అన్వేషించండి

Gundenininda Gudigantalu Serial Today June 04: బాలుకి కొత్త శత్రువు, పోలీస్ స్టేషన్లో చెంపదెబ్బలు తిన్న మనోజ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 04 ఎపిసోడ్

Gundenininda Gudigantalu Today: మలేషియా ప్రయాణం ఆపేసిన ఆనందంలో ఉన్న రోహిణికి మరో షాక్ ఇచ్చింది విద్య. మరోవైపు ప్రభావతిని మీనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది చింతామణి.ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోహిణి తన తండ్రి ఫోటోతో వచ్చి శోకించినా ఆస్తి ప్రస్తావన.
  • ఆసుపత్రిలో వృద్ధ దంపతుల వద్ద బాలుకు తన ఫోన్ దొరికింది.
  • రోహిణి ఆదేశాలతో విద్య ఫోన్ పడేసిందని బాలుకు తెలిసింది.
  • శివ వీడియో కోసమే రోహిణి అదంతా చేసిందని విద్య బయటపెట్టింది.

Gunde Ninda Gudi Gantalu June 4 Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు జూన్ 4 ఎపిసోడ్

గుండెనిండా గుడిగంటలు గడిచిన ఎపిసోడ్ లో... ఇంకా మీనా కాఫీ ఇవ్వలేదంటూ చిటపటలాడుతుంటుంది ప్రభావతి. ఇంతలో తండ్రి ఫొటో పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది రోహిణి. ఏడుపు తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటుంది.. గుండెనిండా గుడిగంటలు జూన్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

ఏంటి రోహిణి అది అని ప్రభావతి అడిగితే..నాకు మిగిలిన జ్ఞాపకం అంటూ సినిమా స్టైల్లో డైలాగ్స్ ఏవేవో చెబుతుంది. ఇది మా నాన్న ఫొటో అని చూపిస్తుంది. ఏడుపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు బాధపడి ఏం లాభం..జాగ్రత్తపడండి, తొందరపడండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరూ నన్ను పట్టించుకోలేదు అంటుంది ప్రభావతి. ఇప్పుడు తన తండ్రిని పోగొట్టుకుని రోహిణి ఏడుస్తుంటే ఆస్తుల ప్రస్తావన అవసరమా అని కోప్పడతాడు సత్యం. అవును మావయ్యా..మా నాన్నకు కొడుకైనా కూతురైనా నేనే...అందుకే మిగిలిన కార్యం పూర్తిచేయాలని ఫొటో తీసుకొచ్చాను అంటుంది. సరే కానివ్వు ఏం చేస్తాం..ఈ మూలంగా అయినా కోర్టులో కేసు త్వరగా తేలాలని ఆయన్ను కోరుకో అని మరోసారి బుద్ధి చూపిస్తుంది ప్రభావతి.

హాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలు ఆ ఫొటో చూసి ఎవరీయన పార్లలమ్మా అని అడుగుతాడు. మా నాన్న అని సమాధానం చెబుతుంది రోహిణి. మలేషియాలో ఉండే వ్యక్తి, పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి? ఇలా ఉన్నాడేంటి మిషన్ కుట్టుకునేవాడిలా అని సెటైర్ వేస్తాడు బాలు, మా పూలకొట్టు పక్కన కొబ్బరికాయలు అమ్మేవ్యక్తిక అన్నయ్య అంటే నమ్మేస్తారు అంటుంది మీనా. అన్నయ్యగారు బతికి ఉంటే నా కొడుకు కోటీశ్వరుడు అయ్యేవాడు అంటుంది ప్రభావతి. అవాక్కైన రోహిణి.. నేను బాధలో ఉంటే నీకు ఆటలుగా ఉందా అని ఫైర్ అవుతుంది. ఉన్నమాటే అన్నాను అంటాడు బాలు. మా నాన్న మలేషియా వెళ్లకముందు తీయించుకున్న ఫొటో ఇది...అక్కడకు వెళ్లిన తర్వాత దిగిన ఫొటోస్ ఏవీ నా దగ్గర లేవంటుంది రోహిణి.  బాధలో ఉందికదా బాలు..వదిలెయ్ అని తండ్రి చెప్పడంతో సరే అంటాడు బాలు. 

నాకు అర్జెంటుగా రక్తం కావాలి అంటాడు బాలు..అంతా షాక్ అవుతారు. తాగడానికి కాదు.. వేరేవాళ్లకి అవసరం అంటాడు బాలు. మనోజ్ అమ్మో నేనివ్వను అంటాడు. నా బ్లడ్ గ్రూప్ అదికాదు అందుకే అడుగుతున్నా అంటాడు బాలు. కాసేపు డ్రామా నడుస్తుంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి బాలుని అరెస్ట్ చేస్తున్నాం అంటారు. ఏం జరిగిందని సత్యం అడిగితే.. రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకుంటున్న ముసలివాళ్లపై పోలీస్ దౌర్జన్యం చేసినందుకు అడ్డుకున్నా అందుకే ఆ పోలీస్ కావాలనే నన్ను ఇరికిస్తున్నాడు అంటాడు బాలు.  రోహిణి వాళ్లనాన్నని కామెంట్ చేశావ్ కదా..నీకు మంచి పనే అయింది, అయినా నీకు జైలు కొత్తేం కాదుకదా అంటుంది ప్రభావతి.  ఏం మంచిపని అయింది? నా భర్త తప్పుచేయలేదు, ఓ ముసలి దంపతులకు అండగా నిలిచాడు, గుడిముందు అడుక్కోలేదు, తప్పుచేయలేదని ఇచ్చిపడేస్తుంది మీనా.

ఏదైనా ఉంటే స్టేషన్ కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి బాలుని తీసుకెళ్లిపోతారు. నేను వస్తానంటుంది మీనా. నేను వస్తానంటాడు సత్యం..మేం కూడా వస్తాం అంటారు రవి,శ్రుతి.  అక్కడ జరిగింది చూశాను కాబట్టి నేను కూడా వస్తానంటుంది మీనా. నువ్వు వెళ్లిపోతే వంట ఎవరు చేస్తారంటుంది ప్రభావతి. కొడుకును పోలీసులు తీసుకెళ్తుంటే బాధపడాల్సింది పోయి...ఇలా మాట్లాడుతారా? బయటి నుంచి వచ్చినదాన్ని నాకే కడుపు తరుక్కుపోతోంది..మీరు నిజంగా మా ఆయన్ని కన్న తల్లేనా , సవతి తల్లి కూడా ఇలాంటి టైమ్ లో మింగడం గురించి ఆలోచించదు , ఆకలితో మాడండి అంటుంది మీనా. నేను చూసుకుంటాలే మీనా అని ధైర్యం చెబుతాడు బాలు. రోజూ అన్నమే పెట్టింది...ఈ రోజు నీకు గడ్డి పెట్టింది..మంచి పని చేసిందని మండిపడతాడు సత్యం.  నీకు తిండి ఎలా సహిస్తోందని రవి అంటే... అయ్యో ఆవిడను అనొద్దు... కోట్లు పోగొట్టుకున్నా అనే బాధలో ఉంది..ఆవిడకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటుంది శ్రుతి. 

నీకు అంత ధైర్యం ఉంటే ఇక్కడ చూపించు అంటాడు ఆ పోలీస్... నేను తప్పు కనిపిస్తే ఎవర్నైనా అడుగుతా అంటాడు బాలు. SI వచ్చాక చూసుకుందాం అంటారు పోలీసులు.  ఇంతలో మీనా కంగారుగా వస్తుంది. మీరు వచ్చాకే మీతో కలసి ఇంటికి వెళతాను అప్పటివరకూ ఇక్కడే ఉంటా అంటుంది మీనా. మనోజ్, రోహిణి కూడా పోలీస్ స్టేషన్ కు వస్తారు. డబ్బులు కొట్టేసిన విషయం గురించి మాట్లాడేందుకు వస్తారు. లోపలకు వెళ్లగానే బాలు, మీనాను చూసి నవ్వుతారు...వీరికి సెల్ లోనే రూమ్ షేరింగ్ ఫెసిలిటీ ఇస్తే బావుండును అని సెటైర్ వేస్తాడు మనోజ్. మేం అఫీషియల్ పనిపై వచ్చాం అంటుంది రోహిణి. మా స్టేటసే వేరు అంటూ బాలుని కించపరుస్తాడు. మీ అదృష్టం బావుండి బయట ఉన్నారు... లేదంటే మీరిద్దరూ సెల్ లో ఉండాల్సిన ఫ్రాడ్ లే అని ఇచ్చిపడేస్తాడు బాలు. మీరెవరు ....డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి వంట అయిందా అని అడగండి అప్పుడు చెబుతా అంటుంది మీనా. 

