభావతి ఇబ్బంది పడుతుంది. శ్రుతి ట్విన్ టవర్స్ అనగానే..మరిన్ని ప్రశ్నలు వేస్తారంతా. వెంటనే రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.. ప్రభావతి పిలిచేందుకు ప్రయత్నించినా తనకు పంటి నొప్పి అని నోట్లో కాటన్ పెట్టుకుని కూర్చుంటుంది. హాస్పిటల్ కి వెళ్లమని అందరూ చెప్పడంతో నెమ్మదిగా జారుకుంటుంది. రోహిణి ప్రవర్తన శ్రుతి, బాలు, మీనాకు అనుమానం కలిగిస్తుంది.  

ఇంట్లోంచి తప్పించుకునేందుకు హాస్పిటల్ కి వెళ్లిన రోహిణితో శ్రుతి కూడా వెళుతుంది. పంటి నొప్పి లేదంటూ అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ పంటి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదంటూ దగ్గరుండి పన్ను పీకించేస్తుంది.  

పెళ్లి రోజు కానుకగా మలేషియా దంపతులకు బట్టలు అందిస్తారు సత్యం ప్రభావతి. ఇలాంటి కోడలు ప్రతి ఇంట్లోనూ ఉంటే బావుండుందని మీనాను పొగుడుతారు. ప్రభావతి కక్కలేక మింగలేక ఆగిపోతుంది. ఇంతలో మనోజ్ ఎంట్రీ ఇస్తాడు..ప్రభావతి తనను మలేషియా అల్లుడిగా పరిచయం చేస్తుంది. తాను బిజినెస్ మ్యాన్ ని అని పరిచయం చేసుకుంటాడు. ఎవరికి వారు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోరు అని చురకలు వేస్తారు.  

గుండెనిండా గుడిగంటలు ఈ వారం ( May 25 to May 29) వరకూ జరగబోయే కథ ఇదే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today June 18th: కార్తీకదీపం 2 సీరియల్: తెల్ల డ్రస్స్.. పాల గ్లాస్‌.. సూరజ్, జ్యోత్స్న మధ్య ఏం జరుగుతుంది? కొట్లాట నిజం కాదా!
కార్తీకదీపం 2 సీరియల్: తెల్ల డ్రస్స్.. పాల గ్లాస్‌.. సూరజ్, జ్యోత్స్న మధ్య ఏం జరుగుతుంది? కొట్లాట నిజం కాదా!
Gundenininda Gudigantalu Serial Today June 18: ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today June 18th: నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
Nuvvu leka Neanu Lenu Serial Today June 18th:నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను: నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget