Gunde Ninda Gudi Gantalu February 17 Episode: రోహిణి కొత్త కుట్ర, మీనాను ప్రభావతి గెంటేస్తుందా - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 17 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: దినేష్ ని నీ జోలికి రానివ్వకుండా చేయాలంటే బాలు ఫోన్లో ఉన్న శివ దొంగతనం వీడియో కావాలని కండిషన్ పెడతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 17 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026 january 17 Episode
మీనా హాస్పిటల్ నుంచి రావడంతో సరేలే ఈరోజుకి నేను వంటచేస్తా అంటుంది ప్రభావతి. షాక్ అవుతారు బాలు, సత్యం. సరే పద నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు బాలు. కిచెన్లోకి వెళ్లిన ప్రభావతి...చీటికి మాటికి మీనాను పిలుస్తూ ఉప్పు ఎక్కడుంది , కారం ఎక్కడుంది, చింతపండు ఎక్కడుంది అంటూ పిలుస్తూనే ఉంటుంది. బాలు వెళ్లి ఫైర్ అవడంతో సైలెంట్ గా ఉండిపోతుంది ప్రభావతి
బాలు చేతిలో దెబ్బలు తిన్న గుణ పగతో రగిలిపోతాడు. ఆ శివగాడు కూడా కోపంగా నన్ను తిట్టి వెళ్లాడు..ఆ బావా బావమరిదికి స్పాట్ పెట్టాలని తన అసిస్టెంట్ తో చెబుతాడు గుణ. ఇంతలో రోహిణి వస్తుంది. గతంలో నన్ను టార్చర్ చేసినవాడు మళ్లీ బెదిరిస్తున్నాడు అంటుంది. మీరు వాడికి భయపడుతున్నారంటే ఏదో పెద్ద తప్పు చేశారు అంటాడు. అవన్నీ మీకు అనవసరం అంటుంది. మీ అత్తయ్యగారు ఎవరో డబ్బులు కొట్టేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా..ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు మీనా వాళ్ల తమ్ముడు శివ అని రోహిణికి చెప్పేస్తాడు గుణ. వాడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తయ్య వాడిపై దొంగ అనే ముద్ర వేసిందట అందుకే రివెంజ్ కోసం నిజంగా దొంగతనం చేశాడు. అందుకే బాలు వాడి చేయి విరిచేశాడు అంటాడు. మీరు చెప్పిన దినేష్ గాడి సంగతి నేను చూసుకుంటా...ఆ శివగాడు దొంగతనం చేసిన సీసీ ఫుటేజ్ నాకు కావాలి అది బాలు ఫోన్లో ఉంది అంటాడు. మీరు దినేష్ గాడి సంగతి చూడండి నేను ఆ వీడియో మీకు ఇస్తాను అంటుంది రోహిణి.
గుణతో డిస్కషన్ మొత్తం విద్యకు చెబుతుంది రోహిణి.ఆ విషయం బయటపడితే మీనాను మా అత్తయ్య ఇంట్లో ఉంచనే ఉంచదు అంటుంది రోహిణి. బాలు మీనా మంచివాళ్లు అంటావుగా ఇప్పటికైనా అర్థమవుతోందా అంటుంది రోహిణి. నేను గుణ చెప్పింది చేస్తే దినేష్ గోలతో పాటూ బాలు గోల పోతుంది అంటుంది రోహిణి. నువ్వు గమనించావా...బాలు అయినవాళ్లకోసం ఎంతదూరమైనా వెళతాడు..ఇలాంటి వాళ్లను నమ్మేకన్నా నీ గతాన్ని బాలుకి చెబితే అర్థం చేసుకుంటాడు అంటుంది విద్య. నా సీక్రెట్లు బాలుకి తెలిసాయంటే పులినోట్లో తలపెట్టినట్టే..ఇప్పటికే బాలు నాపై అనుమానంతో ఉన్నాడు..అస్సలు నా గురించి తెలియనివ్వకూడదు అంటుంది. బాలు ఫోన్లో ఉన్న వీడియో సంపాదిస్తాను అంటుంది రోహిణి.
