Gunde Ninda Gudi Gantalu February 13 Episode: రవి శ్రుతి మధ్య నీతూ చిచ్చు ! మీనాని నెట్టేసిన గుణని చితక్కొట్టిన బాలు - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 13 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: శివకు దూరంగా ఉండమని గుణకి వార్నింగ్ ఇస్తుంది మీనా. రవి శ్రుతి మధ్యలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 13 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026 january 13 Episode
ఫంక్షన్‌లో జరిగిన అవమానాన్ని భరించలేక తాగేందుకు మందు బాటిల్ తీసుకొచ్చి తనతో తానే ఆలోచనలో పడతాడు. ఇప్పటికైనా భార్య చెప్పిన మాట విని ఆమెకు క్షమాపణలు చెప్తే ఏమవుతుంది అంటాడు బాలు అంతరాత్మ. కోపంగా మందుబాటిల్ విసిరికొడతాడు. తెల్లారేసరికి రాజేష్ ఇంటికి వచ్చి బాలు-మీనాకు క్షమాపణలు చెబుతాడు. ఇంట్లో నా భార్య చెప్పిన మాట నేను వినలేదు, నువ్వు చెల్లెమ్మ చెప్పిన మాట వినలేదు..అందుకే ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పటికైనా నాకు బుద్ధిరాకపోతే ఎప్పటకీ బాగుపడలేను అని బాధపడతాడు. ఇదిగో చదివింపుల్లో భాగంగా వచ్చిన డబ్బులు..ఇంకా ఎంతివ్వాలో చెప్పు తీర్చేస్తాను.. ఇకపై అనవసరంగా అప్పు చేయను అని చెబుతాడు రాజేష్. చూశావా స్నేహితుడికి డబ్బులిస్తే ఏదేదో మాట్లాడావ్..ఇదిగో వెంటనే ఇచ్చేశాడు అని కవర్ చేసుకుంటాడు బాలు. మీకు చేసిన తప్పు తలకెక్కి ఉంటే...డిగ్రీల మీద డిగ్రీలు చేసేవారు కదా అని కౌంటర్ ఇస్తుంది. అప్పు తీసుకున్నదగ్గర కట్టేసి వస్తాను అనేసి బాలు వెళ్లిపోతాడు
రెస్టారెంట్ కి వచ్చిన రవికి షాక్ తగులుతుంది. రవి పనిచేసే ప్లేస్ లోకి ఓ అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. నీ ప్లేస్ లోకి నేను వచ్చానంటుంది. నన్ను తీసేశారా అని అడిగితే అవును అని చెబుతుంది. ఇక్కడ డ్రామా చేయకు వెళ్లి బాస్ తో మాట్లాడుకో అంటుంది. రవి నేరుగా మేనేజర్ దగ్గరకు వెళ్లి అడిగితే..నన్ను కూడా ఉద్యోగంలోంచి తీసేసింది అంటాడు. ఎవరామె అని అడిగితే.. నా కూతురు, ఇకపై ఈ హోటల్ బాధ్యత తనే తీసుకుంటుందని అందరకీ పరిచయం చేస్తాడు. హాయ్..నేను నీతు.. ఇకపై నన్ను బాస్ లా కాకుండా ఫ్రెండ్ లా ఉండండి అంటుంది. రవిని బేబీ అని ముద్దుముద్దుగా పిలుస్తుంది..ఇంతలో అక్కడకు వచ్చిన శ్రుతి చూసి.. అబ్బో వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందే అనుకుంటుంది. రవిని హగ్ చేసుకుని బేబీ అంటూ షాక్ ఇస్తుంది. ఇంతలో శ్రుతి వచ్చి పలకరిస్తుంది.. ఈమె ఎవరు అని నీతూ అడిగితే.. తను నా భార్య అని చెబుతాడు. అవునా నీకు ఇంకా పెళ్లికాలేదు అనుకున్నా అంటుంది. ఏదో తేడా కొడుతోంది జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది శ్రుతి.
మీనా తమ్ముడు శివ..గుణతో చేరి తాగి వస్తాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడిగితే నీ అల్లుడిలా నేనేం తాగుబోతును కాదంటాడు. ఆ మర్నాడు మీనా రావడంతో శివ పరిస్థితి బాలేదు, సావాసాలు అలవాట్లు అస్సలు బాలేవంటూ వాడు తాగివచ్చిన సంగతి మీనాకు చెబుతుంది. వాడికి ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోవడం లేదంటుంది పార్వతి. వాడు ఏదైనా ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగంలో పడి ఆ చెడు సావాసాలు మానేస్తాడులే అంటుంది మీనా. ఆ చదువు వైపే వెళ్లడం లేదంటుంది. నేను కూడా ఇంతవరకూ అలాగే అనుకున్నా...కానీ వాడు గ్రూప్ స్టడీ కోసం కాదు..గుణతో తాగి తందనాలాడుతున్నాడు అని చెబుతుంది పార్వతి. కోపంగా గుణ దగ్గరకు వెళ్లిన మీనా..నా తమ్ముడికి దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను అంటూ ఫైర్ అవుతుంది. గుణ నోటికొచ్చి మాట్లాడుతుంటే లాగిపెట్టి కొడుతుంది..గుణ కొట్టడంతో మీనా తలకు దెబ్బతగులుతుంది..అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన బాలు గుణని ఉతికి ఆరేస్తాడు
























