అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu May 22 Episode: బాలు మీనాకి రోహిణి వార్నింగ్, గుణతో డీల్ సెట్ చేసుకున్న పార్లలమ్మ - గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్!

Gunde Ninda Gudi Gantalu May 22 Episode: విల్లా విజయ్ ని పట్టుకుని ఇంటికి చేరుకున్న బాలు మీనాకు అవమానం ఎదురవుతుంది. గుణ ఎంట్రీతో సీరియల్ కీలక మలుపు తిరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మనోజ్, రోహిణిలపై ప్రభావతి కోపం, మీనా వంట చేయలేదని విమర్శ.
  • బాలు, మీనా 30 లక్షల డబ్బుల విషయంలో రోహిణిపై అనుమానం వ్యక్తం చేశారు.
  • విద్య గిరిని అపార్థం చేసుకుని కొట్టి, తర్వాత క్షమాపణ కోరింది.
  • వీడియో లీక్, 30 లక్షల రికవరీ కోసం గుణ ప్రవేశంతో కథనం మలుపు తిరిగింది.

Gunde Ninda Gudi Gantalu May 22 Episode Telugu Serial -  గుండెనిండా గుడిగంటలు మే 22ఎపిసోడ్

గుండెనిండా గుడిగంటలు మే 21 ఎపిసోడ్ లో విల్లా విజయ్ ని పట్టుకుంటారు బాలు, మీనా. ఇంతలో మనోజ్ కాల్ చేసి 30 రూపాయలకోసం గొడవపడడంతో.. 30 లక్షలు మింగేసిన వ్యక్తి తప్పించుకుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్ లో ఇంటికి చేరుకున్న మనోజ్, రోహిణిపై ఫైర్ అవుతుంది ప్రభావతి. మరోవైపు ఇప్పటికీ వంట చేయలేదంటూ ప్రభావతి మీనాపై విరుచుకుపడుతుంది. ఇంతలో బాలు, మీనా ఇంటికి చేరుకుంటారు. వంట చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావ్ అని కోప్పడుతుంది. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లున్నారు..కనీసం వంట గదివైపు తొంగిచూడడం లేదన్నమాట..ఇవాళ ఆలస్యం అవుతుందని ముందుగానే వంట చేసి వెళ్లాను..ఇప్పటివరకూ ఆకలితో ఉన్నారు కానీ కనీసం వంట చేసిపెట్టిన విషయం కూడా గమనించలేదన్నమాట అంటుంది. మీరు మాకోసం తిరగాల్సిన అవసరం లేదు, ఆ డబ్బుల సంగతి మేం చూసుకుంటాం అంటుంది రోహిణి. ఏంటి నాన్నా..ఈ 30 లక్షలు కూడా మింగేద్దామని పార్లలమ్మ ప్లాన్ చేస్తున్నట్టుంది అంటాడు బాలు. వాళ్లే చూసుకుంటాం అన్నారుకదా మనకెందుకు అంటుంది మీనా.  మనం ఎలా వెతుకుతాం అని మనోజ్ అంటే.. అందుకోసం నేను వేరే మనిషిని పెట్టానులే అంటుంది. 

అపార్థం చేసుకుని కొట్టినందుకు బాలు ఫ్రెండ్ సోదరుడు గిరికి క్షమాపణలు చెబుతుంది విద్య. తనని చూసి పారిపోతుండగా వెనుకే వెళ్లిమరీ SOrry చెబుతుంది. వెళ్లిపోతుండగా విద్య చున్నీ బండిలో ఇరుక్కుంటుంది..అది తీసి ఇవ్వబోతాడు..విద్య వెనక్కు తిరిగేసరికి ఆ వ్యక్తిచేతిలో చున్నీ ఉండడంతో నువ్వు ఇలాంటివాడివి అని తెలియక సారీ చెప్పానంటూ మళ్లీ కొడుతుంది. అదేంటి ఈమె కనిపించిన ప్రతిసారీ కొట్టిపోతోంది అనుకుంటాడు.

మీనా వంటింట్లో పనిచేస్తుంటే వెళ్లిన బాలు.. మనకెందుకు ఇలా జరుగుతోంది అంటాడు. మనం  తప్పు చేయలేదు, ఇందులో మనకొచ్చే లాభం లేదు. అయినా రోహిణి వాళ్లను వెతకొద్దు అని గొడవచేసింది అంటుంది మీనా. ఆ కల్పన మింగేసినట్టు ఈ డబ్బులు కూడా దాచేద్దామని ప్లాన్ చేస్తోందేమో అంటాడు బాలు. నాక్కూడా ఇదే నిజం అనిపిస్తోంది అంటుంది మీనా.  

గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన గుప్పెడంత మనసు, బ్రహ్మముడి కిరణ్ కాంత్!