ఇంటికి వచ్చిన శ్రుతి, రవి..మీనాను చూసి షాక్ అవుతారు. ఏంటి అన్నయ్యా నువ్వు కూడా అమ్మలా, మనోజ్ లా తయారయ్యావా అని క్లాస్ వేస్తాడు, శ్రుతి కూడా బాలుపై ఫైర్ అవుతుంది. అమ్మా తల్లీ నేను ఏమీ అనలేదు..బండిపైనుంచి పడిపోయింది అంటాడు. రెస్ట్ తీసుకో మీనా అనేసి వెళ్లిపోతారు శ్రుతి, రవి. కాసేపటి తర్వాత బాలు వచ్చి మీనాను నిద్రలేపితే.. నువ్వు ఎవరు? నేను ఎవరు? అని మాట్లాడుతుంటుంది..అమ్మో నువ్వు గతం మర్చిపోయావా? నేను నేను అని చెబుతుంటాడు బాలు. నవ్వేస్తుంది మీనా. గుణ మారుతాడనే నమ్మకం నాకుంది అంటుంది మీనా..నాకు లేదు అంటాడు బాలు. రాజేష్ విషయంలో నువ్వు చెప్పింది విననందుకు సారీ అంటాడు.
సంజూ వాళ్లింటికి తండ్రి ఫ్రెండ్ ఒకాయన వస్తారు..నా మనవడి బారసాలకి రావాలి అని పిలుస్తాడు. ఇంతలో మౌనిక వచ్చి కాఫీ ఇస్తుంది. మీ కోడలు అనుకుంటా.. సంజయ్ ఎప్పుడు వారసుడిని ఇస్తారు అని అడుగుతాడు. ఇంకా ప్లాన్ చేసుకోలేదు అంటాడు సంజయ్. ఆయన వెళ్లిపోయిన తర్వాత...సంజూ తండ్రి కొడుకుతో మాట్లాడుతూ మీకు పెళ్లై చాలా రోజులైంది కదా ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అంటాడు. మీకు తెలియనట్టు మాట్లాడుతారేంటి అంటూ సంజూ తల్లి ఎంట్రీ ఇస్తుంది. నాన్నా మీకిప్పుడు పిల్లలు ఎందుకు గుర్తొచ్చారని అంటాడు. నీ భార్యను శాశ్వతంగా ఇంట్లోంచి గెంటేసే ఐడియా వచ్చింది.. తనకు పిల్లలు పుట్టే యోగం లేదంటూ గెంటేస్తే నేను అనుకున్న కుటుంబంతో వియ్యం అందుకుంటే కోట్లు కలిసొస్తుంది అంటాడు తండ్రి. నేను చెప్పినట్టు చేయి అని ఏదో చెబుతాడు.
నేను గుడి నుంచి వస్తున్నా అత్తయ్యా..స్వామీజిని కలిసి వచ్చాను..నాకు, మనోజ్ కి బాగా కలిసొస్తుందట, మీనాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందట అంటుంది. ఇంతకీ మీనాన్న జైలు నుంచి ఎప్పుడు వస్తాడో చెప్పాడా అని బాలు సెటైర్ వేస్తాడు. అయినా ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి నమ్ముతారా అని సెటైర్ వేస్తుంది శ్రుతి.
ఈ రోజు నా చేతివంట తిన్నాక...ఇన్నాళ్లూ మీనా వంట ఎందుకు తిన్నామా అని బాధపడతాడు అనుకుంటుంది ప్రభావతి. అందర్నీ భోజనానికి పిలుస్తుంది. శ్రుతి రవి తప్పించుకుంటారు.మిగిలినవాళ్లు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తినలేక పారిపోతారు.
