వీళ్లు మీకు తెలుసా అని  పోలీస్ అడగ్గానే... వీడు ఇంట్లో వాళ్లనుంచి క్యారియర్ తీసుకుని వెళ్లి పార్కులో పడుకునేవాడు, నేను గుడి దగ్గరకు వెళ్లాను అక్కడ ఈయన అని మీనా అనగానే...ఆపు అంటుంది రోహిణి. వీడు  చాలామందిని కొట్టాడు లోపల వేయడమే మంచిది అంటాడు మనోజ్. వీడిని కూడా కొట్టానంటాడు బాలు. వీడిని వారం వరకూ వదలకండి అని బిల్డప్ ఇస్తాడు మనోజ్.  నేనిచ్చిన కంప్లైంట్ సంగతి ఏమైందని అడుగుతాడు మనోజ్. మా ఆయన్ని ఒకరు మోసం చేశారంటుంది రోహిణి.  వాడు మోసం చేయలేదు... వీడే మోస పోయాడు అంటాడు బాలు. అవును...5 కోట్ల విల్లా 3 కోట్లకు ఇస్తాం అనగానే కోటి రూపాయలు కూడా లేని ఈయన అడ్వాన్స్ ఇచ్చి నిండా మునిగాడు అంటుంది మీనా. మా ఆయన్ని తమ్ముడు అని చెప్పుకునేందుకు సిగ్గుపడ్డాడు...తనని అన్నయ్య అనేందుకు సిగ్గుపడాలి అంటుంది మీనా. 

నాలాంటి బిజినెస్ మ్యాన్ ని వెయిటింగ్ లో పెడతారా...వాళ్లపని చెబుతా అంటూ బిల్డప్ ఇస్తాడు మనోజ్. కానిస్టేబుల్ చెవిలో ఏదో ఆఫర్ అంటూ చెబుతాడు..లాగిపెట్టి కొడతాడు కానిస్టేబుల్. ఎందుకు కొట్టారని రోహిణి అడిగితే మా SI కి చెబితే బూటుతో తంతారు అంటాడు. ఏమన్నాడని మరో కానిస్టేబుల్ అడిగితే..చెవిలో చెబుతాడు..వాడు కూడా వచ్చి మనోజ్ కి ఒక్కటిస్తాడు. బాలు మీనా సెటైర్స్ వేస్తుంటే  రోహిణి కోపంగా మనోజ్ ని తీసుకెళ్లిపోతుంది. ఇంతకీ ఏమన్నావ్ అని రోహిణి అడగ్గానే చెబుతుంది.. వెంటనే రోహిణి కూడా కొడుతుంది. ఈ మాట బాలుకి చెబితే నిన్ను బొందపెడతాడు అని ఫైర్ అవుతుంది. 

