Gunde Ninda Gudi Gantalu February 12 Episode: బాలు క్షమాపణలు చెబుతాడా? ప్రభావతికి పెద్ద షాకే ఇది- గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: రాజేష్ కి డబ్బులిచ్చిన బాలు...షష్టిపూర్తి ఏర్పాట్లు చూసి షాక్ అవుతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026 january 12 Episode
మీనా చెప్పినా వినకుండా రాజేష్ కి లక్ష రూపాయలు అప్పుచేసి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు బాలు. అప్పు చేసి అప్పు ఇవ్వడం ఎంతవరకూ కరెక్ట్ అని అడిగినా ఈగో అడ్డొచ్చి మీనాపై ఫైర్ అవుతాడు. మధ్యలో జోక్యం చేసుకున్న ప్రభావతి ఆ గొడవను మరింత పెద్దది చేయాలని చూస్తుంది కానీ బాలు - మీనా ఆఛాన్స్ ఇవ్వరు. తెల్లారేసరికి రాజేష్ వాళ్లింటికి షష్టిపూర్తి ఫంక్షన్ కోసం బయలుదేరుతాడు బాలు. మీనా ఏదని సత్యం అడిగితే నేను ఒక్కడినే వెళతాను అంటాడు..ఇంతలో మీనా వస్తుంది. ఇద్దరూ కలసి ఫంక్షన్ వెళ్లి అక్కడ ఏర్పాట్లు చూసి షాక్ అవుతారు. లక్ష రూపాయలు అప్పిచ్చాను ఏర్పాట్లు ఏవి అని రాజేష్ భార్యని అడుగుతారు బాలు మీనా. మీ ఫ్రెండ్ నా మాట వినరు..మొక్కుబడిగా పెద్దవాళ్లకు దండలు మార్పించి కూర్చోబెట్టారు..మిగిలిన డబ్బంతా ఏం చేశారో మీరే చూడండి అని తీసుకెళ్తుంది
బాలు మీనా బయటకు వెళ్లేసరికి.. టెంట్ దగ్గర మందు, బిర్యానీతో రాజేష్ అండ్ కో చిందులేస్తుంటారు. ఏమీ మాట్లాడలేక బాలు అక్కడకు వెళ్లి అందరకీ వడ్డిస్తాడు. నీ సొమ్ము తెచ్చి పెడుతున్నట్టు ఇంత తక్కువ వడ్డిస్తావేంటి అంటూ రాజేష్ ఫ్రెండ్ ఒకడు గొడవకు దిగుతాడు. నోటికొచ్చినట్టు అంతా మాట్లాడేసరికి బాలు కూడా గొడవకు దిగుతాడు. ఏంట్రా నువ్వు చేసిన పని.. అమ్మా నాన్న షష్టిపూర్తి చేస్తానని ఏడిస్తే లక్ష రూపాయలు అప్పిచ్చాను ఇదేనా అని నిలదీస్తాడు..నిన్ను లక్ష అడిగింది ఇందుకే ఇదిగో వీటి కోసమే అని షాక్ ఇస్తాడు రాజేష్. ఇన్నాళ్లూ ఇలాంటి ఫ్రెండ్ తోనా స్నేహం చేశాను అని బాధపడతాడు బాలు. అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇంటికి చేరుకున్న బాలు మీనాని...సత్యం పలకరిస్తాడు, షష్టిపూర్తి ఎలా జరిగిందని అడుగుతాడు. అసలు విషయం చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా మాట్లాడి మీనా చురకలేస్తుంది. మీ పరువు తీస్తే నా పరువు పోయినట్టే అని ఫైనల్ గా కౌంటరిస్తుంది. డబ్బులు కనీసం రాజేష్ అన్నయ్య పిల్లల స్కూల్ ఫీజు కట్టినా బావుండేది అంటుంది.
చింటూ క్రికెట్ ఆడుతుండగా...రోహిణిని బెదిరించే దినేష్ అక్కడకు వెళతాడు. బాగా ఆడుతున్నావంటూ పొగిడి చింటూతో సెల్ఫీ తీసుకుంటాడు
ఫర్నిచర్ షోరూమ్ లో మనోజ్ కోసం పెట్టుకున్న బౌన్సర్ భారీగా తింటుంటాడు..వీడు ఈ రేంజ్ లో తింటున్నాడేంటి అంటుంది రోహిణి. వీడి తిండి చూస్తుంటే భయం వేస్తోంది ఎంత డబ్బు ఖర్చువుతుందో తెలుసా అని బాధపడిపోతాడు. నా సమస్యల నుంచి కాపాడుతాడు అనుకుంటే వాడే నాకు సమస్యగా మారేలా ఉన్నాడు అంటాడు.
ఇంతలో రోహిణి ఫోన్ కి సెల్ఫీ పంపిస్తాడు దినేష్. షాక్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తుంది... ఫొటో చూడగానే కాల్ చేస్తావని నాకు తెలుసు, నీ కొడుకు కూడా నీలానే ఉన్నాడు అంటాడు. నీకో గుడ్ న్యూస్ ఏంటంటే...నీ కొడుకు క్రికెట్ బాగా ఆడుతున్నాడు అంటాడు. నేను జైల్లో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నావ్ కదా..ఇప్పుడు బయటకు వచ్చాను...నీ భర్తకు రెండు లెటర్లు పంపింది నేనే అని చెబుతాడు. నా కొడుకుని ఏమైనా చేశావంటే అని బెదిరిస్తుంది... నేను చెప్పింది వినకపోతే నీ కొడుకును తీసుకెళ్లిపోతాను అని బెదిరిస్తాడు. నీకేం కావాలి అని రోహిణి అడిగితే..ఓ లొకేషన్ పంపిస్తాను రా అని కాల్ కట్ చేస్తాడుయ
బాలు ఇంకా అదే గొడవ గురించి, రాజేష్ తీరు గురించి , మీనాతో వాదనను గుర్తుచేసుకుంటాడు. మీనా ఎంత చెప్పినా వినకుండా డబ్బులిచ్చి తప్పుచేశానని తనలో తానే బాధపడతాడు. బాలు లోపలి నుంచి మరో బాలు ప్రత్యక్షమై భార్య ముందు తప్పు ఒప్పుకుంటే తప్పా అని ప్రశ్నిస్తాడు. భార్య చెప్పింది వింటే ఏమైంది ఇప్పుడు చూడు లక్ష పోయింది.. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పు అని అంటాడు. బాలు ఆలోచనలో పడతాడు.
























