(Source: ECI | ABP NEWS)
Gunde Ninda Gudi Gantalu October 31 Episode: తాకట్టుకి చేపముక్కలు, బాలుకి బంగారంతో సహా దొరికేసిన ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 31 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: దొంగనోట్లు, ఫర్నిచర్ దొంగల్ని గుర్తించలేక అడ్డంగా బుక్కయ్యాడు మనోజ్. ఆ గండం నుంచి బయటపడేందుకు తిప్పలు పడుతున్నాడు...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 31 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 31st Episod
ఫర్నిచర్ పోయింది..డబ్బులు తీసుకెళ్లిపోయారు..పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నీరసంగా ఇంటికి వచ్చాడు మనోజ్. నేరుగా తల్లి ప్రభావతి దగ్గరకు వెళ్లి కాళ్లపై పడిపోయాడు. అమ్మా ఈ గండం నుంచి నువ్వు మాత్రమే కాపాడగలవు అని బతిమలాడుతాడు. నీ చదువు ఎందుకు పనికొస్తుంది? డగ్రీలు తగలబెట్టు? ఆ మీనా మెరుగు నీకన్నా కష్టపడిసంపాదిస్తోంది ఉతికి ఆరేస్తుంది. నువ్వు ఏం చేసినా పర్వాలేదు రోహిణి ముందు నా పరువు పోకూడదు అంటాడు. రోహిణికి నిజం చెప్పు అని మనోజ్ కి సలహా ఇస్తుంది ప్రభావతి. అమ్మో వద్దు..ఇప్పుడిప్పుడే నాకు మర్యాద ఇస్తోంది.. ఇలా జరిగిందని తెలిస్తే ఛీకొట్టి వెళ్లిపోతుందని బాధపడతాడు. ఇంటిపత్రాలు అడిగితే ఛీ కొడుతుంది ప్రభావతి. నగలు ఇమ్మని అడిగితే..మీనావి ఉన్నాయని చెబుతుంది ప్రభావతి. అవే ఇవ్వు..సైలెంట్ గా తాకట్టుపెట్టి డబ్బులు వచ్చాక విడిపించి తీసుకొచ్చి ఇస్తానంటాడు మనోజ్. ముందు నో చెప్పిన ప్రభావతి.. ఆతర్వాత సరే అంటుంది.
మీనా రూమ్ లోకి వెళ్లి నగలు దొంగిలించి బయటకు తీసుకొస్తుండగా సత్యం ఎదురుపడతాడు. ఏంటది అని అడిగితే.. బ్లౌజ్ కుట్టించుకుందాం అని పీస్ తీసుకుందామని వచ్చానని అబద్ధం చెబుతుంది. పెద్ద బిజినెస్ మెన్ అయిన మనోజ్ నీకు సహాయం చేస్తానన్నాడా అని డౌట్ పడతాడు సత్యం. నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రభావతి. బయటకు వస్తూనే మీనాను చూసుకోకుండా గుద్దేస్తుంది.
బాలుకి ఆరోగ్యంబాలేదని ఇంట్లోనే ఉండమని చెప్పిన మీనా..తనకోసం వండేందుకు ఫిష్ తీసుకొస్తుంది. మీనా తీసుకొచ్చిన ఫిష్ కవర్ బ్లాక్... ప్రభావతి మీనా నగలు దొంగిలించిన కవర్ బ్లాక్ ....రెండూ కిందపడతాయి. మీనాపై ఫైర్ అయిన ప్రభావతి కిందపడిన కవర్ తీసుకుని వెళ్లిపోతుంది. నేరుగా మనోజ్ కి ఇచ్చి ఎవ్వరూ చూడకుండా డబ్బులు తెచ్చుకో అని చెబుతుంది. అక్కడినుంచి జారుకుంటాడు మనోజ్. మీనా ఆ కవర్ తీసుకుని లోపలకు వచ్చేస్తుంది. మందుతెచ్చుకుంటానని అడుగుతాడు బాలు..మావయ్యకు చెబుతానంటూ ఆటపట్టిస్తుంది మీనా. ఆ తర్వాత కిచెన్లో ఆ కవర్ పెట్టేసి వంట స్టార్ట్ చేస్తుంది. చింతపండు తీసుకురావడం మర్చిపోయానంటూ బయటకు వెళుతుంది మీనా. బాలు కూడా కారు తుడుచుకునేందుకు వెళతాడు. ప్రభావతి కంగారుగా అటు ఇటు తిరుగుతూ వంటగదిలో బ్లాక్ కవర్ చూస్తుంది. సేమ్ కవర్ అనుకుంటూ వెళ్లి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. వెంటనే ఆ కవర్ తీసుకొచ్చేస్తుంది
అయితే మనోజ్ షాప్ కి వెళ్లి బంగారం తాకట్టుపెడతాను డబ్బులు కావాలని అడుగుతాడు. ఎంతకావాలని అడిగితే...నాలుగు లక్షలు అని చెబుతాడు. సరే అంటాడు సేఠ్... కవర్లో బంగారం ఉందనుకుంది కింద వంపుతాడు మనోజ్. అందులో చేపముక్కలు చూసి షాక్ అవుతాడు. ఏంటయ్యా అది అని సేఠ్ కోప్పడతాడు. కవర్ మారిపోయిందని తెలుసుకుంటాడు. సేఠ్ తో చీవాట్లు తింటాడు మనోజ్. కిచెన్లోకి వచ్చిన మీనా ...చేపల కవర్ కనిపించడం లేదని వెతుకుతుంటుంది. ప్రభావతిని అడుగుతుంది... వెనక్కి దాచేస్తుంది కవర్. పిల్లి తీసుకెళ్లిందేమో అంటుంది ప్రభావతి. ఆ తర్వాత కవర్ చూసి ఇలా ఇవ్వండి అత్తయ్యా అంటుంది. ఇది బ్లౌజ్ పీస్ ఉన్న కవరు..చేపలున్న కవర్ మనోజ్ తీసుకెళ్లిపోయాడు అంటుంది. అంతా మీనావల్లే జరిగిందంటూ క్లాస్ వేస్తుంది ప్రభావతి. ఇంతకీ మారిపోయిన కవర్లో ఏముందని అడిగితే..బ్లౌజ్ పీస్ అంట అని చెబుతుంది మీనా. నేను టైలర్ కి ఇస్తాను ఇవ్వు అని లాక్కుంటూ ఉంటాడు బాలు..ఇంతలో మనోజ్ వస్తాడు..
బంగారం కవర్ తీసుకుని షాప్ కి వెళతాడు. నువ్వు తెచ్చిన బంగారానికి 2lac వస్తుందని చెబుతాడు.. నాకు 4lac కావాలి అంటాడు మనోజ్. ఈ బంగారం అమ్మేస్తే ఇస్తాను అంటాడు. కానీ మరో ఆప్షన్ లేదని ఆలోచించి అమ్మేస్తాడు మనోజ్.
ఇంట్లో కూర, పులుసు చేస్తుంది మీనా..రవి, శ్రుతి అంతా పొగిడేస్తారు. బాలు పొగడ్తలు మొదలుపెట్టి ప్రభావతితో తిట్లు తింటాడు. నేను మనోజ్ వచ్చాక తింటాను అంటుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ వస్తాడు






