SI  రాగానే బాలు మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కొట్టాడని చెబుతారు అక్కడ. ఆయన చేసింది నేరమే కానీ.. అందులో తన తప్పేం లేదంటుంది. అసలేం జరిగిందో చెబుతుంది మీనా.  కోట్ల స్కామ్ చేసి ఎంచక్కా తిరుగుతున్నారు...కానీ ఏ దిక్కూలేనివారు రోడ్డుపక్కన పందిరి వేసుకుని చెప్పులు కుట్టుకుంటున్నారు..అది కూడా కూల్చేశారు పోలీసులు అంటారు బాలు. రోడ్డుపక్కన ఆక్రమించిన స్థలం ఖాళీ చేయించడం తప్పులేదు కానీ ఆవిడకు గాయం చేయడం తప్పుకాదా అని నిలదీస్తారు బాలు మీనా.  ట్రాఫిక్ పోలీస్ రావడంతో SI గట్టిగా నిలదీస్తాడు. వాళ్లు నీపై కేసు పెడితే నిన్ను సస్పెండ్ చేస్తారని తెలుసా అని అడుగుతాడు SI. నువ్వు చేసిందీ తప్పే అని బాలుపై ఫైర్ అవుతాడు.  తప్పు మావాడివైపు కూాడా ఉంది కాబట్టి వదిలేస్తున్నా అంటాడు SI.  బయటకు వెళ్లిపోతున్న బాలుని ఆపి రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తాడు ట్రాఫిక్ పోలీస్. మళ్లీ ఏదో గొడవలో ఇరికించాలని చేస్తున్నాడంటుంది మీనా. ఇంకోసారి దొరుకుతావ్ అప్పుడు చూస్తాను నీ సంగతి అంటాడు.  ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ట్రాఫిక్ పోలీస్ ని లోపలకు పిలుస్తాడు. ఇంతకీ మా మనోజ్ గాడు చెవిలో ఏం చెప్పాడని బాలు అడిగితే... చెబుతాడు కానిస్టేబుల్..షాక్ అవుతాడు బాలు...

Frequently Asked Questions

రోహిణి తన తండ్రి ఫోటోతో ఎందుకు వచ్చింది?

తన తండ్రి కార్యాలను పూర్తి చేయడానికి రోహిణి ఆ ఫోటోను తీసుకువచ్చింది. దీని ద్వారా ఆస్తికి సంబంధించిన కోర్టు కేసు త్వరగా తేలుతుందని ప్రభావతి సూచించింది.

బాలు తన ఫోన్‌ను ఎలా తిరిగి పొందాడు?

మీనా, బాలు పరామర్శించిన వృద్ధ దంపతుల దగ్గర అది దొరికింది. రోహిణి చెప్పడంతో విద్య ఆ ఫోన్‌ను చెప్పులు కుట్టేవారి దగ్గర పడేసింది.

బాలు ఫోన్ దాచిన నిజం విద్య ఎందుకు బయటపెట్టింది?

బాలు నిలదీయడంతో, రోహిణి గుణ దగ్గర అప్పు చేసిందని, ఆ అప్పు తీర్చడానికి బదులుగా శివ వీడియో కోసం ఫోన్ దాచిందని విద్య బయటపెట్టింది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
Godavari Serial Today June 18th: 'గోదావరి' సీరియల్: నమ్మిన పాపానికి స్నేహితుడి ఫ్యామిలీని నడిరోడ్డు మీదకు ఈడ్చేసిన సింహాద్రి! కలల ప్రపంచాన్ని జప్తు చేసేస్తారా!
'గోదావరి' సీరియల్: నమ్మిన పాపానికి స్నేహితుడి ఫ్యామిలీని నడిరోడ్డు మీదకు ఈడ్చేసిన సింహాద్రి! కలల ప్రపంచాన్ని జప్తు చేసేస్తారా!
Karthika Deepam 2 Serial Today June 18th: కార్తీకదీపం 2 సీరియల్: తెల్ల డ్రస్స్.. పాల గ్లాస్‌.. సూరజ్, జ్యోత్స్న మధ్య ఏం జరుగుతుంది? కొట్లాట నిజం కాదా!
కార్తీకదీపం 2 సీరియల్: తెల్ల డ్రస్స్.. పాల గ్లాస్‌.. సూరజ్, జ్యోత్స్న మధ్య ఏం జరుగుతుంది? కొట్లాట నిజం కాదా!
Gundenininda Gudigantalu Serial Today June 18: ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
Gade Saikrishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
Breaking News:ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Kids Fall Sick After Schools Reopen : స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
Embed widget