గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 13 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 13 Episode)

మేడపై నిద్రపోయేందుకు వెళుతున్న మీనాకు క్యాంపింగ్ టెంట్ ఇస్తుంది. ఇదెందుకు అని అడిగితే నువ్వు బాలు మేడపై నిద్రపోతా అన్నారుగా అందుకే తీసుకొచ్చానంటుంది. వర్షం రావడం లేదుకదా అని అంటుంది మీనా.. అది వర్షం వచ్చినప్పుడు వేసుకునేందుకే కాదు.. ఊరెళ్లినప్పుడు నువ్వు బాలు ఎందుకు మంచంపై గొడుగువేసుకున్నారని అడుగుతుంది. సిగ్గుపడుతుంది మీనా.. ఇదే కంటిన్యూ చేయి అంటూ టెంట్ ఇచ్చి వెళ్లిపోతుంది శ్రుతి. తర్వాత మేడపై చేరిన బాలు-మీనా..గువ్వ గోరింక ముచ్చట్లాడుకుంటారు. హాల్లో పడుకోవడం, అమ్మ విజిల్ ఊదుకుంటూ రావడం వల్ల ఎన్నో నైట్స్ వేస్ట్ అయ్యాయని బాలు గుర్తుచేసుకుంటాడు

తెల్లారేసరికి ఇంట్లో మీటింగ్ పెడతారు సత్యం, సుశీలమ్మ. మేడపై రూమ్ కట్టిస్తానని సత్యం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. మీనా బాలు కూడా మీ పెన్షన్ అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దంటారు. ఇక ఏం చేద్దాం అని ఆలోచించిన సుశీలమ్మ సలహా చెబుతుంది. అందరకీ రూమ్ కావాలి కదా అందుకే రూమ్ పెద్దవాళ్లకు వదిలేసి..మిగిలిన రెండు రూమ్స్ రొటేషన్ పద్ధతిలో వాడుకోండి అని సలహా ఇస్తుంది సుశీలమ్మ. ఒక్కోవారం ఒక్కొక్కరు హాల్లో పడుకోవాలని సలహా ఇస్తుంది. ప్రభావతి ముందు ఒప్పుకోదుకానీ సుశీలమ్మ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆగిపోతుంది. రవి శ్రుతి సరే అన్నా రోహిణి-మనోజ్ మాత్రం అయిష్టంగానే వ్యవహరిస్తారు.

రోజూలానే మీనా హాల్లో చాప వేస్తుంటుంది. శ్రుతివచ్చి ఎందుకిలా చేస్తున్నావ్.. వారం మనోజ్ రోహిణి బయటపడుకోవాలి మీరు రూమ్ లోకి వెళ్లాలని చెబుతుంది. ఎవర్నీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదంటుంది మీనా. కానీ బాలు ఒప్పుకోడు..శ్రుతి కూడా విషయంలో తగ్గొద్దు బాలు అంటుంది. మేడపైకి వెళ్లిన బాలు..గట్టిగా డోర్ కొడతాడు. రోహిణి మనోజ్ లోపల ఉంటారు కానీ డోర్ తీయరు..మేం వస్తాం నువ్వెళ్లు అంటారు. తర్వాత కిందకు వచ్చి రచ్చ చేస్తుంది రోహిణి. కానీ బాలు, శ్రుతి గట్టిగా మాట్లాడేసరికి నోరుమూసుకుంటుంది.

ఎట్టకేలకు మేడపై రొమాన్స్ రూమ్ కి చేరింది. అయితే రూమ్ లోకి వెళ్లినప్పటికీ మీనా చాప వేస్తుంటుంది..ఇదేంటి ఇక్కడ మంచం ఉందికదా ఎందుకు అంటాడు బాలు. అది మనది కాదు..వాళ్లు పడుకునేది వద్దు అంటుంది.  నేను చాపపై పడుకుంటాను మీరు మంచంపై పడుకోండి అంటుంది. నేను ఆశ పడేది నా మీనా పక్కన ప్రశాంతంగా నిద్రపోవాలని అంటాడు. చాపపై దిండు వేసుకుని పడుకుంటాడు. నీ తల నా గుండెలపై పెట్టుకో అంటాడు. బరువుగా ఉండదా అంటే..ప్రేమకు బరువు తెలియదంటాడుయ అయితే ఫ్రిజ్ లో ఉన్న పూలన్నీ తీసుకొచ్చి చుట్టనా అంటే ముద్ధబంతిలా ఉన్న నిన్ను చుట్టుకుని పడుకుంటాను అంటాడు.

మరోవైపు మనోజ్ కి ఫర్నిచర్ షాప్ టాన్ఫర్ చేసేందుకు కాస్త టైమ్ అడుగుతాడు ఓనర్. మనోజ్ ఏపనీ సరిగ్గా చేయడు సో.. నువ్వు కన్ను వేసి ఉంచు ని రోహిణి ఫ్రెండ్ హెచ్చరిస్తుంది. మనోజ్ మాత్రం సీట్లో కూర్చోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు