Gundeninda Gudigantalu Today ఫిబ్రవరి 20 ఎపిసోడ్: తల్లికి షాక్ ఇచ్చిన శ్రుతి! బొమ్మల కొలువులో కొత్త ట్విస్ట్ - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 20 ఎపిసోడ్
Gundeninda Gudigantalu Today ఫిబ్రవరి 20 ఎపిసోడ్: ఇంట్లో బొమ్మలకొలువు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది మీనా.. శ్రుతికి రవిపై కంప్లైంట్ చేసి చీవాట్లు తింటుంది శ్రుతి తల్లి..

Gunde Ninda Gudi Gantalu 2025 February 20 Episode: రవి-నీతూని సూపర్ మార్కెట్లో చూసిన శ్రుతి తల్లి శోభ నేరుగా డబ్బింగ్ స్టూడియోకి వెళుతుంది. సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్ కి డబ్బింగ్ చెబుతుంటుంది శ్రుతి. తల్లిని చూసి బయటకు వస్తుంది శ్రుతి. ఏం జరిగింది ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని అడిగితే.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అల్లుడుగారు నీతూ అనే వాళ్ల బాస్ తో కలసి బయట షాపింగ్ కివచ్చారు అంటుంది. నాకు ఆ విషయం ముందే తెలుసు రవి చెప్పాడు.. నువ్వు పదే పదే రవిపై కంప్లైంట్స్ ఇవ్వొద్దు. నీ పరువు పోదు..నేను ఇప్పుడు నీ ఇంటి పేరుతో లేను..నా ఇంటి పేరు మారిపోయింది మరోసారి ఇలాంటి కంప్లైంట్స్ తో వస్తే లోపలకు పంపించవద్దని బయట వాచ్ మెన్ కి చెప్పేస్తాను అంటుంది. నీకోసమే చెబుతున్నా అని శోభ అన్నాకానీ శ్రుతి గట్టిగా చెప్పేసి బయటకు పంపించేస్తుంది
ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలన్న తన ఆలోచన చెబుతుంది మీనా. అమ్మ ఒప్పుకోదు అందుకే నువ్వు వెళ్లి శ్రుతితో మాట్లాడు ఆమె ఒప్పిస్తుంది అంటాడు బాలు. మేం ఇద్దరం గొడవ ఆడుకున్నట్టు నటిస్తున్నాం కదా తెలిసిపోతుంది అంటుంది మీనా. ఆ తర్వాత రోహిణితో మాట్లాడు అనగానే..అస్సలు పనిజరగదు అంటుంది మీనా. అయితే మా నాన్నతో మాట్లాడుదాం అంటాడు బాలు. సరే అని వెళ్లి సత్యంతో మాట్లాడుతారు. మీ అమ్మను ఒప్పించడం ఎలా అని ఆలోచిస్తుండగా ప్రభావతి వస్తుంది. బొమ్మల కొలువు గురించి తెలుసుకుని ఇది గొప్పింటివాళ్లు చేసే పండుగ మనింట్లో ఎలా జరుగుతుంది అంటుంది. ఇంటికి వారసుడు రావాలంటే ఈ బొమ్మలకొలువు పెట్టించాలి అంటాడు సత్యం. ప్రబావతి పాటలు, మాటల గురించి తెగ పొగిడేస్తాడు. ఆ పొగడ్తలకు పడిపోయి సరే అంటుంది ప్రభావతి. హమ్మయ్య అనుకుంటారు సత్యం, బాలు, మీనా