ఇంటికి చేరుకున్న విద్య..తన చున్నీకి ఆయిల్ మరకలు అంటుకోవడం గమనిస్తుంది. అంటే మళ్లీ గిరిని అపార్థం చేసుకున్నా అన్నమాట అని బాధపడుతుంది. మళ్లీ ఎలాగైనా కలసి క్షమించమని అడగాలి అనుకుంటుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్లుంటారా అనుకుంటుంది. గిరి గురించి ఆలోచించి విద్య ముసిముసినవ్వులు నవ్వుకుంటుంటే.. రోహిణి ఏంటే పిలిస్తే పలకకుండా రొమాంటిక్ మూడ్ లో ఉన్నావ్ అంటుంది.  30 లక్షల మోసం కేసులో ఓ క్లూ దొరికింది అంటుంది రోహిణి. సీసీ ఫుటేజ్ దొరికితే వాళ్లను పట్టుకోవచ్చు అంటుంది. బాలు మీనా వెతికితే..డబ్బులు మాకు రావు, డీలర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేం అందుకే వాళ్లని వెతకొద్దని వార్నింగ్ ఇచ్చానంటుంది. రోహిణి మాటల్లో స్వార్థం గమనించిన విద్య ఇందులో నేను ఇన్వాల్వ్ అవను అని చెప్పేస్తుంది. విద్య నో చెప్పడంతో గుణ సహాయం తీసుకోవాలి అనుకుంటుంది రోహిణి. 

బాలు తన బావమరిది శివను కలిసి నా ఫోన్లో ఉన్న వీడియో ఎలా లీకైందో అర్థంకావడం లేదనే సందేహాన్ని బయటపెడతాడు. మనకు - గుణకు మధ్య ఏదో లింక్ ఉందంటాడు. గుణ స్నేహితులతో కాంటాక్ట్ లోకి వెళితే వారికి వీడియో లీక్ చేసిందెవరో తెలుస్తుందంటాడుయ ఈ ప్లాన్ పై మీనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ బాలు మాత్రం శివ మారిపోయాడు అని సమర్థిస్తాడు. 

30 లక్షల మోసం వ్యవహారంలో రోహిణి నేరుగా గుణను కలవడం ట్విస్ట్. విల్లా విషయం చెప్పి ఆ 30 లక్షలు వసూలు చేయమంటుంది.  వెంటనే డీల్ సెట్ చేస్తాడు గుణ..నేను అందరి దగ్గరా 4శాతం తీసుకుంటాను నీ దగ్గర 2 శాతం తీసుకుంటా అంటాడు. 

కథ కీలక మలుపులు తిరిగేలా ఉంది..ఓ వైపు వీడియో బయటపడడం, మరోవైపు 30 లక్షల రికవరీ కోసం గుణ ఎంట్రీ ఇవన్నీ కలసి రోహిణి బండారం మొత్తం బయటపెట్టేలా ఉన్నాయ్.  

Frequently Asked Questions

ఈ ఎపిసోడ్ లో రోహిణి, ప్రభావతి మీనాపై ఎందుకు కోప్పడ్డారు?

మీనా వంట చేయలేదని, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నా వంట గది వైపు చూడటం లేదని ప్రభావతి మీనాపై విరుచుకుపడింది. రోహిణి కూడా మీనాపై కోప్పడింది.

30 లక్షల మోసం కేసులో రోహిణి ఎవరిని కలిసింది?

30 లక్షల మోసం వ్యవహారంలో రోహిణి నేరుగా గుణను కలిసింది. విల్లా విషయం చెప్పి ఆ 30 లక్షలు వసూలు చేయమని కోరింది.

బాలు తన బావమరిది శివను ఎందుకు కలిసాడు?

తన ఫోన్ లో ఉన్న వీడియో ఎలా లీకైందో అర్థం కావడం లేదని బాలు తన బావమరిది శివతో తన సందేహాన్ని పంచుకున్నాడు. గుణకు, తనకు మధ్య ఏదో లింక్ ఉందని అనుమానం వ్యక్తం చేసాడు.

గిరికి, విద్యకు మధ్య ఏం జరిగింది?

విద్య అపార్థం చేసుకుని గిరిని కొట్టింది. తన చున్నీ గిరి చేతిలో ఇరుక్కుని, తీసి ఇవ్వబోతుంటే మళ్ళీ అపార్థం చేసుకుని కొట్టింది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Serial Today June 05: బాలు చేతిలో ఫోన్ చూసి వణుకుతున్న పార్లలమ్మ, మీనాకు ఆహారం అయిపోనున్న గుణ - గుండెనిండా గుడిగంటలు జూన్ 05 ఎపిసోడ్
బాలు చేతిలో ఫోన్ చూసి వణుకుతున్న పార్లలమ్మ, మీనాకు ఆహారం అయిపోనున్న గుణ - గుండెనిండా గుడిగంటలు జూన్ 05 ఎపిసోడ్
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Lakshimi Raave Maa Intiki Serial Today June4th:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
Jagadhatri Serial Today June 4th:నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
జగద్ధాత్రి సీరియల్: నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Naga Dosha: ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Today Rashifal June 05: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
June 2026 Car Launches India:జూన్‌ 2026లో కార్ల జాతర! భారత్‌ మార్కెట్‌లోకి వస్తున్న టాప్ మోడల్స్!
జూన్‌ 2026లో కార్ల జాతర! భారత్‌ మార్కెట్‌లోకి వస్తున్న టాప్ మోడల్స్!
Embed widget