Gunde Ninda Gudi Gantalu October 21st Episode: సత్యభామ అవతారమెత్తిన మీనా, కృష్ణుడిలా బాలు, రోహిణికి పెద్ద షాకే ఇది - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 21ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: దీపావళి రోజు సత్యం ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ అదిరిపోయాయ్. అయితే అదే సమయంలో రోహిణి బదులు మీనాను కిడ్నాప్ చేశాడు దినేష్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 21 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 21st Episod
సత్యం ఇంట్లో దీపావళి సందడి మొదలవుతుంది. సత్యం కొడుకులు , కోడళ్లకి కొత్త బట్టలు తీసుకొచ్చి ఇస్తాడు.అంతా కొత్త బట్టలు వేసుకుని వచ్చి సత్యం, ప్రభావతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత మీనా వంట చేస్తుంది. ఇంతలో మీనాకు కాల్ చేసిన విద్య.. నా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు ..దివాలీ సెలబ్రేట్ చేసుకుంటాం..పూలు కావాలని అడుగుతుంది. ఇవాళ కుదరదు అని మీనా చెప్పినా కానీ తేవాల్సిందే అని అడుగుతుంది. బాలుతో చెప్పి బయలుదేరుతుంది మీనా.
తనను కొట్టించింది, పోలీసులకు పట్టించింది కళ్యాణినే అని తెలుసుకుంటాడు ఆమె మాజీ లవర్ దినేష్. కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. కొత్త నంబర్ నుంచి కాల్ చేయడంతో..క్లైయింట్ అయి ఉండొచ్చనుకుంటుంది. లిఫ్ట్ చేయగానే ఏంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదని అడిగితే ...నిన్ను మనుషుల్ని పెట్టి కొట్టించినా బుద్ధిరాలేదా అని నోరుజారుతుంది. అంటే నా అనుమానం నిజమే అన్నమాట అంటాడు. ఇంత చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటాడు దినేష్. కోపంలో నోరు జారాను అని టెన్షన్ పడుతుంది రోహిణి ( కల్యాణి). ఇంతచేసిన నీకు ఫెనాల్టీ వేస్తున్నా అంటూ లక్షరూపాయలు వెంటనే తీసుకొచ్చి ఇవ్వు అని లొకేషన్ షేర్ చేస్తాడు. ఆడపిల్లను పీడించుకుని తినడం కన్నా అడుక్కుని తినడం మంచిది కదా అంటుంది. అయితే మీ అత్తారింట్లో జరుపుకునే ఆఖరి దీపావళి ఇదే అవుతుంది నీకు అని కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడేం చేయాలి... విద్యను కిస్తే ఏదైనా పరిష్కారం చెబుతుందని విద్య దగ్గరకు బయలుదేరుతుంది రోహిణి. ఎక్కడికి అని అడిగిన మనోజ్ పై ఫైర్ అయి వెళ్లిపోతుంది.
రోహిణి ఇంట్లోంచి బయటకు రావడం చూసి దినేష్ ఏర్పాటు చేసిన విలన్ కాల్ చేసి చెబుతాడు. రోహిణిని ఫాలో చేయమని చెబుతాడు.
శ్రుతికి కాల్ చేసిన తల్లి..పండక్కి వస్తానన్నావ్ కదా రాలేదేం అని అడుగుతుంది. అదేంటి మీకోసం మేం ఎదురుచూస్తున్నాం అంటుంది తల్లి. అందరం పండుగ ఇక్కడే చేసుకుందాం అన్నారు ఆంటీ అంకుల్.. పైగా మనింట్లో ఇద్దరే ఉంటారు బోర్..ఇక్కడ అందరం ఉంటాం సంతోషంగా ఉంటాను అంటుంది. అత్తారింట్లో హ్యాపీగా ఉన్నావ్ కదా మేంఎక్కడ గుర్తుంటాం అంటుంది. ఇప్పుడిప్పుడే ఇంట్లో గొడవలు తగ్గి.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం అంటుంది. రూమ్ గొడవ గురించి శ్రుతి చెప్పడంతో.. ఏదైనా సమస్య ఉంటే అల్లుడిగారిని తీసుకుని వచ్చెయ్.. మేడపై టెంట్ వేసుకుని పడుకోకు అని క్లాస్ వేస్తుంది. ఆ ఇంట్లో గొడవ పెట్టేందుకు మళ్లీ ఛాన్స్ దొరికింది అనుకుంటుంది శ్రుతి తల్లి శోభ
ఈ రోజు ఏలాగైనా ఆ రోహిణిని వదలకూడదు..ఆమెను తన ఫ్రెండ్ ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకురండి అంటాడు దినేష్. లక్ష రూపాయలు అడుగుతున్నాడు ఏం చేయాలో అర్థంకావడం లేదని రోహిణి బాధపడుతుంది. రోహిణిని ఫాలో అయిన వ్యక్తి..కిడ్నాప్ సంగతి వేరేవాళ్లకి అప్పగిస్తాడు. లోపల నుంచి రెడ్ శారీ కట్టుకుని వస్తుంది అదే రోహిణి అని చెబుతాడు. అప్పుడే పూలు ఇచ్చేందుకు వచ్చిన మీనా.. రోహిణిని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ అంటే.. నేనే పిలిచాను పూలు డెకరేట్ చేసేందుకు అని చెబుతుంది విద్య. అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చిన మీనాను చూసి...రెడ్ శారీ కట్టుకోవడంతో రోహిణి అనుకుని కిడ్నాప్ చేసేస్తారు. బాలుతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది మీనా.. వదలండి అని అరుపులు వినిపించడంతో బాలు కంగారుపడతాడు.






