మీనాక్షి దగ్గరకు వెళ్లి బొమ్మల కొలువు గురించి మాట్లాడుతుంది. మా ఇంట్లో ఎక్కడ కుదురుతుంది ప్లేస్ కావాలి అంటుంది. నేను చిట్టీలు వేసే లీలావతి ఇంట్లో పెట్టేందుకు వీలవుతుందేమో అంటుంది మీనాక్షి. బొమ్మల కొలువు పెడితే పాటలు పాడాలి అంటుంది మీనాక్షి. నన్ను పాడమని మొహమాటం పెట్టేస్తున్నారు అంటుంది ప్రభావతి. అమ్మో ఇంకా నేను బొమ్మల కొలువుకి వద్దాం అనుకున్నా ఇక అటువైపు కూడా రాను అంటుంది. మధ్యలో మీనాను తిడుతూనే బొమ్మల కొలువు గురించి మాట్లాడుతుంది ప్రభావతి. ఇంకా మీనా రాలేదేంటి ఆకలి వేస్తోంది అనుకుంటుంది ప్రభావతి.. కరెక్టుగా డోర్ తీయగానే ప్రేమ జంట కనిపిస్తారు. మీనా వాళ్లపై ఫైర్ అవుతుంది. మీనా అంటే ప్రభావతికి పడదు అనే ఉద్దేశంతో...కావాలని ఏడ్చుకుంటూ వెళుతూ ప్రభావతికి కంప్లైంట్ చేస్తారు. ఎందుకు తిట్టావ్ అని అడిగితే..వీళ్లు చనువుగా ఉన్నారని చెబుతుంది. మీరు నేర్పించిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈవిడ అపార్థం చేసుకున్నారు అని కంప్లైంట్ చేస్తారు. డాన్స్ కి దరిద్రానికి తేడా తెలియదా నాకు అంటుంది మీనా. నీకు డాన్స్ గురించి ఏం తెలుసు అంటూ ఫైర్ అవుతుంది ప్రభావతి. మీనా చెప్పేందుకు ప్రయత్నించినా ప్రభావతి వినదు. మీనాక్షి చెబుతున్నా కానీ ప్రభావతి పట్టించుకోదు. ఏదోరోజు ఇది మీ మెడకే చుట్టుకుంటుంది అప్పుడు తెలుస్తుంది అనేసి వెళ్లిపోతుంది మీనా
బొమ్మల కొలువుకి డబ్బులు మనల్ని అడిగితే ఇవ్వొద్దు అంటాడు మనోజ్. మనల్ని ఎందుకు అడుగుతారు చూద్దాంలే అనుకుంటుంది రోహిణి. చీరలు కొనేందుకు డబ్బులు కావాలి అని అడగ్గానే క్రెడిట్ కార్డ్ ఉందికదా అంటాడు. ఇంట్లో అందరి కోసం చేస్తున్న పూజ కాబట్టి అందరూ డబ్బులు ఇవ్వాల్సిందే అని బాలు అంటాడు. మనోజ్-రోహిణి దగ్గరకు వెళ్లి డబ్బుల గురించి అడుగుతాడు బాలు..ఇవ్వను అనేస్తాడు మనోజ్. పూజకు మొత్తం 15వేలు అవుతుంది నీ వాటా 5వేలు ఇవ్వాలి అంటాడు. డబ్బులు ఇవ్వకపోతే పూజలో కూర్చోవద్దు, చేసిన వంటలు తినొద్దు అంటాడు బాలు. కాంప్రమైజ్ అయిన రోహిణి ఆ డబ్బులు ఇస్తుంది. చూసి బుద్ధి తెచ్చుకోరా అనేసి వెళ్లిపోతాడు మనోజ్. రవి-శ్రుతి దగ్గరకు వెళ్లి డబ్బులు అడగ్గానే...శ్రుతి 2500 ఇస్తుంది, మిగిలినవి రవి దగ్గర తీసుకోమని చెబుతుంది. నువ్వు సూపర్ డబ్బుడమ్మ అని పొగుడుతాడు బాలు.
హాల్లో బొమ్మలు సర్దుతూ సందడిగా ఉంటారు రవి, శ్రుతి, బాలు, మీనా...ప్రభావతి రావడం చూసి గొడవపడుతున్నట్టు యాక్ట్ చేస్తారు. హమ్మయ్య వీళ్లు కలసినట్టు లేరు అనుకుంటుంది ప్రభావతి. బొమ్మల కొలువుకి సంజయ్-మౌనిక వస్తే అప్పుడుంటుంది లెక్క...
























