అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu February 11 Episode:రోహిణి మోసం, విద్య నాటకం! తప్పు తెలుసుకున్నబాలు మీనాకు క్షమాపణలు చెబుతాడా? - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 11 ఎపిసోడ్!

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ కి డబ్బులిచ్చిన బాలు...షష్టిపూర్తి ఏర్పాట్లు చూసి షాక్ అవుతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 11 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2026  january  11 Episode

రోహిణి తన ఫ్రెండ్ పేరు చెప్పి లక్ష రూపాయలు మనోజ్ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఇంతలో విద్య ఏడుస్తూ వస్తుంది. మా అమ్మను హాస్పిటల్లో చేర్పించాం, 75వేలు ఖర్చవుతుందని ఏడుస్తుంది. పాపం రోహిణి మనం సాయం చేద్దాం అంటాడు మనోజ్. తనకి అప్పుగా ఇద్దాం అయితే వడ్డీ తీసుకుందాం అని క్లారిటీఇస్తాడు. విద్యకు ఆ డబ్బు ఇస్తుంది రోహిణి. బయటకు రాగానే గట్టిగా నవ్వుకుంటారు విద్య-రోహిణి. భలే నటించావ్..ఎక్కడ దొరికిపోతావో అనుకున్నా అంటుంది. నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ బాగా వర్కౌట్ అయింది..రాత్రంతా ప్రాక్టీస్ చేశాను అంటుంది. ఈ లక్ష రూపాయలు ఇంటి ఓనర్ కి ఇస్తాను, 75 వేల రూపాయలు చింటూ స్కూల్ ఫీజు కట్టు అంటుంది. చింటూ ఊర్లో ఉన్నప్పుడే నీకు సమస్యలు వచ్చాయ్..ఇప్పుడు ఇక్కడకు తీసుకొస్తున్నావ్ ఇంకెన్ని సమస్యలు వస్తాయో అంటుంది విద్య

బాలు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే రాజేష్ వద్దంటాడు. ఏం జరిగిందని అడిగితే నిజం చెబుతాడు రాజేష్. ఇవి మా ఇంటి నుంచి తెచ్చినవి కాదు..ఫైనాన్షియర్ నుంచి తీసుకొచ్చాను అంటాడు. ఈ డబ్బులు తీసుకోపోతే బావోదని చెబుతాడు. రాజేష్ డబ్బులు తీసుకుంటాడు. కోపంగా ఇంటికి వెళ్లిన మీనాతో గొడవపడతాడు. ఎందుకు టాక్సీ స్టాండ్ కి వెళ్లావని అడుగుతాడు. నా భర్త దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పావా అని నిలదీస్తాడు. ఎవరో ఘనంగా ఖర్చు చేశారని మీరు చేయొద్దని చెప్పాను అంటుంది. నన్ను చవటను చేద్దాం అనుకుంటున్నావా? పూలమ్ముకునేవాళ్ల ఇంటికి వెళ్లి ఫంక్షన్లు చేయొద్దని చెప్పానా అంటాడు బాలు. నేను ఆ డబ్బులు తీసుకెళ్లి ఇస్తే మీరు అడగొచ్చు అంటుంది. నువ్వు పూలమ్ముకునే డబ్బులు సంపాదించావా అనగానే.. నా సంపాదన ఎంత? మొత్తం మీ కష్టం తగలేస్తున్నారని బాధ అంటుంది. ఏం చెప్పినా కానీ బాలు మాత్రం నా ఫ్రెండ్స్ కి సలహా ఇచ్చే అవసరం లేదంటాడు. అప్పు చేసి అప్పు ఇచ్చాను అంటాడు. నువ్వు పూలమ్మే డబ్బులు మాత్రం ఇవ్వను అంటాడు. 

మీనా బాలు గొడవను చాటుగా విని సంబరపడే ప్రభావతి ఇదే అవకాశంగా ఎంట్రీ ఇస్తుంది. వీధెక్కి అరుస్తున్నావ్ ఎందుకు అని అడుగుతుంది. మీరు ఇల్లు వదిలి వీధుల్లో ఎందుకు తిరుగుతున్నారు అంటుంది. మీరే చెప్పండి అంటుంది మీనా. ఈమెను ఇన్వాల్వ్ అవనివ్వకు అంటాడు బాలు. దీన్ని నువ్వు నెత్తిన పెట్టుకుని ఊరేగడం వల్లే ఇది నెత్తిపై నాట్యం చేస్తోంది అంటుంది ప్రభావతి. మీ దగ్గరే నేర్చుకున్నా నాట్యం అంటుంది. ప్రభావతి-మీనా మధ్య పోటాపోటీ చర్చ జరుగుతుంది. వాడు డబ్బులు వాడిష్టం నీకెందుకు అంటుంది...నన్ను అనే అవకాశం కోసం మీరు ఎదురుచూస్తున్నారా అంటుంది. అనవసరంగా ఆర్భాటాలకు పోయేవారికి ఇవ్వడం తప్పు అనేసి కోపంగా వెళ్లిపోతుంది మీనా. ఇద్దరం గొడవపడి పైనుంచి దూకితే కానీ నీ కడుపు చల్లారదా అనేసి వెళ్లిపోతాడు బాలు
 
షష్టిపూర్తికి వెళుతున్నా అని బాలు అంటే..మీనా ఏది అంటాడు. ఒక్కడినే వెళుతున్నా అనగానే శుభకార్యాలకు జంటగా వెళ్లాలి అంటాడు. మీనా వచ్చి..నేను సిద్ధంగా ఉన్నా అంటుంది. నేను సహాయం చేయడం వల్ల ఓ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో చూద్దువుగానివి రా అంటాడు..నేనూ అందుకే వస్తున్నా అంటుంది మీనా.  వెళ్లి చూసేసరికి అక్కడ చాలా సాధారణంగా ఉంటుంది. అదేంటి రాజేష్ ఏర్పాట్లు చేయలేదా అని అడిగితే.. రాజేశ్ భార్య కన్నీళ్లతో సమాధానం చెబుతుంది. నామ మాత్రానికి దండలు మార్పించి రూమ్ లో కూర్చోబెట్టారని చెబుతుంది రాజేష్ భార్య. అక్కడ రాజేష్ ప్రెండ్స్   తాగి తందానాలు ఆడుతున్న తీరు చూసి షాక్ అవుతాడు బాలు. అవమానాలు ఎదుర్కొని ఇంటికి వచ్చి ఆలోచనలో పడతాడు. 


   

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget